Intinti Gruhalakshmi 25 Aug Today Episode : తులసిని పెళ్లి చేసుకో అని సామ్రాట్ ను కోరిన బాబాయి.. తన మనసులో మాటను తులసికి సామ్రాట్ చెబుతాడా?

Intinti Gruhalakshmi 25 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 ఆగస్టు 2022, గురువారం ఎపిసోడ్ 720 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసిని ఎంకరేజ్ చేద్దాం. తులసికి మనం భారంగా మాత్రం మారొద్దు. ప్రపంచమంతా ఏకమై తనను విమర్శించినా తులసి పట్టించుకోదు కానీ.. మనిద్దరం వెళ్లి తనను వేలెత్తి చూపిస్తే తను తట్టుకోలేదు. కుప్పకూలిపోతుంది అనసూయ అని పరందామయ్య తనతో చెబుతాడు. మరోవైపు ఇదిగో నీ బ్యాగు.. మీ అత్తయ్య వాళ్లింటి నుంచి తెచ్చాను అంటాడు ప్రేమ్. దీంతో ఎందుకు తెచ్చావు. నిన్ను ఎవరు తెమ్మన్నారు అంటుంది శృతి. నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు అంటుంది శృతి. నేను ఏం చేస్తున్నానో నాకు పూర్తి క్లారిటీ ఉంది. నేను ఇక్కడ ఉండేది నీ మీద ప్రేమతో కాదు.. ఆంటిని కాదనలేక అంటుంది శృతి. నేను కూడా అమ్మ కోసం అమ్మను బాధపెట్టకూడదని నేను ఒప్పుకున్నాను అంటాడు ప్రేమ్.

intinti gruhalakshmi 25 august 2022 full episode

మెత్త, దుప్పటి తీసుకొని కింద పడుకునేందుకు ప్రయత్నిస్తుంది శృతి. నాకోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అంటాడు ప్రేమ్. దీంతో ఆ దిండు, దుప్పటి నాకోసం కాదు.. నీకోసం అంటుంది శృతి. నీకు పొగరు మాత్రం ఇంకా తగ్గలేదు అంటాడు ప్రేమ్. దీంతో అవును కావాల్సినంత ఉంది. నీకు కొంచెం కావాలా అంటుంది శృతి. దీంతో కోపంతో కింద పడుకుంటాడు ప్రేమ్. కాస్త నడవడానికి దారి ఉంచి పడుకో అంటుంది శృతి. ఆ తర్వాత మంచంలో ఒక్కతే పడుకుంటుంది శృతి. కట్ చేస్తే తెల్లవారుతుంది. పరందామయ్య కనిపించడు. ఉదయమే ఎటు వెళ్లాడు అని అనుకుంటుంది తులసి. ఇంతలో పరందామయ్య ఫోన్ చేస్తాడు. నేను చెప్పేది విను. నేను ఇప్పుడు సామ్రాట్ ఇంట్లో ఉన్నాను అంటాడు.

దీంతో ఏం జరిగింది అని అంటుంది తులసి. దీంతో ఏం జరిగిందో చెప్పడం ఫోన్ లో కుదరదు కానీ.. నువ్వు ముందు వెంటనే బయలుదేరి రా.. ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అంటాడు పరందామయ్య. ఎవ్వరికీ చెప్పకుండా వెంటనే బయలు దేరి సామ్రాట్ ఇంటికి వచ్చేయ్ అంటాడు పరందామయ్య.

Intinti Gruhalakshmi 25 Aug Today Episode : సామ్రాట్ ఇంటికి వెళ్లిన తులసి

దీంతో బయలుదేరుతుండగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అనసూయ. కొంచెం పని ఉంది మళ్లీ వస్తా అని చెప్పి వెళ్తుంది తులసి. వెంటనే సామ్రాట్ ఇంటికి వస్తుంది తులసి. ఏం జరిగిందో అని టెన్షన్ పడుతూ వస్తుంది తులసి. మరోవైపు పరందామయ్య, బాబాయి ఇద్దరూ కలిసి చెస్ ఆడుతూ ఉంటారు.

ఇంతలో తులసి బెల్ కొడుతుంది. సామ్రాట్ డోర్ తీస్తాడు. సారీ సామ్రాట్ గారు.. వయసుతో పాటు మామయ్యకు కోపం, చాదస్తం పెరిగాయి. కోపంలో ఆయన్ను ఏమనొద్దు. నేను ఆయనకు సర్దిచెబుతాను. మామయ్య ముందు నేను అవన్నీ చెప్పలేను. అందుకే గుమ్మం ముందే చెబుతున్నాను అంటుంది తులసి.

లోపలికి వచ్చి చూస్తుంది తులసి. పరందామయ్య చెస్ ఆడటం చూసి షాక్ అవుతుంది. ఏంటి మామయ్య ఇది.. నన్ను ఉన్నపళంగా రమ్మని చెప్పి మీరు తీరిగ్గా చెస్ ఆడుతున్నారు. ఏమైందో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? పైగా ఇంట్లో వాళ్లకు ఎవరికీ చెప్పలేదు అంటుంది.

అసలు ఎందుకు రమ్మన్నారు అని అడుగుతుంది. దీంతో నీకు ఒక సర్ ప్రైజ్ ఇవ్వడానికి అంటాడు పరందామయ్య. ఏంటి సర్ ప్రైజ్ అని అడుగుతుంది. కానీ.. డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతారు అందరూ. ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పొచ్చు కదా అని అడుగుతుంది తులసి.

కానీ.. ఎవ్వరూ చెప్పరు. దీంతో తులసికి కోపం ఎక్కువవుతుంది. చెప్పురా అని సామ్రాట్ తో అంటాడు బాబాయి. ఇంతలో ఓ ప్లేట్ లో ఏదో తీసుకొని వస్తారు పనివాళ్లు. ఈ క్లాత్ తీసి చూడండి. సర్ ప్రైజ్ ఏంటో మీకే తెలుస్తుంది అంటాడు సామ్రాట్. దీంతో తులసికి ఏం అర్థం కాదు.

తులసి క్లాత్ తీసి చూస్తుంది. అందులో ఒక ఇన్విటేషన్ కార్డు ఉంటుంది. అదేంటి అని అనుకుంటుంది. ఈ కార్డు ఏంటి అని అడుగుతుంది. దీంతో నువ్వు కన్ స్ట్రక్షన్ చేయబోయే మ్యూజిక్ స్కూల్ కు సంబంధించిన భూమి పూజకు చెందిన ఇన్విటేషన్ కార్డు అంటాడు బాబాయి.

దీంతో తులసి మురిసిపోతుంది. దాన్ని ఓపెన్ చేసి చదువుతుంది. అందులో తన పేరును చూసి మురిసిపోతుంది. తనకు ఇంతలో తనకు ఓ విషయం గుర్తొస్తుంది. చిన్నప్పుడు ప్రేమ్ బర్త్ డే వేడుకల కోసం కార్డు కొట్టిచ్చిన నందు.. తులసి పేరు వేయించడు. దాన్ని గుర్తు చేసుకుంటుంది తులసి.

నా పేరు కార్డులో రాసినందుకు చాలా థాంక్స్ అని సామ్రాట్ కు చెబుతుంది తులసి. ఇదేం అంత పెద్ద విషయం కాదు అంటాడు సామ్రాట్. దీంతో ఇది చాలా పెద్ద విషయం అంటుంది తులసి. ఇక నుంచి పేరు కోసం మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మీ పేరుతోనే గుర్తించబడతారు అంటాడు సామ్రాట్.

నా పేరు తర్వాత మీ పేరు వేయించుకున్నారు. మీకు చిన్నతనంగా అనిపించలేదా అంటుంది తులసి. ఈ మ్యూజిక్ స్కూల్ మీది. ఆశ మీది.. ఆశయం మీది అంటాడు సామ్రాట్. మరోవైపు సామ్రాట్ ఇంట్లోనే సామ్రాట్, తులసి కలిసి పాయసం చేస్తారు. సామ్రాట్, బాబాయి పాయసం తింటూ.. తులసి లాంటి మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటావా అని బాబాయి సామ్రాట్ ను అడుగుతాడు. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Hyderabad Sperm Scam : వామ్మో.. బిర్యానీ , ఆ వీడియోలు చూపించి బిచ్చగాళ్ల నుండి వీర్యం సేకరణ..!

Hyderabad Sperm Scam : సికింద్రాబాద్‌లో ఇండియన్‌ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరిట చోటుచేసుకున్న శిశు వ్యాపార దందా…

16 minutes ago

Kalpika Ganesh : రిసార్ట్‌లో మేనేజ‌ర్‌పై బూతుల వ‌ర్షం.. మ‌రోసారి నానా హంగామా చేసిన క‌ల్పిక‌

Kalpika Ganesh : హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌ -కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్టులో క‌ల్పిక‌ నానా హంగామా…

1 hour ago

Heart Attack : ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తే… మీ గుండె ప్రమాదంలో పడుతున్నట్లే…?

Heart Attack : శరీరంలో కొన్ని వ్యాధులు కొన్ని సంకేతాలను తెలియజేస్తాయి. అయితే గుండె జబ్బులు మాత్రం శరీరానికి నిశ్శబ్దంగా…

2 hours ago

YS Jagan NCLT : జగన్ కు భారీ ఊరట.. షర్మిల కు షాక్.. YSR ఫ్యామిలీ లో సరికొత్త మలుపులు..!

YS Jagan NCLT  : వైసీపీ YCP అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి  నేషనల్ కంపెనీ…

3 hours ago

Sreeleela : ఇదేం విచిత్ర కోరిక‌రా బాబు.. డ‌బ్బులిస్తా కాని శ్రీలీల‌ నాతో ఆ ప‌ని చేస్తావా…!

Sreeleela : పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా ప్రేక్షకుల…

4 hours ago

Kingdom Movie : ఫ్యాన్స్‌కి రెండు హామీలు ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కింగ్ మూవీ హిట్ కొడుతున్నాం..!

kingdom Movie : రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండకి Vijay Devarakonda గీత గోవిందం తర్వాత ఆ రేంజ్‌ హిట్‌…

5 hours ago

MPTC ZPTC Elections : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. నామినేష‌న్ , పోలీంగ్‌, ఫ‌లితాల తేదీలు ఇవే..!

MPTC ZPTC Elections  : ఆంధ్రప్రదేశ్‌లోని Andhra pradesh  ఖాళీగా ఉన్నస్థానిక స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై…

6 hours ago

Banana : పొరపాటున అరటిపండుతో ఇది కలిపి తిన్నారంటే… యమ డేంజర్ తెలుసా…?

Banana  : ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఈ రోజుల్లో అది సాధ్యం కావడం లేదు. పిల్లల దగ్గర…

6 hours ago