మూడుసార్లు చావును చూశా.. బుల్లితెర ‘గృహలక్ష్మీ’ నటి కష్టాలు
Kasthuri shankar : వెండితెరపై తన నటనతో ఆకట్టుకున్న కస్తూరీ శంకర్ ఇప్పడు బుల్లితెరపై అభిమానులను సంపాదించుకున్నారు. భారతీయుడు, అన్నమయ్య వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.చాలా రోజులు తరువాత మళ్లీ కస్తూరీ తెర మీదకు వచ్చారు. అయితే ఈ సారి బుల్లితెరపై సందడి చేయాలని నిర్ణయించుకున్నట్టున్నారు. ఈ క్రమంలోనే ఇంటింటి గృహలక్ష్మీ అంటూ తన సత్తాను చాటేందుకు వచ్చారు.

Gruha lakshmi Fame Kasthuri shankar Gets Emotional
Kasthuri shankar : అమాయకపు పాత్రలో, వ్యక్తిత్వం నిండుగా ఉన్న తులసి పాత్రలో కస్తూరీ శంకర్ అదరగొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ మంచి రేటింగ్‌ను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ ధారావాహికలో లాస్య, నందు, తులసి ఇలా ప్రతీ పాత్ర బాగానే రక్తికడుతోంది. ఇక ఈ సీరియట్ టీం బయటి షోల్లోనూ సందడి చేస్తోంది. పరివార్ చాంపియన్ షిప్, ఓంకార్ సిక్స్త్ సెన్స్‌లో గృహలక్ష్మీ టీం హల్చల్ చేస్తోంది.

Gruha lakshmi Fame Kasthuri shankar Gets Emotional
Kasthuri shankar : మూడుసార్లు చావును చూశా.. బుల్లితెర ‘గృహలక్ష్మీ’ నటి కష్టాలు తాజాగా కస్తూరీ ఓంకార్ షోలో గెస్టుగా వచ్చింది. సిక్స్త్ సెన్స్‌లో వచ్చిన కస్తూరీ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ కన్నీరుమున్నీరైంది. అసలు తాను ఇన్నేళ్లు సినీ కెరీర్‌కు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో వివరించింది.

Gruha lakshmi Fame Kasthuri shankar Gets Emotional
తాను ఇప్పటికే మూడు సార్లు చావును చూశాను అని, అమ్మనాన్నల విషయంలో రెండు సార్లు, తన కూతురి విషయంలో మూడో సారి అని చెప్పుకొచ్చింది. మూడేళ్లు ఆస్పత్రిలోనే కూతురిని చూసుకుంటూ ఉన్నాను.. కొడుకు పుట్టినా కూడా వాడ్ని చూడలేదు అని అన్నారు.
Tulasi alias @KasthuriShankar becomes emotional on stage!#SixthSense4 Sat & Sun at 9 PM on #StarMaa pic.twitter.com/lkwE7BaNJ8
— starmaa (@StarMaa) July 30, 2021