Guppedantha Manasu 8 Aug Today Episode : వసుధరను కాదని సాక్షిని పెళ్లి చేసుకోవడానికి రిషి గ్రీన్ సిగ్నల్..  దీంతో వసుధర షాకింగ్ నిర్ణయం

Guppedantha Manasu 8 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడ్ 523 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేప్ లో రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వసుధర. ఇంతలో రిషి కారులో వస్తాడు. ఒకసారి బయటికి రావా అంటూ రిషి.. వసుధరకు మెసేజ్ చేస్తాడు. ఆశ్చర్యంగా ఉందే అని అనుకుంటుంది. నేను రిషి సార్ ను కలవాలి అని అనుకుంటే.. ఆయనకు కూడా నాకు కలవాలని ఉందా.. వస్తున్నాను సార్ అని మెసేజ్ పెట్టి బయటికి వెళ్తుంది వసుధర. తర్వాత రిషిని కొంత దూరం కారులో తీసుకెళ్తాడు రిషి. నువ్వు పెళ్లి పీటల మీది నుంచి ఎందుకు పారిపోయి వచ్చావు వసుధర ని అడుగుతాడు రిషి. దీంతో వసుధర షాక్ అవుతుంది. నీకు చదువు అంటే ఇష్టం. నువ్వు చదువుకుంటానంటే  మీ ఇంట్లో వాళ్లు వద్దన్నారు. పెళ్లి చేసుకో అన్నారు. చదువు కోసం నువ్వు పెళ్లి పీటల నుంచి పారిపోయి వచ్చావు కదా అని అంటాడు రిషి. దీంతో అవును సార్ అంటుంది వసుధర.

guppedantha manasu 08 august 2022 full episode

మాట్లాడాలి రమ్మని పిలిచి ఏవేవో మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకుంటుంది వసుధర. నువ్వు బాగా చదువుకోవాలి. మా దగ్గర ఓ స్టూడెంట్ ఉండేది. మా దగ్గర చదివి ఆ అమ్మాయి ఇంత ఎత్తుకు ఎదిగింది అని మేము గర్వంగా చెప్పుకోవాలి. అలాంటి స్థితిలో నిన్ను చూడాలని అనుకుంటున్నాను అంటాడు రిషి. దీంతో తప్పకుండా సార్ అంటుంది వసుధర. జీవితం అన్నాక ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. మనం అనుకున్నవి, అనుకోనివి చాలా జరుగుతాయి. ఏం జరిగినా ఎలాంటి సంఘటనలు ఎదురైనా జీవితంలో నీకు ఉన్న లక్ష్యాన్ని మాత్రం మరిచిపోవద్దు. జీవితం అంటేనే మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి. నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. ఏది ఏమైనా నీ లక్ష్యాన్ని చేరుకునే దిశగా నువ్వు ప్రయాణించాలి అంటాడు రిషి.

ఏంటి సార్ ఈరోజు మీరు ఇలా అని అడుగుతుంది వసుధర. దీంతో అన్నింటికీ ప్రశ్నించొద్దు. ఇక ఈ టాపిక్ మనం మాట్లాడటం అవసరం లేదు అని అనుకుంటున్నాను. వెళ్దాం పదా అని అంటాడు రిషి. దీంతో వసుధర షాక్ అవుతుంది. ఏంటి రిషి సార్.. రమ్మన్నారు చెప్పారు. విన్నాను. అడగబోతే వద్దన్నారు. అసలు ఏమైంది రిషి సార్ కు అని మనసులో అనుకుంటుంది వసుధర.

వెళ్లి కారులో కూర్చొంటుంది. కారు డ్రైవ్ చేస్తూ ఏం మాట్లాడడు రిషి. ఏంటో ఈ రిషి సార్ ఏం అర్థం కాడు. సడెన్ గా రమ్మంటే నేను ఏంటో అనుకున్నా. కానీ.. సడెన్ గా జీవితం, లక్ష్యం అంటూ ఏదో క్లాస్ పీకాడు అని అనుకుంటుంది వసుధర. ఇలా మనం కారులో వెళ్లడం బాగుంది కదా అంటాడు రిషి. దీంతో అవును సార్ అంటుంది వసుధర.

Guppedantha Manasu 8 Aug Today Episode : లగ్నపత్రిక రాయించు అని పెద్దమ్మతో చెప్పిన రిషి

అందరం ఒకేచోట కలిసి ఉండటం పండుగలా ఉంది కదా పెద్దమ్మ అంటాడు గౌతమ్. దీంతో అవును పండుగలా ఉంది అంటారు. ఇంతలో రిషి ఏం మాట్లాడుకుండా సైలెంట్ గా ఉంటాడు. ఏం మాట్లాడవేంటి అంటుంది. దీంతో వాడు తక్కువగా మాట్లాడుతాడు అని తెలుసు కదా అంటాడు తన డాడీ.

అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి.. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటాడు రిషి. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అవుతారు. పెద్దమ్మ.. సాక్షి పేరెంట్స్ ను వీలు చూసుకొని రమ్మని చెప్పండి అంటాడు రిషి. దీంతో పెద్దమ్మ సంతోషిస్తుంది.

రిషి.. సాక్షి పేరెంట్సా అంటాడు తన తండ్రి. ఎందుకు రిషి వాళ్లతో ఏం పని అని అంటుంది పెద్దమ్మ. దీంతో లగ్నపత్రిక రాసుకోవడానికి రమ్మని చెప్పండి అంటాడు రిషి. దీంతో అందరూ షాక్ అవుతారు. కూర్చొన్న వాళ్లంతా లేచి నిలబడతారు. గౌతమ్ వెళ్లి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటాడు.

లగ్నపత్రిక రాయడం ఏంటి అంటాడు. కొంపదీసి సాక్షిని పెళ్లి చేసుకుంటా అని చెబుతున్నావా అంటాడు గౌతమ్. దీంతో అవును అంటాడు రిషి. అదికాదురా అన్నా వినడు. ఈ విషయం గురించి నన్ను ఇంకేం అడగొద్దు అంటాడు. పెద్దమ్మ ఈ కార్యక్రమం తొందరగా అయ్యేలా మీరే చూడాలి అంటాడు రిషి.

ఈ విషయంలో ఎవరికైనా వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయా అంటాడు రిషి. తన తండ్రికి ఇది నచ్చదు. నాకు నచ్చలేదు అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు. కానీ నీ ఇష్టాన్ని ఎవరు కాదనగలరు అంటాడు. ఏర్పాట్లనీ చూసుకోండి. వాళ్లు, మనం మాత్రమే లగ్నపత్రిక సమయంలో ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.

మరోవైపు వసుధర.. రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మీరు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఏం సార్ ఈ దోబూచులాట అని అనుకుంటుంది వసుధర. ఇంతలో జగతి మేడమ్.. వసుధరకు ఫోన్ చేస్తుంది. చెప్పండి మేడమ్ అంటుంది వసుధర.

వసు.. అంటుంది జగతి. ఏంటిది వసు అంటుంది. రిషి ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు వసు అంటుంది. దీంతో ఏం నిర్ణయం అని అడుగుతుంది వసుధర. దీంతో రిషి.. సాక్షితో పెళ్లికి ఓకే చెప్పాడు అని అంటుంది జగతి. దీంతో వసుధర షాక్ అవుతుంది.

రిషి సార్ సాక్షిని పెళ్లి చేసుకుంటున్నారా? అసలు ఏం జరుగుతోంది అని అనుకుంటుంది వసుధర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

8 hours ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

9 hours ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

11 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

13 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

15 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

17 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

18 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

19 hours ago