Karthika Deepam 08 August 2022 Episode : హిమ, నిరూపంల పెళ్లి చేయబోతున్న సౌర్య.. ఈ పెళ్లిని ఆపాలి అని ప్లాన్ చేస్తున్న ప్రేమ్, హిమ..

Karthika Deepam 08 August 2022 Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదల అయింది. 8 సోమవారం ఎపిసోడ్ 1425 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… స్వప్న, శోభ సౌందర్య వాళ్ళ ఇంటికి వచ్చి శోభ ,నిరుపంల పెళ్లి కార్డు ఇస్తుంది. అప్పుడు సౌందర్య దానిని తీసుకొని చింపి స్వప్న మీదికి విసురుతుంది. అప్పుడు స్వప్న, మమ్మీ నా కొడుకు పెళ్లి శోభతో జరగాలని కోరుకో అని అంటుంది. అప్పుడు సౌందర్య నువ్వు ఏం చేసినా ఎలాంటి ఆటంకాలు వచ్చినా మనవరాలు పెళ్లి నా మనవడుతోనే జరుగుతుంది అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అంతలో అక్కడికి శౌర్య వచ్చి ఇదంతా చూసి మళ్లీ వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా… సౌందర్య తనను తీసుకొచ్చి నువ్వు హిమ, నిరుపంల పెళ్లి చేస్తావని ఒప్పుకున్నావు కదా.. దానికి చెప్పవే ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఎన్నాళ్ళు నుంచి బోసిపోయి ఉన్న ఈ ఇంట్లో సంతోషాలు మళ్లీ మొదలవుతాయని దానికి చెప్పవే అని సౌర్యతో అంటుంది. అప్పుడు సౌర్య ఏమీ మాట్లాడదు.స్వప్న సౌందర్యాన్ని ఇక ఆపు అని నిరూపమును అక్కడి నుంచి లాక్కొని వెళ్తుంది. కట్ చేస్తే సౌందర్య ఇంట్లో డెకరేషన్ అంతా జరుగుతూ ఉంటుంది.

సౌందర్య దీప, కార్తికల ఫోటోల దగ్గరికి వచ్చి హిమ నిరుపం ల పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అని చెప్తుంది. ఇంతలో అక్కడికి హిమ వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న ఫోటోల దగ్గరికి వచ్చి. నేను ఏమి చేయలేకపోతున్నాను ఏంటి. నేను ఏదో ఒకటి చేయాలి అని బయటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే స్వప్న సత్యం కు ఈ రెండు రోజులు నేను చెప్పింది చేయండి. మీరు ఏమి మాట్లాడొద్దు అని చెప్తుంది. అది కాదు స్వప్న ఇదంతా చేయడం చాలా కష్టం కదా అని అంటాడు. ఇదంతా కాదు నేను చెప్పింది చెప్పినట్లు చేయడమే మీ పని అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌందర్య, శౌర్య దగ్గరికి వస్తుంది. సౌందర్య ఒక అబ్బాయి ఫోటో తీసుకువచ్చి శౌర్యకి చూపించి నీకు నచ్చాడా ఇతనితో నీకు పెళ్లి చేస్తాము అని అంటుంది. అప్పుడు సౌర్య నాకేమీ వద్దు అని అంటుంది. అప్పుడు సౌందర్య కాదే హిమ పెళ్లి జరిగిపోతుంది. ఆ పెళ్లిలో అందరూ మీ పెద్ద మనవరాలు పేళ్లి ఎప్పుడు అని అడుగుతారు. నేనేం సమాధానం చెప్పాలి అని అంటుంది. అప్పుడు శౌర్య మా పెద్ద కోడలు, పెద్ద కొడుకు వచ్చినప్పుడు జరుగుతుంది అని చెప్పు అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

Karthika Deepam 08 August 2022 Full Episode

కట్ చేస్తే ప్రేమ్, హిమలు ఒక టీ షాప్ దగ్గర కూర్చొని టీ తాగుతూ నిరూపం హిమల పెళ్లి ఎలాగైనా ఆపాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ్ హిమను ఒకటి అడగవచ్చా అని అంటాడు. అప్పుడు అడుగు బావ అని అంటుంది హిమ. దాంతో ప్రేమ్ ,నువ్వు సౌర్య కోసం నీ ప్రేమని త్యాగం చేస్తున్నావా.. లేదా నిరుపమంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అప్పుడు హిమ త్యాగం లేదు ఏం లేదు నిరిపం బావ అంటే నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. అప్పుడు ప్రేమ్ సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. ఇదంతా శోభ చూస్తూ ఉంటుంది. స్వప్న ఆంటీ పెళ్లి ఆపాలని ప్లాన్ చేస్తూ ఉంటే. ఇదేమో నిరుపంతో, సౌర్య పెళ్లి చేయాలని చూస్తుంది అని అంటుంది. కట్ చేస్తే నిరూపం సౌర్య దగ్గరికి వచ్చి నేను హిమను ఎంతగానో ఇష్టపడ్డాను. తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అది నీకు తెలియక నువ్వు నన్ను ఇష్టపడ్డావు. మళ్లీ జన్మంటూ ఉంటే నీ ప్రేమను గెలిపిస్తాను సౌర్య అని అంటాడు.

అప్పుడు శౌర్య చాలా దగ్గర గడివే పెట్టావ్ డాక్టర్ సాబ్ అని అంటుంది. అది కాదు సౌర్య అని అంటుండగా.. వద్దులేండి డాక్టర్ సాబ్ నా జీవితం నేను కోరుకున్నట్లుగా లేదు కదా ఈ జన్మకు ఇక ఇంతే.. అని బాధపడుతుంది. నిరుపం, సౌర్య నువ్వే మా ఇద్దరి పెళ్లి జరిగేలా చూడాలి. అని అంటాడు. అప్పుడు సౌర్య అదేంటి డాక్టర్ సాబ్ అని అంటుంది. ఎందుకంటే మా మమ్మీని శోభాని ఎదుర్కోగల ధైర్యం సత్తా నీకు మాత్రమే ఉంది అని అంటాడు. అప్పుడు సౌర్య సరే ఈ నాటకాలన్నీ చూసే కన్నా మీ ఇద్దరి పెళ్లి తొందరగా చేయడమే చాలా బాగుంటుంది. అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నిరూపం నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గరికి వచ్చి నేను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయి అని అడగడం పెద్ద సాహసం అని థాంక్స్ సౌర్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ సౌర్య బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Recent Posts

Zodiac Signs | పండగ సమయంలో మూడు రాశులపై కేతువు అనుగ్రహం ..ఆర్థిక లాభాలు, అదృష్టం కురిసే చాన్స్

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…

11 minutes ago

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

9 hours ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

10 hours ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

12 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

14 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

16 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

18 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

19 hours ago