Guppedantha Manasu 1 Sep Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు సెప్టెంబర్ 1, 2022, గురువారం ఎపిసోడ్ 544 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరీక్షలు ఎలా రాశారు అని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ అడుగుతాడు రిషి సార్. వసుధరతో మాట్లాడితే బాగుండు. అనవసరంగా తనతో ఈ నిబంధనలు పెట్టుకున్నాను అనుకుంటాడు. అందరూ ఎలా రాశారు అని అడుగుతాడు. దీంతో బాగానే రాస్తున్నాం సార్ అంటుంది ఓ విద్యార్థిని. దీంతో అందరూ అంటే అందరూ సమాధానం చెప్పాలి కదా అంటాడు రిషి. దీంతో నేను కూడా బాగానే రాస్తున్నాను సార్ అంటుంది వసుధర. ఇంకో ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ పూర్తయ్యే వరకు మీరు రిలాక్స్ కాకూడదు. అర్థం అవుతోంది కదా అని చెబుతాడు రిషి. దీంతో అర్థం అయింది సార్ అంటుంది వసుధర.
రిషి సార్ వెళ్లాక.. వసుధర మనం ఇవన్నీ మిస్ అవుతాం కదా అంటుంది పుష్ప. దీంతో ననేను మాత్రం రిషీ సార్ ను మిస్ అవుతాను అని మనసులో అనుకుంటుంది. మరోవైపు దేవయాని, సాక్షి ఇద్దరూ కలుస్తారు. వసుధరను ఇంటి వాళ్లు అందరూ నెత్తి మీద పెట్టుకుంటున్నారు. తను జీవితంలో ఏదో సాధించినట్టు ఎన్నో కలలు కంటున్నారు. తను పాస్ అయి గొప్పదని పేరు తెచ్చుకుంటే వసుధర గెలుస్తుంది. రిషి గెలుస్తాడు. మనమిద్దరం ఓడిపోతాం అంటుంది దేవయాని. నాకు దక్కని రిషి వేరే ఎవ్వరికీ దక్కకూడదు.. అని మనసులో అనుకుంటుంది. దీంతో మరి ఏం చేద్దాం ఆంటి అని అడుగుతుంది సాక్షి.
దీంతో వసుధర.. చివరి పరీక్ష రాయకూడదు అంటుంది దేవయాని. మరి ఎలా చేద్దాం అని అడుగుతుంది సాక్షి. దీంతో నేను ఒక పథకం చెబుతాను. దాన్ని నువ్వు అమలు చేయి అంటుంది దేవయాని. వసుధర పరీక్షలో ఫెయిల్ అయితే రిషి కూడా ఫెయిల్ అయినట్టే అంటుంది దేవయాని. వసుధర అసలు పరీక్ష హాల్ లోకే వెళ్లకూడదు అని అంటుంది.
కట్ చేస్తే.. వసుధరను జగతి కలుస్తుంది. పద వసు నిన్ను రూమ్ దగ్గర దింపుతాం అంటుంది. సాక్షి ఎవరినో కాలేజీలో అరేంజ్ చేస్తుంది. తనను పరీక్ష రాయకుండా అడ్డుకునేందుకు ఒక మహిళ అక్కడ వేచి చూస్తూ ఉంటుంది.
ఇంతలో రిషి వస్తాడు. ఎగ్జామ్స్ కు సంబంధించి అన్నీ సక్రమంగా ఉన్నట్టే కదా అని అడుగుతాడు రిషి. స్టూడెంట్స్ ఈ పేపర్ ఎలా రాశారంట అని అడుగుతాడు రిషి. దీంతో అందరూ దాదాపుగా బాగానే రాశాం అని చెప్పారు అంటుంది జగతి.
కొందరు ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు కదా. వాళ్లు ఏమన్నారు మేడం అని అడుగుతాడు. దీంతో వసు, నువ్వు నీ ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ బాగానే రాసినట్టు కదా అని అడుగుతుంది. దీంతో బాగా రాశాం మేడమ్ అంటుంది వసు.
తర్వాత రిషి వెళ్లిపోతాడు. వసు కూడా లైబ్రరీకి వెళ్తుంది. కట్ చేస్తే రిషి తన రూమ్ లోకి వెళ్లి ఎగ్జామ్ ఎలా రాశావు అని ఫోన్ లో వసుకు మెసేజ్ పెడతాడు. దీంతో బాగా రాశాను సార్ అంటుంది వసు.
నెక్స్ ట్ ఏంటి అని అడుగుతాడు రిషి. లాస్ట్ ఎగ్జామ్ కు చదువుకోవాలి అంటుంది వసు. ఆ ఎగ్జామ్ తర్వాత ఏంటి అని అడుగుతాడు రిషి. దీంతో ఆ ఎగ్జామ్ తర్వాత ఏంటి అని అడుగుతాడు. దీంతో పిక్ నిక్ లేదా.. లాంగ్ డ్రైవ్ అని చెబుతుంది.
ఎవరితో అని అడుగుతాడు. దీంతో నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు. అతడితో అంటుంది. పర్మిషన్ తీసుకున్నావా అని అడుగుతాడు. దీంతో పర్మిషన్ ఇంకా తీసుకోలేదు. తీసుకోవాలి అంటుంది వసు.
ఇంతలో రిషికి ఫోన్ వస్తుంది. దీంతో మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు. మరోవైపు సాక్షి ఓ మహిళను కాలేజీకి పట్టుకొస్తుంది. మత్తు మందు చల్లిన కర్చీఫ్ తెచ్చి వసు మూతికి పెడుతుంది. దీంతో వసు మూర్చపోతుంది.
వెంటనే తనను ఓ రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి వెళ్తారు సాక్షి, ఆ మహిళ. కట్ చేస్తే రాత్రి అవుతుంది. వసు ఏం చేస్తుంది అని మెసేజ్ చేస్తాడు రిషి. రిప్లయి రాదు. దీంతో తను ఏం చేస్తుందో అని ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది.
దీంతో టెన్షన్ పడతాడు రిషి. గౌతమ్ అప్పుడే వస్తాడు. ఏమైందిరా అని అడుగుతాడు. వసు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అంటాడు. మరోవైపు సాక్షి.. దేవయానికి మెసేజ్ చేస్తుంది. ఆంటీ మన ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అని మెసేజ్ పెడుతుంది.
దీంతో వెరీ గుడ్ సాక్షి. ఈ ఒక్క పని అయినా సరిగ్గా చేశావు అని అనుకుంటుంది దేవయాని. మరోవైపు ఇప్పుడు ఏం చేద్దాంరా అని అడుగుతాడు గౌతమ్. దీంతో వసు రూమ్ కు వెళ్తా అంటాడు. నేను కూడా వస్తా పదా అంటాడు.
ఇద్దరూ బయటికి వెళ్తుండగా.. నాన్నా రిషి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో చిన్న పని ఉంది పెద్దమ్మ.. బయటికి వెళ్తున్నాం అంటాడు. దీంతో సరే అంటుంది. రిషికి ఈ విషయం తెలియదు కదా అని అనుకుంటాడు.
మరోవైపు కారులో తన ఇంటికి వస్తారు. అక్కడ చూస్తే వసు ఇల్లు లాక్ చేసి ఉంటుంది. దీంతో టెన్షన్ పడతాడు రిషి. వెంటనే రెస్టారెంట్ కు కాల్ చేస్తాడు రిషి. ఎగ్జామ్ అయ్యేదాకా డ్యూటీకి రానని చెప్పింది సార్ అంటాడు.
దీంతో రిషికి ఏం చేయాలో అర్థం కాదు. ఫైనల్ ఇయర్ గ్రూప్ లో మెసేజ్ పెడతాడు. ఆ తర్వాత జగతికి ఫోన్ చేస్తాడు రిషి. మేడమ్.. వసుధర మీకు ఏమైనా కాల్ చేసిందా అని అడుగుతాడు. దీంతో లేదు రిషి ఏమైంది అని అడుగుతుంది.
మేడమ్.. వసుధర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. తన ఇంటికి వస్తే తాళం వేసి ఉంది అని గౌతమ్ ఫోన్ తీసుకొని చెబుతాడు. రెస్టారెంట్ కు కూడా తను వెళ్లలేదట అంటాడు. వసుధర కనిపించడం లేదు అంకుల్ అంటాడు మహీంద్రాతో.
మరోవైపు కాలేజీకి వెళ్దాం పదా అంటాడు రిషి. దీంతో మనం కూడా వెళ్దాం పదా అని మహీంద్రా, జగతి ఇద్దరూ బయటికి వెళ్తుంటారు. ఇంతలో దేవయాని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దీంతో వసుధర కనిపించడం లేదు అని చెబుతాడు.
దీంతో అయ్యయ్యో.. వసుధర కనిపించకపోవడం ఏంటి అని షాక్ అవుతుంది దేవయాని. తర్వాత ఇద్దరూ బయటికి వెళ్తారు. పాపం వసుధరకు ఏమైందో ఏమో అని ధరణి అంటుంది. దీంతో మనకు అవసరమా ఈ టాపిక్. వెళ్లి పని చూసుకో అంటుంది దేవయాని.
కట్ చేస్తే రిషి, గౌతమ్ ఇద్దరూ కాలేజీకి వెళ్తారు. మహీంద్రా, జగతి కూడా కాలేజీకి వస్తారు. సెక్యూరిటీని కూడా అడుగుతారు. వసుధర కనిపించలేదు అంటారు. ఆ తర్వాత వసుధరను పడుకోబెట్టిన రూమ్ కు వెళ్తాడు.
అక్కడ వసుధరను చూసి రిషి షాక్ అవుతాడు. ఆ తర్వాత తనను ఇంటికి తీసుకొస్తాడు. నీ ఆశయం బతకాలి. లే వసుధర అంటాడు. కానీ.. వసుధర లేవదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Raw Garlic Benefits : వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వెల్లుల్లిలో…
Black Tea Vs Black Coffee : ప్రస్తుత సమాజంలో ప్రజలు టీ, కాఫీలు Black Tea Vs Black…
Vaikuntha Ekadashi : 2025 వ సంవత్సరంలో కాబోతున్న విశిష్టమైన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. అయితే హిందూ ధర్మ శాస్త్రంలో…
Raashii Khanna : టాలీవుడ్ అన్ లక్కీ హీరోయిన్స్ లిస్ట్ లో రాశి ఖన్నా Raashii Khanna పేరు కచ్చితంగా…
Makara sankranti : సనాతన సాంప్రదాయాలలో హిందూ సాంప్రదాయం ఒకటి. అటువంటి సాంప్రదాయంలో కొన్ని పండుగలు హిందువులు సాంప్రదాయంగా చేసుకుంటారు.…
South Stars Squid Game : కొరియన్ వెబ్ సీరీస్ స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది.…
Venkatesh : సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయ్ అంటే వాటి మధ్య భీకరమైన ఫైట్ ఉంటుంది. ఈసారి సంక్రాంతికి బాలయ్య డాకు…
KTR : ఫార్ములా ఇ రేస్ కేసులో కొనసాగుతున్న విచారణకు సంబంధించి రాష్ట్ర మాజీ మంత్రి కెటి రామారావు (కెటిఆర్)…
This website uses cookies.