
Gruha Jyothi Scheme : గృహ జ్యోతి పథకం అసలు వస్తుందా.. రాదా..? ఆలస్యానికి కారణం ఏంటీ..?
Gruha Jyothi Scheme : అధికారంలోకి రాగానే వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మాట ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు మాత్రం తక్షణం అమల్లోకి తెచ్చారు. మిగిలిన హామీల ఎప్పుడు అమలులోకి వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే మిగిలిన అన్ని హామీల సంగతి ఎలా ఉన్నా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు దాటని వారికి ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హామీ విషయంలో ఆలస్యం జరిగితే ప్రభుత్వానికి పరువు పోతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేకించి ఈ ఒక్క పథకం విషయం ఎందుకు అంటే ఒక కారణం ఉంది. కరెంట్ బిల్లు అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి మీద ప్రభావం చూపించే విషయం.
విద్యుత్ టారిఫ్ పెరిగిన కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లోని నిరసనలు వ్యక్తం కావడం చూస్తూ ఉంటాం. రాష్ట్రంలో విద్యుత్ ను ప్రతి వ్యక్తి ఉపయోగిస్తుంటాడు కాబట్టి దాని మీద ఎలాంటి నిర్ణయం అయినా అన్ని వర్గాల మీద ప్రభావం చూపుతుంది. పైగా ఈ హామీని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పదేపదే వాడారు నెలలో 200 యూనిట్ల కంటే తక్కువ వాడినట్లు వస్తే కరెంటు బిల్లులు చెల్లించవద్దు అని, డిసెంబర్ మూడవ తేదీ ఫలితాల్లో మన ప్రభుత్వం వస్తుంది అని, అందరి బిల్లులు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పదేపదే ప్రతి సభలో అన్నారు.
ఆ మాటల అర్థం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ధనిక తేడా లేకుండా ఈ పథకాన్ని వర్తింప చేస్తారని అర్థం. గెలుపు తర్వాత రేవంత్ రెడ్డి రెండింటిని అమలు చేసి మిగిలిన వాటికోసం తెల్ల రేషన్ కార్డులు ప్రాతిపదికని ప్రకటించారు. విద్యుత్ బిల్లులకు కూడా తెల్ల రేషన్ కార్డులే ప్రాతిపదిక అనేది వర్తిస్తుందో లేదో క్లారిటీ లేదు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది అందరికీ వర్తింపజేశారు. లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా వెళ్ళవచ్చు. రేవంత్ ప్రచారంలో ప్రకటించిన మాటలను బట్టి విద్యుత్ బిల్లుల రాయితీని కూడా అలాగే వర్తింప చేయాలి. ధనికులు 200 యూనిట్ల కంట తక్కువ వాడటం అనేది జరగదు.
ఇలాంటి పథకం కోసం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటిది తెల్ల రేషన్ కార్డులకు ముడి పెట్టడం, 100 రోజులకు ముడి పెట్టడం ప్రజల ఆశలను భంగపరుస్తున్నాయి. ఈలోగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చి ఇంకో రెండు నెలలు ఆలస్యం అయితే ప్రజలంతా కచ్చితంగా ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. వంద రోజుల్లో హామీల అమలు అనేది ప్రస్తుతానికి చెప్పుకోవడం బాగానే ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలాగా కొన్ని అమలు చేయాలి. లేదంటే కాంగ్రెస్ పరువు పోతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో గృహజ్యోతి గురించి చర్చ సాగింది. కానీ తక్షణ అమలు గురించి సీరియస్గా ఆలోచించినట్లు లేదు. ఈ పథకంలో ఆలస్యం చేయడం ప్రభుత్వానికి చేటు చేస్తుందని తెలుసుకోవాలి.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.