Guppedantha Manasu 24 Nov Today Episode : జగతికి సీరియస్.. బ్లడ్ కావాలంటే ఇచ్చిన రిషి.. జగతికి ప్రాణాపాయం తప్పుతుందా? దేవయాని ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Guppedantha Manasu 24 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 నవంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 616 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇన్నాళ్లు రిషికి దూరంగా ఉండి చేసిందేముంది జగతి అంటాడు మహీంద్రా. దీంతో రిషి దగ్గరికి వెళ్లడానికి రెడీ అవుతారు జగతి, మహీంద్రా. మరోవైపు రాత్రి.. రిషికి నిద్రే పట్టదు. డాడ్ వస్తున్నాడు కదా అని చాలా సంతోషంగా ఉంటాడు. మరోవైపు జగతి, మహీంద్రా మళ్లీ వస్తున్నారా అని మళ్లీ ఏదో ప్లాన్ చేస్తుంది దేవయాని. ఉదయం అవ్వగానే జగతి, మహీంద్రా ఇద్దరూ కలిసి కారులో బయలుదేరుతారు. రిషిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మహీంద్రా చాలా ఉత్సాహంగా ఉంటాడు. రిషిని ఎన్ని రోజులు బాధపెట్టాం జగతి. ఇంకెప్పుడు రిషిని బాధపెట్టను. తనను విడిచి ఎప్పుడూ, ఎన్నడూ దూరంగా ఉండను జగతి అంటాడు మహీంద్రా. దీంతో నేను కోరుకునేది కూడా అదే మహీంద్రా అంటుంది జగతి. దీంతో రిషిని నేను ఎప్పుడూ బాధపెట్టను. నాకోసం రిషి ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్లగానే డాడ్ అంటూ ఎదురు చూస్తాడేమో అంటాడు మహీంద్రా.

guppedantha manasu 24 november 2022 full episode

రిషి వస్తున్నా.. నీ దగ్గరికే వస్తున్నా అని అనుకుంటాడు మహీంద్రా. ఇంతలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోతుంది జగతి. వెళ్లి ఒక స్తంభానికి ఢీకొంటుంది కారు. దీంతో ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పిస్తారు. మరోవైపు డాడ్ ఇంకా రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. దేవయాని దగ్గరికి వెళ్లి డాడ్ వాళ్లు ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతాడు. దీంతో రావాలనుకుంటే కదా వచ్చేది అంటుంది. వదిన డాడ్ వాళ్లు ఇంకా రాలేదు. మీకు ఏమన్నా కాల్ చేశారా అని అడుగుతాడు రిషి. దీంతో లేదు అంటుంది ధరణి. నిన్ను కాదనుకొని వెళ్లిన వాళ్ల గురించి ఎందుకు నువ్వు బాధపడతావు. నా మాట విను నాన్న. వాళ్లకు ప్రేమలు లేవు. వాళ్లు రారనుకుంటాను అంటుంది దేవయాని. దీంతో పెద్దమ్మ అలా అనకండి. డాడ్ కు నేనంటే ప్రాణం. వస్తారు పెద్దమ్మ. వస్తారు అంటాడు రిషి.

బయటికి వెళ్లి నిలుచుంటాడు రిషి. ఏంటి చూస్తూ నిలబడ్డావు పో అంటుంది దేవయాని. మరోవైపు అంకుల్ వాళ్లు ఇంక రాలేదు ఏంటి అని గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అంకుల్ కు ఫోన్ చేసి ఏం నిర్ణయించుకున్నారు అంకుల్ వస్తున్నారా అని అడిగితే అని అనుకుంటాడు గౌతమ్.

వద్దు ఎందుకులే ఫీల్ అవుతాడు అని అనుకుంటాడు. ఇంతలో గౌతమ్ కు హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. మీ విజిటింగ్ కార్డ్ ఈ కారులో దొరికింది. వీళ్లకు యాక్సిడెంట్ అయింది. వీళ్లు ఎవరో తెలియదు. వాళ్లకు స్పృహ రాలేదు. మీరు త్వరగా రండి అంటారు.

Guppedantha Manasu 24 Nov Today Episode : హాస్పిటల్ కు వెళ్లి గౌతమ్ షాక్

దీంతో ఎవరో అనుకొని హాస్పిటల్ కు వెళ్తాడు గౌతమ్. డాడ్ ను ఉదయమే రమ్మన్నాను. ఇంకా రాలేదు ఏంటి… డాడ్ ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అని వసుధారతో అంటాడు రిషి. గౌతమ్ వెళ్లబోతుండగా రిషి ఆపి ఎక్కడికి అంటాడు. దీంతో ఎవరికో యాక్సిడెంట్ అయిందట. నాకు కాల్ చేశారు అంటాడు గౌతమ్.

ఒరేయ్ గౌతమ్.. డాడ్ వాళ్లు వస్తారు కదా అంటాడు. దీంతో ఒరేయ్ నువ్వు టెన్షన్ పడకు. అంకుల్ వాళ్లు వస్తారురా.. తప్పకుండా వస్తారు. సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హాస్పిటల్ కు వెళ్తాడు గౌతమ్. యాక్సిడెంట్ ఎలా అయింది అని అంటాడు.

వాళ్లు ఎక్కడున్నారు అంటాడు. దీంతో ఐసీయూలో ఉన్నారు అంటుంది. దీంతో వాళ్లను చూసి షాక్ అవుతాడు గౌతమ్. వాళ్లను చూసి మావాళ్లే డాక్టర్. ఏం జరిగింది అని అంటాడు. దీంతో యాక్సిడెంట్ అయింది అంటాడు. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం. లోపల ఉన్న డాక్టర్ వస్తే కానీ ఏం చెప్పలేం అంటాడు డాక్టర్.

ఈ విషయం రిషికి ఎలా చెప్పాలి అని అనుకుంటాడు గౌతమ్. ఇలా జరిగింది ఏంటి.. ఏది ఏమైనా విషయం రిషికి చెప్పక తప్పదు అని అనుకుంటాడు. రిషికి ఫోన్ చేస్తాడు. అప్పుడే రిషి రూమ్ లోకి వెళ్లిన దేవయాని.. రిషి ఫోన్ కు గౌతమ్ ఫోన్ చేయడాన్ని చూస్తుంది.

ఏంటో ఈ గౌతమ్ ఫోన్ చేస్తున్నాడు. అంకుల్ వాళ్లు వచ్చారా అని ఎంక్వయిరీలు చేయడానికి ఫోన్ చేస్తున్నాడేమో. ఈ ఎంక్వయిరీలకు ఏం తక్కువ లేదు అని అనుకుంటుంది దేవయాని. ఏంటి ఇన్ని సార్లు చేస్తున్నాడు. వచ్చేవాళ్లు ఏమైనా ఆగుతారా? అని అనుకుంటుంది దేవయాని. ఫోన్ కట్ చేస్తుంది.

రిషి, వసుధారకు ఈ విషయం తెలియగానే వెంటనే ఆసుపత్రికి వస్తారు. మహీంద్రా ఓకే కానీ.. జగతికి సీరియస్ గా ఉంటుంది. తనకు అర్జెంట్ గా బ్లడ్ కావాలంటారు డాక్టర్లు. దీంతో నేనిస్తా అంటాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

2 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

5 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

7 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

10 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

12 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago