female teacher elopes with her student in uttar pradesh
Crime News : గురువును మించిన దైవం ఉన్నదా అని ఒకప్పుడు అనుకున్నాం కానీ.. ఇప్పుడు గురువులు అలా లేరు. అలా అని అందరు గురువులు అలా ఉంటారని కాదు.. కొందరు గురువులు చేసే పనుల వల్ల మొత్తం గురువుల వ్యవస్థకే దెబ్బ పడుతోంది. పాఠాలు చెప్పాల్సిన గురువులే స్టూడెంట్స్ తో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, ప్రేమ వ్యవహారాలు నడిపించడం చేస్తూ గురువుల వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
యూపీలోని నోయిడా సెక్టార్ 123కి చెందిన 22 ఏళ్ల వయసు ఉన్న ఓ యువతి.. పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ ఉంటుంది. తన ఇంటి దగ్గరే ట్యూషన్స్ చెబుతుంది. తన ఇంటి దగ్గరే ఉంటే ఓ బాలుడు(16) ఆమె దగ్గర ట్యూషన్ కు వెళ్తుండేవాడు. ట్యూషన్ కు వెళ్లిన సమయంలో కూడా ఇద్దరూ బాగానే మాట్లాడుకుంటూ ఉండేవారు.
అయితే.. వీళ్ల ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే.. యువతి వయసు ఎక్కువ కావడంతో ఇంట్లో వాళ్ల పెళ్లికి ఒప్పుకోరేమో అని భయపడ్డారు. చివరకు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించారు. దీంతో ఇద్దరూ సరిగ్గా ప్లాన్ చేసుకున్నారు. బంధువుల ఇంటికి వెళ్తున్నా అని ఆ యువకుడు చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత యువతి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది. ఇద్దరూ ఒక చోట కలుసుకొని.. అక్కడి నుంచి పారిపోయారు. సాయంత్రం అయినా ఇంటికి ఇద్దరూ తిరిగి రాకపోవడంతో ఇరు ఇండ్లలో అనుమానం వచ్చింది. యువతి మీద డౌట్ వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ బాలుడి తండ్రి. యువతే మాయ మాటలు చెప్పి తన కొడుకును లేపుకెళ్లిందని ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
This website uses cookies.