Guppedantha Manasu 25 Aug Today Episode : రిషి సార్ ఐలవ్యూ.. తన మనసులో మాటను బయటపెట్టేసిన వసుధర.. రిషి, వసు పెళ్లికి లైన్ క్లియర్.. ఇంతలో అసలు ట్విస్ట్

Guppedantha Manasu 25 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 ఆగస్టు 2022, గురువారం ఎపిసోడ్ 538 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతి మాట్లాడటం అయిపోయాక.. వసుధర మాట్లాడటానికి వెళ్తుంది. అందరికీ నమస్కారం. డీబీఎస్టీ కాలేజీ నుంచి ఇంకో బ్యాచ్ వెళ్లిపోబోతోంది. అందరి సంగతి ఏమో కానీ.. నేను మాత్రం వెళ్లలేనేమో అనిపిస్తోంది. కానీ తప్పదు. ఈ కాలేజీలో చేరడమే నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి. నేను ఎలాంటి పరిస్థితుల్లో చేరానో.. ఎలాంటి ఘటనలు ఎదుర్కొన్నానో చెప్పడానికి సమయం కూడా సరిపోదు. ఎన్నో అద్భుతమైన అనుభూతులు, ఎన్నో మెమోరీస్, ఎన్నో బంధాలు.. ఇవన్నీ కాలేజీలో నా సొంతం అయ్యాయి. ఇది నా జీవితానికి పునాది. ఈ కాలేజీ లేకపోతే వసుధర లేదు. ఈ కాలేజీ వల్లే నేను యూత్ ఐకాన్ అనిపించుకున్నాను. జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కుతాం కానీ..డీబీఎస్టీ కాలేజీ స్టూడెంట్ అవడం కంటే అదృష్టం మరొకటి ఉండదు. గడిచిన వన్నీ మెమోరీస్ గా మిగిలిపోతాయి. మెమోరీస్ అన్నీ తీపిగానే ఉండాలని లేదు కదా. ఏడుపు వస్తే ఏడవండి. నవ్వు వస్తే నవ్వండి. జీవితంలో అన్నింటినీ సమానంగా స్వీకరించండి. ధైర్యాన్ని వదులుకోకండి. అది మన నేస్తం. జీవితంలో మనం దేన్నైనా సాధించగలం. ముఖ్యంగా నేను థాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. ఒకరు నన్ను ఈ కాలేజీకి పంపించారు. ఇంకొకరు నన్ను ఇక్కడ చేర్పించారు. మరొకరు నేను వసుధర అని గుర్తింపు తీసుకొచ్చారు అంటుంది వసుధర.

guppedantha manasu 25 august 2022 full episode

జగతి మేడమ్, మహీంద్రా సార్, రిషి సార్ అని చెబుతుంది వసుధర. నాకీ అవకాశం ఇచ్చిన డీబీఎస్టీ కాలేజీ స్టాఫ్, యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు అని చెప్పి తన ప్రసంగాన్ని ముగించబోతూ ఏడుస్తుంది వసుధర. ఏడవకు వసు అని జగతి తన దగ్గరికి వస్తుంది. తనను ఓదార్చుతుంది. మరోవైపు ఫేర్ వెల్ పార్టీ అయిపోతుంది. రిషి సార్ అందరికీ తన ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉంటాడు. స్టూడెంట్స్ అంతా తనతో సెల్ఫీలు దిగుతారు. ఇంతలో వసు అక్కడికి వస్తుంది. పుష్ప కూడా వెళ్తుంది. వసు నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకుంటాను. నువ్వు కూడా రా అంటుంది పుష్ప. కానీ.. నువ్వు వెళ్లు అంటుంది వసు. ఆటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత సార్.. అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం అని చెప్పి వసుధరను తీసుకొచ్చి రిషి పక్కన నిలుచునేలా చేస్తుంది పుష్ప. కట్ చేస్తే రిషి కారులో వెళ్తూ ఉంటాడు. వసుధర చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఏంటి తన ఉద్దేశం అని అనుకుంటాడు రిషి.

వర్షం వచ్చేలా ఉండటంతో ఈ వర్షం నాకు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది అని అనుకుంటుండగా రోడ్డు మీద వసు కనిపిస్తుంది. దీంతో కారు ఆపుతాడు రిషి. వసుధర.. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు రిషి. ఇంకా వెళ్లలేదా అని అంటాడు.

దీంతో చిన్న పని మిగిలింది సార్. అందుకని ఇక్కడే ఉన్నాను అంటుంది వసుధర. మనసులోని భావాలను తగ్గించుకోవాలని ఆగాను సార్ అంటుంది వసుధర. భారమా అంటాడు. ఇష్టమైన బరువు మోసినంత కాలం మోసాను. ఇప్పుడు తప్పని పరిస్థితి వచ్చింది. అందుకే అలా అనాల్సి వచ్చింది అంటుంది.

ఇంతలో ఉరుములు, మెరుపులు స్టార్ట్ అవుతాయి. వర్షం వచ్చేలా ఉంది కదా అంటాడు. దీంతో మనసులో తుపానే వచ్చింది సార్ అంటుంది వసుధర. సరే పదా వెళ్దాం.. డ్రాప్ చేస్తాను అంటాడు రిషి. దీంతో మాట్లాడాలి సార్ అంటుంది వసుధర. కులాసాగా కారులో వెళ్తూ మాట్లాడుకునే కబుర్లు కాదు సార్.. నిజానికి నేను కాదు మాట్లాడేది. నా మనసు మాట్లాడుతుంది అంటుంది వసుధర.

Guppedantha Manasu 25 Aug Today Episode : తన మనసులో మాటను రిషికి చెప్పేసిన వసుధర

మేఘాలన్నీ ఒకచోట కలిసి వర్షం కురవబోయే ముందు ఆకాశం ఎలా ఉంటుందో అలా ఉంది సార్ నా పరిస్థితి అంటుంది వసుధర. చెప్పు వసుధర అంటాడు రిషి. కానీ.. మాటలు రావడం లేదు సార్ అంటుంది వసుధర. మాట్లాడితేనే మాట్లాడినట్టా.. ఒక మనసు ఇంకో మనసుతో మాట్లాడదా అంటుంది వసుధర.

ఇంతలో వర్షం స్టార్ట్ అవుతుంది. నేనేమీ మాట్లాడలేనేమో అంటుంది. ఒకరితో మనం ఎలా కలుస్తామో.. ఎలా ప్రయాణం చేస్తామో.. ఆ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. మీతో నా ప్రయాణం ఎలా మొదలైందో ఎక్కడికి వెళ్తోందో ఇప్పటికీ తెలియదు. దానికి సమాధానం మీరే చెప్పాలి అంటుంది వసుధర.

అసలు నువ్వు ప్రశ్నే వేయలేదు. సమాధానం అంటున్నావు అంటాడు రిషి. ఇంతలో తన బ్యాగులోనుంచి లవ్ సింబల్ తో చేసిన బాక్స్ ను తీస్తుంది. ఒక్కొక్కసారి ప్రశ్న, సమాధానం రెండూ ఒకేచోట ఉంటాయి సార్. పక్కపక్కన. దానికి ఇదే ఉదాహరణ అంటూ దాన్ని చూపిస్తుంది వసు.

ఇది మనిద్దరి మధ్య గిఫ్ట్ మాత్రమే కాదు. ఇది ఒక రెండు మనసులను కలిపే వంతెన అని నా అభిప్రాయం అంటుంది వసుధర. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటాడు రిషి. దీంతో నా మనసేంటో నాకే అర్థం కాలేదు చాలారోజులు. కానీ.. తెలుసుకున్నాను అంటుంది వసుధర.

ఇది మీ మనసు సార్ అంటుంది వసు. ఒకప్పుడు అది నా మనసు. కానీ.. అదెప్పుడో ముక్కలు అయింది కదా వసుధర అంటాడు రిషి. ముక్కలు అయింది కంటికి కనిపించే అద్దాలే సార్. అద్దం లాంటి మనసులు కాదు అంటుంది వసుధర. రింగ్ చూపిస్తుంది. దాని మీద వీఆర్ అని రాసి ఉంటుంది.

పగిలిన గిఫ్ట్ ను అతికించినంత ఈజీ కాదు. ఒకప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్పాను. నువ్వు ఏమన్నావో ఆ మాటలు ఇంకా నాకు వినిపిస్తున్నాయి అంటాడు రిషి. కాదన్నావు. మళ్లీ ఈ గిఫ్ట్ ఏంటి అంటాడు రిషి. ఈ ఉంగరం ఏంటి అంటాడు. అందులో ఒంటరి ఆర్ ఆక్షరానికి పక్కనే ఇంకో అక్షరం.

ఎలా వచ్చి చేరింది. ఎందుకు వచ్చి చేరింది. ఎందుకు ఇదంతా వసుధర అంటాడు రిషి. దీంతో ప్రేమ సార్ అంటుంది వసుధర. దీంతో రిషి షాక్ అవుతాడు. ఒకప్పుడు మీ మనసులోని మాట చెప్పారు. అప్పుడు నేను ఆలోచించలేకపోయాను. ఒకరి బెదిరింపులకు లొంగిపోయానో నా వల్ల మీకు నష్టం జరుగుతుందని అనుకున్నాను.

అప్పుడు కాదనుకున్నాను కానీ.. కాదు అనడం ఎంత వేదనకు గురి చేస్తుందో అప్పుడు తెలియలేదు.. అంటుంది వసుధర. కాదు అన్న మాట ఎంత చేదుక్షణాలను అందించిందో నాకు మాత్రమే తెలుసు అంటాడు రిషి. కాదన్నానని మీరు బాధపడ్డారు. కాదు అనాల్సి వచ్చిన నేను వంద రెట్లు ఎక్కువ బాధపడ్డాను.

ఒక్కోసారి గాయం అయిన వారి కంటే గాయం చేసిన వారే ఎక్కువ బాధపడతారు సార్ అంటుంది వసుధర. అప్పుడు నో అన్నావు. ఇప్పుడు ప్రేమ అంటున్నావు. ఎందుకు ఇలా వసుధర అంటాడు రిషి. భూమిలో నాటిన విత్తనం తొలకరి జల్లు కోసం ఎదురు చూడాలి సార్. ప్రేమ కూడా అంతేనేమో.

మీకు యాక్సిడెంట్ అయి దెబ్బ తాకితే నేను విలవిలలాడిపోయాను అంటుంది వసుధర. కాలేజీ ల్యాబ్ లో మీకు ప్రాణాపాయం కలిగితే నా గుండె ఆగిపోయినంత పని అయింది అంటుంది వసుధర. మీరు నా ఎదురుగా ఉంటారు. నేను నో అన్నానని బాధపడుతూ ఉంటారు.

చెప్పాలనుకున్నా చెప్పలేను. అవకాశం లేక మీరు అర్థం చేసుకుంటారో.. అపార్థం చేసుకుంటారో అనే భయంతో ఇన్నాళ్లు ఆగాను సార్ అంటుంది వసుధర. నా జీవితంలో గొప్ప లక్ష్యం పెట్టుకున్నాను. ఎన్నెన్నో అనుకున్నాను కానీ.. మీరు పడే బాధ ముందు నాకవేవీ గుర్తు రావడం లేదు అంటుంది వసుధర.

మీరే గుర్తొస్తున్నారు అంటుంది. నాకు మీరు కావాలి. మీ ప్రేమ కావాలి. మీతో కలిసి జీవితాంతం ప్రయాణం చేయాలి అంటుంది వసుధర. వీ ఒక ఒంటరి అక్షరం. ఆర్ అండగా తోడు అవ్వాలి. అందుకే ఈ రెండు అక్షరాలను కలిపాను అని చెబుతుంది వసుధర.

రిషి లేకుండా ఈ వసు పూర్తవ్వదు అంటుంది వసుధర. మీరు లేకుండా ఈ వసుధర లేదు అంటుంది. ఇక్కడ రెండు గుండెలు ఉన్నా.. ఆ రెండు గుండెల చప్పుడు మాత్రం ఒక్కటే. అదే ప్రేమ.. అంటుంది వసుధర. నన్ను క్షమించండి. నా ప్రేమను అంగీకరించండి.. ఐలవ్యూ అంటుంది వసుధర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

2 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

2 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago