Great Khali Pushpa VIdeo : అల్లు అర్జున్ కి ఫిదా అయిపోయిన గ్రేట్ ఖలీ…!
Great Khali Pushpa VIdeo : ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలే ట్రెండ్ సెట్ చేయడం తెలుసు మనకు. కాని బాహుబలి సినిమా తర్వాత కొన్ని కొన్ని సినిమాలు మన సౌత్ నుంచి ఇండియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఆ జాబితాలో పుష్ప సినిమా కూడా చేరింది. పుష్ప సినిమాలో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ సిగ్నేచర్ సీన్ కి ఫిదా అయిపోయారు అందరూ. ఒక్క సినిమా వాళ్ళే కాదు స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఫిదా అయ్యారు.
మన ఇండియన్ క్రికెటర్ లు దీనికి సంబంధించి ఇప్పటికే రీల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై రెజ్లర్ గ్రేట్ ఖలీ కూడా దీనిపై ఆసక్తి చూపించాడు. ఈ సినిమాలో డైలాగులు, పాటలు అభిమానులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రారా సామీ, శ్రీవల్లి, ఊ అంటావా పాటలకు మంచి క్రేజ్ వచ్చింది. డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా వంటి వారు స్టెప్స్ కూడా వేసారు.

great khali shared puspa movie Style VIdeo
ది గ్రేట్ ఖలీ పుష్ప సినిమాలో లిప్-సింక్ చేస్తున్న వీడియోను షేర్ చేసాడు. ది గ్రేట్ ఖలీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేసాడు. అల్లు అర్జున్ తగ్గేదేలే అంటే హిందిలో ‘ఝుకేగా నహీ’ అనే డైలాగ్‌ను రీల్ చేసాడు. “పుష్పా, పుష్ప రాజ్. మెయిన్ ఝుకేగా నహీ,” అంటూ ఖలీ చేసిన వీడియో కి నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి.
View this post on Instagram