Guntur Kaaram Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘ గుంటూరు కారం ‘ సినిమాకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. నిర్మాతలు సమర్పించిన బడ్జెట్ ఆధారంగా గుంటూరు కారం సినిమాకు టికెట్ పై 50 రూపాయలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రిందట ఆదేశాలు జారీ చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ పెంపుతో ఆంధ్ర ప్రదేశ్లో సింగిల్ స్క్రీన్ లో గరిష్ట టిక్కెట్ ధర రూ. 205 రూపాయలైంది. ఇక మల్టీప్లెక్స్ ప్రీమియంలో రూ. 235 మల్టీప్లెక్స్ రిక్లేయినర్స్ లో రూ. 355 రేట్లు ఉండబోతున్నాయి. పెంచిన ధరలు విడుదల డేట్ నుంచి పది రోజులపాటు అమలులో ఉంటాయి. ఎలాంటి అదనపు ఆటలు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రభాస్ ‘ సలార్ ‘ సినిమాకు టికెట్ పై 40 రూపాయలు పెంపు ఇచ్చింది ఏపీ సర్కార్. అప్పట్లో ఈ నిర్ణయం ప్రభాస్ అభిమానులను నిరసన తెలిపారు. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు కాస్త ఎక్కువగా టికెట్ పై 50 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో గుంటూరు కారం సినిమాకు భారీగా అనుమతులు ఇచ్చింది. 23 లొకేషన్ లలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో 65 రూపాయలు మల్టీప్లెక్స్ లో రూ. 100 పెంపునకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. సినిమాకు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రతి లోకేషన్లో టికెట్లు 90 శాతానికి పైగా అమ్ముడుపోయాయి. మరి ముఖ్యంగా ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు ప్రారంభమైన ఎర్లీ మార్నింగ్ షోలు పూర్తిగా ఫుల్ అయ్యాయి.
ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పాటలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక శ్రీలీల హీరోయిన్ గా నటించారు. ఎప్పటిలాగే తన డాన్స్ తో శ్రీలీల ఊర మాస్ స్టెప్పులు వేశారు. మహేష్ బాబు తో కుర్చీ మడత పెట్టి సాంగ్ డాన్స్ అదిరిపోయింది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. జనవరి 12న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.