Guppedantha Manasu Serial again in Number 1 place
Guppedantha Manasu : స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు కూడా ఒకటి.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంట్టైనర్ గా సాగుతున్నా ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టీ ఆర్పీ రేటింగ్స్ లో గుప్పెడంత మనసు 10.81 రేటింగ్ ను సొంతం చేసుకొని సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది.. గతవారం మూడో స్థానంలో నిలిచిన ఈ సీరియల్ ఈవారం రెండవ స్థానాన్ని కైవసం చేస్తుంది.. 0.11 రేటింగ్ తో ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ తోపాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..! వసుధార రిషికి ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది.. రిషి తనకి ఏదైతే గిఫ్ట్ ఇచ్చాడో అదే గిఫ్ట్ ను మళ్ళీ అతికించి తన మనసును తనకు అందివ్వాలి అని అనుకుంది వసుధార.. చదువుల పండుగ ప్రోగ్రాం లో రిషికి తన మనసులో మాట చెప్పాలని అనుకుంది.. తను అనుకున్నట్టుగానే ఆ గిఫ్టును రిషి కే అందజేస్తుంది..
అంతలో ఎవరు ఊహించని విధంగా సాక్షి రిషి నేను పెళ్లి చేసుకోబోతున్నామని మైక్ లో అందరి ముందు అనౌన్స్ చేస్తుంది.. ఆల్రెడీ మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యింది.. అది నిజం కాదేమోనని రిశిని నోటితో చూపించండి చూద్దాం అని అంటుంది.. ఏంటి సాక్షి అని కోపంగా అడుగుతాడు రిషి.. నేను మీ ఫోన్ కి చాలా ఫోటోలు పంపించను.. నువ్వు ఇంత వరకు చూడలేదు.. ఒకసారి వాటిని చూడు ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండకపోతే.. ఆ ఫోటోలను మీడియా ముందు రిలీజ్ చేసి వసుధార పరువు తీస్తాను అని బెదిరిస్తుంది సాక్షి.. దాంతో రిషి మౌనంగా ఉండిపోతాడు..వసుధార ను అడ్డం పెట్టుకొని సాక్షి ఇదంతా చేసిందని ఇంట్లో అందరూ ముందు వాళ్ళ పెద్దమ్మకి అర్థం అయ్యేటట్టు రిషి చెపుతాడు.. పెద్దమ్మ అసలు ఎవరు ఈ సాక్షి .. నాకు తనకు ఏంటి సంబంధం తను ఏం చేసుకుంటుందో చేసుకోమనుంది.. నేను మాత్రం తనను పెళ్లి చేసుకోను..
Guppedantha Manasu Serial again in Number 1 place
ఈ విషయాన్ని మీరే తనకు అర్థం అయ్యేలాగా చెబుతారని నేను అనుకుంటున్నాను అని అనగానే .. ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవయానిని ఇప్పటివరకు సాక్షిని సపోర్ట్ చేస్తూ వచ్చింది.. ఇక ఆ విషయం తనే చూసుకుంటుంది అని అంటారు.. రీషినీ వెతుక్కుంటూ సాక్షి ఇంటికి వస్తుంది.. ఆంటీ మా పెళ్లి జరుగుతుందా జరగదా అని అడుగుతుంది .. జరగదు నీకు చేతనైంది చేసుకోపో.. ఈ పెళ్లి జరగదు అని అంటుంది.. సాక్షి రెండు రోజుల్లో గనక మా ఇంటికి లగ్న పత్రిక రాసుకుంటున్నాను అని మీ నుంచి కబురు రాకపోతే.. మీ అందరి ముందే నేను మిషన్ తాగి చచ్చిపోతాను.. నా చావుకి మీరే కారణమని అందరి ముందు చెబుతాను. మీ ఇంటి పరువు తీస్తాను.. మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను అని సాక్షి బెదిరిస్తుంది.. ఇక ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని దేవయాని మరో ప్లాన్ వేసింది..రిషి నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా ఇంటికి రా.. ఇదే నా ఆఖరి ఫోను..
ఇవే నా ఆఖరి మాటలు అని దేవాయని రిషి ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.. రిషి రాగానే పక్కనే ఉన్న పక్కన ఉన్న గ్లాస్ ఇవ్వమని అడిగిపోతుంది.. ఇది విషం గ్లాసు అని చెప్పి తాగాపోతుండగా పెద్దమ్మ ఏమైంది నీకు అని రిషి అంటాడు.. సాక్షి నన్ను ఎన్ని మాటల్లోనిందో తెలుసా.. నేను సాక్షిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాను.. నేను నిన్ను పెంచాను కాబట్టి.. నువ్వు సాక్షినే పెళ్లి చేసుకోవాలని నేను అనలేను కదా.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని దేవయాని అంటుంది.. ఇప్పుడు నా ముందు రెండే రెండు మార్గాలు ఉన్నాయి.. ఒకటి నువ్వే సాక్షిని పెళ్లి చేసుకోవడం.. రెండు సాక్షి ముందు తల దించుకుని ఉండటం అని.. దేవయాని నేను సాక్షి తలదించుకోమంటావా అని నిర్ణయం నువ్వే తీసుకో రిషి అని అంటుంది.. రిషి సాక్షిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు ఇదే వచ్చేవారం హైలెట్ సీన్.. వసుధార పరిస్థితి ఏంటో చూడాలి..
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.