Guppedantha Manasu 26 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 643 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యూనివర్సిటీ టాపర్ గా నిలిచాను.. నన్ను ఆశీర్వదించండి అని వసుధార కిందికి వంగుతుంది. తన కాళ్ల మీద పడుతుంది. దీంతో ఎందుకు వచ్చావు అని అంటాడు చక్రపాణి. ఏమండి.. రాక రాక వచ్చిన కూతురుతో అలాగేనా మాట్లాడేది అంటే నువ్వు నోర్మూయ్ అంటాడు చక్రపాణి. ఎందుకు వచ్చావు. దేనికి వచ్చావు. పలానా చక్రపాణి చిన్న కూతురు పెళ్లి పీటల మీది నుంచే లేచిపోయిందట అని అంటుంటే నేను వీధిలో నడవడానికే చచ్చిబతుకుతున్నాను. నువ్వు పాస్ అయితే ఎవడికి కావాలి.. చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? నడువు.. బయటికి నడవు. సుమిత్ర మధ్యలో అడ్డుకున్నా కూడా ఊరుకోడు చక్రపాణి. వెళ్లమని చెబుతున్నా కదా.. వినిపించడం లేదా.. ఇప్పుడు మళ్లీ ఊళ్లో వాళ్లకు ఒక టాపిక్ దొరుకుతుంది.
ఇప్పుడు చక్రపాణి కూతురు వచ్చింది. తను ఇన్నేళ్లు ఎక్కడుంది. ఏం చేసింది అని తలోమాట అనుకుంటాడు. ఇంటి గడప దాటిన ఆడదాని గురించి ఒక్కొక్కరి మాట ఎలా ఉంటుందో తెలుసా? రంపంతో కోసినట్టుగా ఉంది తెలుసా? నా పీక కోసినట్టు ఉంది అంటాడు చక్రపాణి. దీంతో నాన్నా మీకు తలవొంపులు తెచ్చే పని నేను ఏం చేయలేదు నాన్న. బాగా చదువుకున్నాను నాన్న. యూనివర్సిటీ టాపర్ అయ్యాను నాన్న అంటే.. చీ.. చీ వెదవ బతుకు అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు చక్రపాణి. దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు.
మరోవైపు కారులో ఊరంతా తిరిగిన రిషి.. ఒక హోటల్ కు వెళ్తాడు. రూమ్స్ ఉన్నాయా అని అడుగుతాడు. దీంతో ఉన్నాయి సార్.. ఎంతమంది అంటే.. నేను ఒక్కడినే ఉంటా అంటాడు. ఆ తర్వాత డిటెయిల్స్ అన్నీ తీసుకున్నాక.. వసుధారకు ఒకసారి ఫోన్ చేయాలా వద్దా అని అనుకుంటాడు.
తర్వాత ఇంట్లోకి వెళ్లిన వసుధార.. తన తల్లి ఒడిలో పడుకుంటుంది. అమ్మ.. ప్రతి క్షణం ఈ ఇల్లు, నువ్వు నాన్న గుర్తొచ్చే వారమ్మా అంటుంది వసుధార. దీంతో గుర్తొస్తే ఒక్కసారి అయినా ఫోన్ చేయాలి కదా అంటుంది సుమిత్ర.
దీంతో నేను నీకు ఫోన్ చేసినట్టు నాన్నకు తెలిస్తే నిన్ను తిడతారు కదా. అందుకే ఫోన్ చేయలేదు అంటుంది. నాన్నకు నేనంటే ఎందుకు అంత కోపం. నేను చదువు కోసమే కదా వెళ్లింది. అక్కడ ఎన్ని కష్టాలు పడ్డానో.. ఎన్ని ఉద్యోగాలు చేశానో నాకే తెలుసు అమ్మ అంటుంది వసుధార.
మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నేను గెలిచాను. యూనివర్సిటీ టాపర్ గా నిలిచాను. నేను ఏ లక్ష్యంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయానో.. అదే లక్ష్యంతో నేను ఇంటికి తిరిగి వచ్చాను అంటుంది వసుధార.
తమ్ముడెక్కడ అని అడుగుతుంది వసుధార. మాధవి అక్క ఏది. అత్తయ్య, అక్క కొడుకు ఎక్కడున్నారు అని అందరి గురించి అడుగుతుంది. దీంతో మనం ఏం పాపం చేశామో కానీ.. చెట్టుకు ఒకరు.. పుట్టకు ఒకరు అన్నట్టుగా అయిపోయాం అంటుంది సుమిత్ర.
