Home » Entertainment » Guppedantha Manasu Serial 10 August 2022 Full Episode
Entertainment

Guppedantha Manasu 10 Aug Today Episode : రిషిని మరోసారి ప్రశ్నించిన వసుధర.. దేవయానిని ఈ పెళ్లి ఆపాలంటూ వేడుకున్న మహీంద్రా.. ఇంతలో ట్విస్ట్

Authored By
Varun G
The Telugu News | Published on: August 10, 2022, 10:00 am
Advertisement

Guppedantha Manasu 10 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 ఆగస్టు 2022, బుధవారం ఎపిసోడ్ 525 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి ఇంటికి వచ్చిన వసుధరను చూసి సాక్షి షాక్ అవుతుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు. అంతా నీవల్లే. రిషి నీ వల్లే నానుంచి చేజారిపోతున్నాడు. ఇప్పుడు పెళ్లి కూడా ఎక్కడ ఆగిపోతుందో అని టెన్షన్ పడుతున్నా అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. వసుధరను చూస్తాడు. నాతో పని ఉండి వచ్చింది అని అంటుంది జగతి. దీంతో సరే అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. ఆ తర్వాత రిషితో నేను మాట్లాడుతా అంటుంది వసుధర. దీంతో ఇప్పుడు రిషి చాలా డిస్టర్బ్ గా ఉన్నాడు. వద్దు.. ఇప్పుడు మాట్లాడుకు అంటుంది. దీంతో సాక్షిని రిషి సార్ పెళ్లి చేసుకోవడం ఏంటి. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి కదా అంటుంది వసుధర. నా మాట విని సైలెంట్ గా ఉండు వసు అంటుంది జగతి. దీంతో సరే.. నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధర.

Advertisement

guppedantha manasu serial 10 august 2022 full episode

వసుధర రిషి గురించే ఆలోచిస్తూ వెళ్లిపోతూ ఉంటుంది. ఇంతలో మెట్ల మీద తన కాలు జారుతుంది. ఇంతలో రిషి వచ్చి తనను పట్టుకుంటాడు. తనను చూసి అలాగే చూస్తూ ఉండి పోతుంది వసుధర. ఆ తర్వాత లేచి నిలబడుతుంది. చూసుకోలేదు సార్ అంటుంది వసుధర. దీంతో ఆ పరధ్యానం ఏంటి అని అడుగుతాడు రిషి. దీంతో పరధ్యానం ఏం లేదు. మీ ధ్యానమే ఉంది అంటుంది వసు. మనం ఒకసారి మాట్లాడుకోవాలి అంటుంది. ఇప్పుడు కాదు సార్ అంటుంది. ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది. లగ్నపత్రిక రాయించడానికి సాక్షి పేరేంట్స్ రేపు వస్తారట అని చెబుతుంది రిషికి. వసుధర నువ్వు కూడా ఉంటే మంచిది అని నా ఉద్దేశం అంటుంది దేవయాని. సరే పెద్దమ్మ.. నాకు కొంచెం పని ఉంది వెళ్లివస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు రిషి. దీంతో వసుధర కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

మహీంద్రా నువ్వు ఇక్కడున్నావా. నేనే నిన్ను రమ్మందాం అనుకుంటున్నాను అంటుంది దేవయాని. ఇంతలో ధరణి కూడా వస్తుంది. అందరికీ మంచి స్వీట్స్ చేయి. ముఖ్యంగా జగతికి అని అంటుంది దేవయాని. ఏంటి ఈ హడావుడి అని అంటాడు మహీంద్రా. దీంతో లగ్నపత్రిక రాసుకోవడానికి సాక్షి వాళ్ల పేరెంట్స్ వస్తున్నారు అని చెబుతుంది.

Guppedantha Manasu 10 Aug Today Episode : రిషి లైఫ్ తో ఆడుకోవద్దని దేవయానితో అన్న మహీంద్రా

అసలు ఇది కరెక్ట్ కాదు వదిన అంటాడు. రిషి లైఫ్ తో ఎందుకు ఆడుకుంటున్నారు. ఈ పెళ్లి ఆపండి అంటాడు మహీంద్రా. ఈ పెళ్లి నేను ఆపడం ఏంటి. ఈ పెళ్లి వద్దని సాక్షితో నేను కూడా గొడవ పెట్టుకున్నాను కదా అంటుంది దేవయాని. గౌతమ్ అదంతా నటన అని అంటుంది ధరణి.

Advertisement

మీరు ఏం చెబితే అది వింటాం. జగతిని రిషి అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు. మీ పెత్తనానికి కూడా అడ్డు చెప్పం. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయ్ అంటాడు కానీ దేవయాని వినదు. మరోవైపు రిషిని వసుధర కలుస్తుంది. నువ్వు నన్ను ఏం అడుగుతావో కూడా నాకు తెలుసు అంటాడు రిషి.

మీకంటూ ఒక మనసు ఉంది కదా. మీరు మనస్ఫూర్తిగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అని అడుగుతుంది. దీంతో ఆశలు వేరు, ఆశయాలు వేరు అంటాడు రిషి. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటాడు రిషి. నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం నువ్వు తీసుకో అంటాడు రిషి.

నీ ఆశలు, ఆశయాలు వేరు. నీ మీద అభిమానం నాకు దక్కదు. నా మీద గౌరవం నీకు దక్కదు అంటాడు రిషి. ఆ తర్వాత రిషి, సాక్షి పెళ్లి గురించి ఆందోళన చెందుతారు మహీంద్రా, జగతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి