
intinti gruhalakshmi 08 august 2022 full episode
Intinti Gruhalakshmi 8 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 08 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడ్ 705 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ మైండ్ లోనే ఏదో చిప్ దొబ్బింది అంటుంది లాస్య. దీంతో నాకు, సామ్రాట్ మీద హాండ్ రైజ్ ఎందుకు చేయించావు అంటాడు నందు. అయితే ఏమైంది. నువ్వు గెలిచావు కదా అంటుంది లాస్య. దీంతో నేను గెలవలేదు. ఆ సామ్రాట్ ఓడిపోయాడు. కావాలని ఓడిపోయి నన్ను గెలిపించాడు అంటాడు నందు. తులసి సైగ చేయడంతో ఆ సామ్రాట్ ఓడిపోయాడు అని చెబుతాడు నందు. దీంతో ఈ విషయం నాకు తెలియదు నందు అంటుంది లాస్య. ఈ జాబ్ పోతే పోయింది మనం ఇంకోటి చూసుకుందాం అంటాడు నందు. దీంతో ఏంటి జాబ్ పోతే పోయేది. ఈ పరిస్థితుల్లో జాబ్ పోతే పొందడం ఎంత కష్టమో నీకు తెలుసు కదా అంటుంది లాస్య. ముఖ్యంగా తులసి విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య.
intinti gruhalakshmi 08 august 2022 full episode
మరోవైపు సామ్రాట్, అతడి బాబాయి తులసి ఇంటికి వస్తారు. తులసి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన సామ్రాట్ ను చూసి తులసి కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. నేను చెప్పానా బాబాయి. నువ్వు వినిపించుకోవు. అర్థం చేసుకోవు. నీ మొండితనం నీదే అంటాడు సామ్రాట్. దీంతో వీడేంటి నా మీద విరుచుకుపడుతున్నాడు అని అనుకుంటాడు బాబాయి. ఏమైందిరా అంటాడు. దీంతో చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతావు అని అంటాడు సామ్రాట్. దీంతో ఎందుకు మీ బాబాయి గారి మీద అంతలా చిరాకుపడుతున్నారు. ఏం చేశారని అంటుంది తులసి. నోరు జారి మాట అనేశావు కదా అంటాడు సామ్రాట్. ఎవరిని అంటే.. తులసి గారిని అంటాడు సామ్రాట్. అడగకూడనిది అడిగావు.. ఇప్పుడు చూడు.. తులసి గారు మనల్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుగా నిలబడ్డారా లేదా అంటాడు సామ్రాట్.
మా బాబాయికి ఈ శాస్తి జరగాల్సిందే అంటాడు సామ్రాట్. మీరు మాత్రం అస్సలు తగ్గకండి. మీరు ఇలాగే పట్టుదలగా ఉండండి. అప్పుడు గానీ మా బాబాయికి బుద్ధి రాదు అంటాడు సామ్రాట్. ఇక పదా వెళ్దాం అంటాడు సామ్రాట్. దీంతో సామ్రాట్ గారు మీ బాబాయి గారు ఏం తప్పు చేశారు అని అడుగుతుంది తులసి.
పెద్దవాళ్లు అలాగే మాట్లాడుతారు. నేనే కొంచెం అతిగా ప్రవర్తించాను. సారీ అంటుంది తులసి. దీంతో అయ్యో.. మీరెందుకు సారీ చెప్పడం అంటాడు సామ్రాట్. క్షమించమ్మా. ఇంకెప్పుడు నేను ఆ విషయం గురించి అడగను అంటాడు బాబాయి. నేను కూడా ఆ విషయాన్ని మరిచిపోయాను అంటుంది తులసి.
దీంతో నేను నమ్మేదెలా అని చెప్పి కారు దగ్గరికి వెళ్లి వీణను కారులోనుంచి తీసి తులసి దగ్గరికి వస్తాడు సామ్రాట్. తీసుకోండి అంటాడు. దీంతో ఆ వీణను తీసుకుంటుంది తులసి. ఒక గిఫ్ట్ ను ఒకసారి అందుకోవడమే గ్రేట్. అలాంటిది మా ఆంటి ఒకే గిఫ్ట్ ను ఒకే వ్యక్తి నుంచి రెండు సార్లు అందుకుంది. చాలా గ్రేట్ అంటుంది అంకిత. దీంతో అదృష్టం మీ ఆంటిదే కాదు.. నాది కూడా ఉంది అంటాడు సామ్రాట్.
ఆ తర్వాత లోపలికి రండి అంటుంది తులసి. దీంతో లేదండి నాకు అర్జెంట్ పని ఉంది అంటాడు సామ్రాట్. మా ఇంటికి వచ్చిన వాళ్లు ఎవరైనా సరే మా అమ్మ చేతి కాఫీ తాగకుండా వెళ్లరు అంటుంది దివ్య. కానీ.. అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పి వెళ్లిపోతాడు సామ్రాట్.
కట్ చేస్తే సామ్రాట్ ఇంటికి నందు, లాస్య వస్తారు. తులసి కోసం వెయిట్ చేస్తుంటారు. మీటింగ్ ఉందని తులసికి తెలుసు కదా. మరి తులసి ఇంకా రాలేదు ఏంటి అని అంటాడు సామ్రాట్. మరోవైపు ఆటోలో వస్తుంటుంది తులసి. టైమ్ సెన్స్ లేదు అంటూ నందు, లాస్య ఏదో అంటుంటారు. ఒకసారి ఫోన్ చేయండి అంటాడు నందుతో సామ్రాట్.
నందు ఫోన్ చేస్తుండగానే అప్పుడే ఆటో దిగి వచ్చేస్తుంది తులసి. వర్క్ విషయంలోనూ అంతే నిజాయితీ ఉండాలి తులసి గారు అంటాడు సామ్రాట్. ఏ కారణంతో మీకు లేట్ అయిందో నాకు తెలియదు కానీ.. ఇలా ఇంకొకరిని వెయిట్ చేయించి టైమ్ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నాకు అది నచ్చదు. వచ్చి కూర్చోండి అంటాడు సామ్రాట్.
తను కూర్చోగానే నందు, లాస్య ఇద్దరూ తులసిపై విరుచుకుపడతారు. దీంతో ఇక్కడ నేను బాస్ ను. తులసి గారు హర్ట్ అయ్యేలా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాడు సామ్రాట్. దీంతో సారీ సార్ అంటుంది లాస్య. దీంతో సారీ నాకు కాదు.. తులసి గారికి చెప్పండి అంటాడు సామ్రాట్.
దీంతో సారీ చెబుతారు ఇద్దరు. అసలు తనకు లేట్ ఎందుకు అయిందో చెబుతుంది తులసి. తన అత్తామామకు వంట వండి తీసుకొచ్చేసరికి లేట్ అయిందని చెబుతుంది తులసి. దీంతో తులసి నువ్వు గ్రేట్ అంటాడు బాబాయి. సామ్రాట్ కూడా గ్రేట్ అంటాడు.
ఆ తర్వాత నందు మ్యూజిక్ స్కూల్ డిజైన్ గురించి అందరూ చర్చిస్తారు. మీకు ఓకేనా అంటాడు సామ్రాట్. దీంతో నాకు నచ్చింది అంటుంది తులసి. ఆ తర్వాత రేపు మీరు వైజాగ్ నాతో వస్తున్నారా అని నందును అడుగుతాడు సామ్రాట్. దీంతో రేపు ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నాను కుదరదు అంటాడు నందు.
దీంతో తులసిని తీసుకెళ్లరా.. తనకూ అనుభవం వస్తుంది అంటాడు బాబాయి. దీంతో నేనూ అదే అనుకుంటున్నాను అంటాడు సామ్రాట్. దీంతో నందు, లాస్యకు కోపం వస్తుంది. మరోవైపు అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అని హనీ తన తండ్రి సామ్రాట్ ను అడుగుతుంది.
అమ్మ ఉంటే తులసి ఆంటిలా ఉండేది కావచ్చు అంటుంది. తులసి ఆంటినే నాకు అమ్మ అని పిలవాలని ఉంది అంటుంది హనీ. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సేందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.