తమ్ముడు హాస్టల్ లో చదువుతున్నాడు. మాధవి కష్టాలు తీరేటట్టు లేవు. ఎప్పుడూ పడుతూనే ఉంది. మేనత్త తీర్థయాత్రలను వెళ్లింది అంటూ అందరి గురించి చెబుతుంది సుమిత్ర. ఇక నేను వచ్చాను కదా.. మన కష్టాలు తీరినట్టే.. అంటుంది వసుధార.
చూడు అమ్మ.. నా గెలుపు చూడు. యూత్ ఐకాన్ అమ్మ. యూనివర్సిటీలో నెంబర్ వన్ అంటే మాటలు కాదు. వేల మందిలో గెలిచాను అంటుంది వసుధార. తీసుకెళ్లి కప్పు చూపిస్తుంది సుమిత్రకు.
దీంతో అక్కడికొచ్చిన చక్రపాణి ఆ కప్పును విసిరికొడతాడు. ఏం సాధించావని చెబుతున్నావు. ఏం గెలిచావని అంత గర్వంగా చెబుతున్నావు. ఈ చక్రపాణి వీధిలో నడుస్తుంటే నవ్వుతున్నారే. థూ.. నీది ఒక బతుకేనా అని నా ముఖాన ఉమ్ముతున్నారే అంటాడు.
పెళ్లి చేయడం చేతగాక వీడే ఆడపిల్లను ఇంట్లో నుంచి పంపించాడా అని నా ముఖం మీద ఉమ్ముతున్నారు అని అంటుండగా.. అప్పుడే రిషి.. వసుధారకు ఫోన్ చేస్తాడు. అయిపోయిన దాని గురించి మీరు అనవసరంగా భయపడుతున్నారు. నేనేం తప్పు చేయలేదు నాన్న అంటుంది వసుధార.
దీంతో ఇంట్లో నుంచి పారిపోవడం తప్పు కదా.. పెళ్లి పీటల నుంచి వెళ్లిపోవడం తప్పు కాదా అంటాడు. నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు అంటాడు చక్రపాణి. మరోవైపు రిషి తనకు ఫోన్ చేస్తూనే ఉంటాడు.
వెంటనే దాన్ని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పు. మళ్లీ నా పరువు తీసేస్తుంది. ఈ దౌర్భాగ్యురాలు.. నా కడుపున ఎందుకు పుట్టిందో ఏంటో.. పుట్టినప్పుడు ఇది చచ్చి ఉండి ఉంటే బాగుండేది అని అంటాడు చక్రపాణి.
దాన్ని వెళ్లిపో అను. ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు చక్రపాణి. మరోవైపు వసుధార ఫోన్ చేస్తే తీయడం లేదేంటి. ఫోన్ చేస్తే తీయకుండా ఉండదు కదా. నేను ఎదురు చూస్తుంటానని తెలుసు కదా.
నన్నెందుకు ఇలా బాధపెడుతోంది అని అనుకుంటుండగానే సార్ అంటూ తన దగ్గరికి వస్తుంది వసుధార. నాకోసం ఎదురు చూస్తున్నారు కదా.. నాకు తెలుసు సార్ అంటుంది వసుధార. దీంతో ఏంటి వసుధార నువ్వు. నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అంటాడు రిషి.
ఇప్పటికైనా వచ్చావు కదా.. థాంక్యూ అంటాడు. కానీ.. అది వసుధార కాదు.. ఆఫీస్ బాయ్. అతడిని చూసి వసుధార అనుకుంటాడు రిషి. ఈ వసుధార ఫోన్ చేసి ఉంటే నేను ఇంత టెన్షన్ పడేవాడిని కాదు కదా అని అనుకుంటాడు.
ఇంతలో మళ్లీ రిషి ఫోన్ చేసే సరికి రిషి ఫోన్ ఎత్తుతుంది వసుధార. అయితే.. తన నాన్న తనను ఇంట్లోకి రానివ్వని విషయం రిషికి చెప్పదు వసుధార. మా నాన్న గారు నా విజయాన్ని చూసి మెచ్చుకున్నారు అంటుంది వసుధార.
మీ నాన్న గారికి కోపం ఎక్కువ అన్నావు కదా అంటాడు రిషి. దీంతో ఎంత కోపం ఉన్నా నేను చిన్న కూతురును కదా.. ఎంత ఇష్టమో అంటుంది. అమ్మ పిలుస్తుంది.. తర్వాత మాట్లాడుతా అని ఫోన్ పెట్టేస్తుంది వసుధార. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.