Intinti Gruhalakshmi 10 Aug Today Episode : తులసి ఫ్లయిట్ మిస్ అవుతుందా? సామ్రాట్ కు చిరాకు వచ్చి తులసిపై కోపం పెంచుకుంటాడా? నందు, లాస్య ప్లాన్ ఏంటి?

Intinti Gruhalakshmi 10 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 ఆగస్టు 2022, బుధవారం ఎపిసోడ్ 707 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి ఇలా మారిపోవడానికి కారణం నువ్వే నందు అంటూ లాస్య నందునే బ్లేమ్ చేస్తుంది. మరోవైపు తనకు ఉన్న ఆశలేంటో గుర్తు చేసుకుంటుంది తులసి. తను ఇప్పటి వరకు విమానం ఎక్కకపోవడంతో ఇకనైనా విమానం ఎక్కాలి అని భావిస్తుంది. తనకు ఇప్పుడు మొదటి సారి విమానం ఎక్కే చాన్స్ వస్తుంది. అలాగే అందమైన ప్రకృతి మధ్య కూర్చోని ప్రకృతి పులకరించేలా పాడాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత చదువుకున్న వాళ్లతో దీటుగా ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, రాయగలగాలి అని అనుకుంటుంది తులసి. అలాగే, తన చుట్టూ ఉన్నవాళ్లు గొప్పగా ఎదగాలని అనుకుంటుంది. ఇదంతా నందుతో కలిసి ఉన్నప్పుడు రాసుకున్న ఆశలు అవి. ఇంతలో నందు వచ్చి ఏం చేస్తున్నావు అంటాడు. నా ఆశలు అవి. మీరు చూడండి అంటుంది. దీంతో ఆ సోది నాకు చదివే ఓపిక ఇప్పుడు లేదు అంటాడు. దీంతో అదేంటండి.. నా ఆశలన్నీ మీరే కదా తీర్చాల్సింది అంటుంది.

intinti gruhalakshmi serial 10 august 2022 full episode

పిచ్చి రాతలు ఆపు అంటాడు నందు. ఆ డైరీని బీరువాలో దాచుకో అంటాడు నందు. అవన్నీ నందుకు గుర్తొస్తాయి. సామ్రాట్ తులసి వైపు అడుగులు వేస్తున్నాడు. తులసి ప్రాజెక్ట్ కు ఇన్వెస్ట్ చేయడం మొదటి అడుగు, తనను వైజాగ్ కు తీసుకెళ్లడం రెండో అడుగు. వైజాగ్ నుంచి తిరిగి వచ్చాక ఆ ఐదు అడుగులు పడుతాయి అని అంటుంది లాస్య. దీంతో అలా జరగదు అంటాడు నందు. ఎందుకు జరగదు. ఇవాళో రేపో సామ్రాట్ కంపెనీకి తులసి బాస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటుంది లాస్య. మన జాగ్రత్తలో మనం ఉండాలి. తులసిని సామ్రాట్ కు దగ్గర కాకుండా చూసుకుంటే కానీ మనకు ఫ్యూచర్ ఉండదు. ఆలోచించు నందు అని చెబుతుంది లాస్య. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. ఈ మట్టిబుర్రకు ఎలా అర్థం అవుతుందో ఏమో అని అనుకుంటుంది లాస్య.

మరోవైపు తులసి ఫ్యామిలీ మొత్తం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సడెన్ గా ఇలా డల్ అయిపోయావేంటమ్మా అంటాడు ప్రేమ్. దీంతో అత్తయ్య, మామయ్యను వదిలి ఊరు వెళ్లాలంటే నాకు ఏదో భయంగా ఉంది.. అంటుంది తులసి. హ్యాపీగా ఎంజాయ్ చేయంటూ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇలా భయపడకు.. అంటాడు పరందామయ్య.

అవును ఆంటి బాధ్యతలు ఎప్పటికీ ఉండేవే.. కాసేపు వాటిని పక్కన పెట్టి లైఫ్ ను ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది అదే అంటుంది అంకిత. దీంతో సరే అలాగే చేస్తా. విమానం ఎక్కి ఏంచక్కా వైజాగ్ వెళ్తా అని అంటుంది తులసి. చాలా సంతోషిస్తుంది తులసి.

Intinti Gruhalakshmi 10 Aug Today Episode : తులసికి ఫోన్ చేసిన సామ్రాట్

వైజాగ్ ను సినిమాల్లో చూశాను. ఇప్పుడు స్వయంగా నేనే అక్కడికి వెళ్తున్నాను. సంతోషంగా ఉంది అని అనుకుంటుంది తులసి. నువ్వు ఎదుగుతూ ఉంటే ఇలాంటి అదృష్టాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అంటాడు పరందామయ్య. అవును అంటుంది తులసి.

ఒకవిధంగా నాకు జాక్ పాట్ దొరికినట్టే. సామ్రాట్ గారి వల్ల అంటుంది తులసి. ప్రయాణానికి డబ్బులు మనమే పెట్టుకోవాలి కదా. ఎంత అవుతుంది అని అడుగుతుంది తులసి. దీంతో సామ్రాట్ గారు నిన్ను కంపెనీ తరుపున తీసుకెళ్తున్నారు కాబట్టి.. నువ్వు రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు అంటాడు ప్రేమ్.

ఇంతలో తులసికి సామ్రాట్ ఫోన్ చేస్తాడు. రేపు మార్నింగ్ మన ఫ్లయిట్ 10 గంటలకు. మీరు 8 గంటలకు అల్లా ఎయిర్ పోర్ట్ లో ఉండాలి. నేను వచ్చి పికప్ చేసుకుంటా అంటాడు సామ్రాట్. దీంతో వద్దు.. నేనే ఎయిర్ పోర్ట్ కు వస్తాను అంటుంది తులసి. సరే అంటాడు సామ్రాట్.

కట్ చేస్తే తెల్లవారుతుంది. సామ్రాట్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి తులసికి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు. 8 అవుతుంది. ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతాడు. దీంతో అయ్యో.. అలారం మోగలేదు.. అంటుంది. దీంతో మీరు వెంటనే రెడీ అయి రండి. లేకపోతే ఇంకో ఫ్లయిట్ కూడా మిస్ అవుతుంది అంటాడు సామ్రాట్.

సరే.. అంటూ ఫోన్ పెట్టేస్తుంది తులసి. ఇంతలో తను బెడ్ మీది నుంచి కింద పడుతుంది. లేచి చూసుకుంటే టైమ్ 4 అవుతుంది. ఇదంతా కల అని అనుకుంటుంది తులసి. వెంటనే రెడీ అవుతుంది. అందరూ లేస్తాడు. దేవుడికి దండం పెట్టి తులసి బయలుదేరుతుంది.

ఆ దేవుడు నీకు ఎప్పుడూ తోడుంటాడు అని అంటాడు పరందామయ్య. మా గురించి ఆలోచించడం తర్వాత. ముందు నీ గురించి, వెళ్లే పని గురించి ఆలోచించు అంటుంది అనసూయ. టిఫిన్ చేసి రెడీగా ఉంచాను.. అంటుంది తులసి. అందరికీ మంచి చెడ్డ చెబుతూ ఉంటుంది తులసి.

ఆరోగ్యం జాగ్రత్త అని అందరూ తులసికి చెబుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Arattai app | వాట్సాప్‌కి పోటీగా వ‌చ్చిన ఇండియా యాప్.. స్వదేశీ యాప్‌పై జోహో ఫోకస్

Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్‌ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…

1 hour ago

RRB | భారతీయ రైల్వేలో 8,875 ఉద్యోగాలు.. NTPC నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తులు

RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…

2 hours ago

Farmers | రైతులకు విజ్ఞప్తి .. సెప్టెంబర్ 30 చివరి తేది… తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయండి!

Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…

4 hours ago

Modi | శ్రీశైలం సందర్శించనున్న ప్రధాని మోదీ .. ఇన్నాళ్ల‌కి వాటిని బ‌య‌ట‌కు తీసారు..!

Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…

6 hours ago

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…

8 hours ago

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

10 hours ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

11 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

12 hours ago