Guppedantha Manasu 21 Jan Today Episode : వసుధారకు అన్ని సౌకర్యాలు కల్పించిన రిషి.. మనసు మార్చుకొని వసును దగ్గరికి చేర్చుకుంటాడా?

Guppedantha Manasu 21 Jan Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జనవరి 2023, శనివారం ఎపిసోడ్ 666 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు వసుధార ఏంటి ఇలా చేస్తుంది. ఏమనుకుంటోంది. దీనికి పరిష్కారం లేదా అంటూ దేవయాని సీరియస్ అవుతుంది. దేవయాని.. సమస్య ఎదురైంది. కాస్త ఆలోచించి పరిష్కారం తీసుకోవాలి కదా అంటాడు ఫణీంద్రా. వదిన.. రిషి మనసు గాయం అయింది. ఆ గాయం నుంచి తేరుకోవాలి కదా అంటాడు మహీంద్రా. ఏం తేరుకుంటాడు. ఆ రోజు సాక్షికి ఇచ్చి పెళ్లి చేద్దామంటే మీరు వినలేదు. ఇప్పుడు వసుధార వచ్చి రిషిని వలలో వేసుకుంది. వసుధార నీకు మెసేజ్ పంపించింది ఆలోచిస్తుంటే నిజమే అని నాకు అనిపిస్తోంది. రిషిని వదిలేశారు కదా.. ఆ విషయమే వసుధార ముఖం మీదే చెప్పింది అంటుంది దేవయాని.

guppedantha manasu 21 january 2023 saturday full episode

ఇంతలో రిషి.. జగతికి ఫోన్ చేస్తాడు. దీంతో ఎత్తుతుంది. మేడమ్.. ఒకసారి మీరు కాలేజీకి రండి. నేను మాట్లాడాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దీంతో సరే అంటుంది. ఒకసారి కాలేజీకి రమ్మన్నాడు అక్కయ్య అంటుంది జగతి. సరే పదా అంటాడు మహీంద్రా. దీంతో నువ్వు వద్దు.. నేను ఒక్కదాన్నే వెళ్తాను అంటుంది జగతి. దీంతో ఏం కాదు అందరం వెళ్దాం అని దేవయాని అంటుంది. వద్దు అంటాడు మహీంద్రా. మరోవైపు చక్రపాణిని చూసి ఆశ్చర్యపోతుంది సుమిత్ర. నేను ఇప్పుడు నేల మీదికి వచ్చాను అంటాడు. తనకు పండ్లు కోసి ఇస్తాడు. తిను అంటాడు. నువ్వు తిను అంటాడు. ఇంతలో చక్రపాణికి.. రాజీవ్ ఫోన్ చేస్తాడు. దీంతో ఒరేయ్ మళ్లీ ఎందుకురా ఫోన్ చేస్తున్నావు అంటాడు.

నమస్కారం మామయ్య గారు అంటాడు. దీంతో ఎవడ్రా నీకు మామయ్య.. దౌర్భాగ్యుడా అంటాడు. మా అల్లుడు గారు దేవుడు అన్న మీరే.. ఇలా మాట్లాడుతున్నారా అంటాడు. దీంతో నువ్వు పారిపోయి బతికిపోయావు. నా దగ్గర ఉంటేనా అంటూ సీరియస్ అవుతాడు చక్రపాణి.

మామయ్య గారు ఆవేశపడకండి. అత్తయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు రాజీవ్. ఒరేయ్.. నువ్వు మాట్లాడుతుంటే నా ఒంటి మీద తేళ్లు, జెర్రీలు పాకినట్టుగా ఉందిరా అంటాడు. ఏం చేస్తారు మామయ్య గారు అంటాడు.

మీ కూతురు చచ్చిపోయి.. మీరు నన్ను చంపితే.. ఉన్న ఒక్క పిల్లాడి పరిస్థితి ఏంటి అంటాడు. దీంతో ఆ పిల్లాడే నీకు ప్రాణభిక్ష పెట్టాడు అనుకోరా అంటాడు. నీతో ఇంతసేపు మాట్లాడటమే తప్పు అంటాడు.

Guppedantha Manasu 21 Jan Today Episode : రాజీవ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చక్రపాణి

నా కూతురును ఖచ్చితంగా నువ్వే పొట్టన పెట్టుకొని ఉండి ఉంటావు అంటాడు చక్రపాణి. దీంతో ఇంకో కూతురును ఇవ్వండి మామయ్య గారు. వసును ఇచ్చి పెళ్లి చేయండి. మీ కూతురును గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అంటాడు రాజీవ్.

దీంతో మాట్లాడకు. నువ్వు ఇంకోసారి ఫోన్ చేస్తే చంపేస్తా అంటాడు. ఏంటి మామయ్య గారు.. ఇంకోసారి మీ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఉంది మామయ్య గారు అంటాడు. దీంతో మళ్లీ ఇంకోసారి ఫోన్ చేసినా, వసుధార గురించి మాట్లాడినా నా చేతుల్లోనే నీ చావు ఉందని గుర్తు పెట్టుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు చక్రపాణి.

కట్ చేస్తే కాలేజీ దగ్గర వెయిట్ చేస్తుంటాడు రిషి. ఇంతలో పుష్ప వస్తుంది. ఒక బాక్స్ ఇచ్చి ఏం అనుకోకుండా ఇది వసుధారకు ఇవ్వరా అంటుంది. తను మా ఇంట్లోనే ఉంటోంది సార్ అంటుంది. దీంతో నువ్వు వాళ్ల ఆయనను చూశావా అని అడుగుతాడు.

దీంతో లేదు సార్.. కానీ.. వసుధార లాంటి అమ్మాయి దొరకడం అతడి అదృష్టం అంటుంది. ఇంకా ఏమంటోంది వసుధార అని అంటాడు రిషి. వాళ్ల నాన్న వస్తున్నాడట. వాళ్ల కోసమే ఇల్లు వెతుకుతున్నా అంటుంది.

మరోవైపు జగతి రిషి దగ్గరికి వస్తుంది. వసు ఏది అని అడుగుతుంది. దీంతో ప్రాజెక్ట్ హెడ్ వసుధార వచ్చారు. నన్ను కలిశారు అని చెబుతాడు. జగతికి రూమ్ కీ ఇచ్చి ప్రాజెక్ట్ హెడ్ కు ఇవ్వండి అంటాడు.

గౌతమ్ ఫ్లాట్ కీ. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. తనకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ కల్పించండి అంటాడు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్ట్ హెడ్ గారిని గౌతమ్ ఫ్లాట్ లోకి మారమని చెప్పండి అంటాడు.

ఆ తర్వాత పుష్ప ఇచ్చిన బాక్స్ ను.. ప్రాజెక్ట్ హెడ్ కు ఇవ్వండి అని చెబుతాడు రిషి. దీంతో వసుధార దగ్గరికి వెళ్తుంది వసుధార. నేను చేసిన తప్పేంటి మేడమ్ అని అడుగుతుంది వసుధార. దీంతో తప్పొప్పుల గురించి ఇప్పుడు మాట్లాడే అవసరం లేదు అంటుంది జగతి.

మీకు రిషి సార్ ఈ కీ ఇవ్వమన్నారు. అందులో ఉండమన్నారు అని చెబుతుంది జగతి. దీంతో ఆ కీని తీసుకుంటుంది వసుధార. రిషి సార్ ఇవ్వమన్నారా అని సంతోషిస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ వసుధారకి ఇది ఇవ్వడం బాధ్యత అన్నారు.

ఎంతైనా రిషి సార్ జెంటిల్ మెన్ అని అనుకుంటుంది వసుధార. మరోవైపు అంతా తలకిందులు అయిందని అనుకుంటుంది దేవయాని. ఈ రిషి ఏంటి వెళ్లిపోతాడని అనుకున్నా.. శాశ్వతంగా దూరం అవుతాడని అనుకున్నా. కానీ.. వసుధార మళ్లీ తిరిగి వచ్చింది. రిషి వెళ్లలేదు అని అనుకుంటుంది.

రిషి మళ్లీ కరిగిపోతాడు. పైగా.. జగతిని రమ్మన్నాడు అంటే.. రిషి, జగతిలు కూడా కలిసిపోయేలా ఉన్నారు. అర్జెంట్ గా రాజీవ్ గాడికి ఫోన్ చేయాలి అని అనుకుంటుంది జగతి. ఫోన్ చేస్తుంది. రేయ్.. ఎక్కడ చచ్చావురా అంటుంది.

దీంతో రా ఏంటి.. అంటూ రాజీవ్ కోపంతో మాట్లాడుతాడు. అసలే మంట మీద ఉన్నాను అంటాడు. దీంతో నేను అంతకంటే ఎక్కువ మంట మీదున్నాను.. అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

40 minutes ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

12 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

15 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

18 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

19 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

22 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

1 day ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

2 days ago