Guppedantha Manasu 24 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 డిసెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 642 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతి ఇచ్చిన గిఫ్ట్ ను రిషి.. వసుధారకు ఇస్తాడు. ఇంతలో మహీంద్రా ఫోన్ చేస్తాడు. రిషి అక్కడ అంతా ఓకే కదా అంటే ఓకే డాడ్.. వసుధార ఊరికి వచ్చాం. తన కాలేజీని చూపిస్తోంది అని అంటాడు రిషి. పెద్దమ్మను కంగారు పడకనండి. నేను కాల్ చేయగానే వచ్చేలా మీరు రెడీగా ఉండండి అంటే సరే అంటాడు మహీంద్రా. అసలే వదిన ఏదో ప్లాన్ చేస్తోంది.. ఆ విషయం రిషికి చెప్పినా నమ్మడు అని అనుకుంటాడు మహీంద్రా. ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత కారులో రిషి, వసుధార.. ఇద్దరూ కారులో తన ఇంటి దగ్గరికి వెళ్తుంటారు. తన ఇల్లు రావడానికి కొంచెం ముందే కారు ఆపమంటుంది వసుధార. మీరు ఇప్పుడే మా ఇంటికి రాకండి. మావాళ్లు నా మీద కోపంగా ఉంటారు. నా మీద ఎంత ప్రేమ ఉన్నా కోపం వస్తుంది. అరుస్తారేమో. అక్కడ మీరు కనిపిస్తే మా ముందు మిమ్మల్ని ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను సార్ అంటుంది వసుధార.
చివరికి నా కన్నవాళ్లు అయినా సరే.. మిమ్మల్ని ఒక్క మాట అననివ్వను. ప్లీజ్ సార్ అంటుంది వసుధార. దీంతో సరే అంటాడు రిషి. దీంతో ఇద్దరూ కారు దిగుతారు. కారులో నీ రూమ్ సామాన్లు ఇంకా ఉన్నాయి అంటే.. ఉండనివ్వండి సార్ వాటి సంగతి తర్వాత చూద్దాం అంటుంది వసుధార. వచ్చేటప్పుడు ఆనందంగా ఉన్నా కానీ.. ఇప్పుడు వెళ్లాలంటే టెన్షన్ గా ఉంది సార్ అంటుంది వసుధార. దీంతో నేను ఉన్నాను కదా. నువ్వు వెళ్లు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను ఎదుర్కుంటాను అంటాడు రిషి. నేను ఫోన్ చేశాకే మీరు రండి అంటుంది వసుధార. దీంతో నీ ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తుంటాను అంటాడు రిషి. దీంతో బ్యాగ్ పట్టుకొని తన ఇంటికి బయలుదేరుతుంది వసుధార.
మరోవైపు దేవయాని ఎలా రిషి పెళ్లి ఆపాలని ప్లాన్ వేస్తుంది. జగతి దగ్గరికి వెళ్తుంది. నువ్వు ఇలా నేను రాగానే లేచి నిలుచొని మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్లేదు. కూర్చో రా అంటుంది దేవయాని. మీరు ఎలాగూ నాకు ఏ విషయం చెప్పరు. అందుకే నేను రిషికి ఫోన్ చేసి వెనక్కి రమ్మన్నాను కానీ.. రిషి రానన్నాడు అంటుంది దేవయాని.
దీంతో ఎందుకు రిషి ఇష్టానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. రిషి, వసుధార ఇష్టంతోనే ఇద్దరూ వెళ్లారు. వాళ్లను ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు అని అంటుంది జగతి. దీంతో బాగా మాట్లాడుతున్నావు జగతి అంటుంది దేవయాని. ఇదంతా మీరు చేసిన ప్లానే కదా అంటుంది దేవయాని.
నువ్వు, నీ శిష్యురాలు కావాలని ఇద్దరూ కలిసి ప్లాన్ వేసి రిషిని వలలో వేసుకునేలా చేశారు అంటుంది దేవయాని. వసుధార పేదింటి అమ్మాయి అని కూడా నేను అనలేదు. ఆ మాట ఆ అమ్మాయే అందరి ముందు చెప్పింది. రిషి జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేస్తున్నావు జగతి.
మన స్థాయికి, తాహతుకు తగని వసుధార ను తీసుకొచ్చి రిషికి అంటగడుతున్నావు. అసలు.. మీ మనసులో ఏముంది జగతి. వసుధారను అడ్డుపెట్టుకొని రిషితో అమ్మ అని పిలిపించుకోవాలన్న ఆశ నీకు ఇంకా చావలేదా? రిషి భవిష్యత్తును నాశనం చేస్తున్నావు. అసలు రిషి అంటేనే నీకు ప్రేమ లేదు అంటుంది దేవయాని.
దీంతో అక్కయ్య మీరు ఏమాట అయినా మాట్లాడండి కానీ.. రిషి మీద నాకు ప్రేమ లేదని మాత్రం మాట్లాడకండి. ఆ మాటకు నేను తట్టుకోలేను. అసలు మీకు రిషి మీద ప్రేమ ఉందా? చెప్పండి. రిషి మీద ప్రేమ లేదు.. గీమ లేదు. రిషిని అడ్డం పెట్టుకొని అందరి మీద అధికారం చెలాయించాలనే ప్లాన్ తప్పితే ఇంకేం లేదు.
ఇన్ని సంవత్సరాల్లో మీరేంటో.. మీ విషపు పన్నాగాలేంటో నాకు తెలియదనుకుంటున్నారా? ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నారు. ఇన్నాళ్లు నా జీవితంతో ఆడుకున్నారు. మహీంద్రాకు దూరం చేశారు. రిషికి దూరం చేశారు. నేను ఇంటికి రావడం మీకు ఇష్టం లేదు అయినా రిషి మాట మీదనే నేను ఈ ఇంటికి వచ్చాను అంటుంది జగతి.
నీ ధైర్యం ఎందుకు పెరిగింది. నన్నే బెదిరిస్తున్నావంటే ఇక ఉపేక్షించి లాభం లేదు. నీ సంగతి, ఆ వసుధార సంగతి చూసి తీరుతాను అంటుంది దేవయాని. కట్ చేస్తే వసుధార తన ఇంటికి వెళ్తుంది. తన తల్లి తులసి కోటకు పూజ చేయడం చూస్తుంది వసుధార.
అమ్మ అంటుంది. అక్కడే పేపర్ చదువుతున్న తన నాన్న కూడా తనను చూస్తాడు. ఇన్నాళ్లకు అమ్మ గుర్తొచ్చిందా అని అంటుంది వాళ్ల అమ్మ. ఇంతలో వాళ్ల నాన్న లేచి నిలబడతాడు. తన నాన్న దగ్గరికి వెళ్తుంది వసుధార. నాన్న అని ఆశీర్వాదం తీసుకుంటుంది.
కానీ.. దూరం జరుగుతాడు చక్రపాణి. నన్ను దీవించండి. యూనివర్సిటీ టాపర్ గా నిలిచాను అంటే.. ఎందుకు వచ్చావు అని అడుగుతాడు చక్రపాణి. దీంతో ఏం చేయాలో వసుధారకు అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.