Janaki Kalaganaledu Serial Mallika is burning to see Janaki Rama happy
Janaki Kalaganaledu : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదల కాదు. 361 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి రామాని కన్విన్స్ చేసి ఈ ఇంటికి వారసుని ఇవ్వాలని ఒక ప్లాన్ వేసుకొని రామ ఇంటికి వచ్చేలోపు ఉంటుంది. ఇదంతా మల్లిక చూసి నేను వాళ్లకంటే ముందు పిల్లల్ని కనాలి. అత్తయ్య గారి దగ్గర మంచి పేరును సంపాదించుకోవాలి. ఐదు సెంట్లు భూమిని ఎలాగైనా కొట్టేయాలి అని ప్లాన్ వేసుకుంటూ విష్ణు దగ్గరికి వెళ్తుంది. వెళ్లి విష్ణు తో సరసం ఆడుతూ ఉంటుంది. కానీ విష్ణు చిరాకు పడుతూ ఉంటాడు. కట్ చేస్తే గోవిందరాజు జ్ఞానంబ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో రామ ఇంటికి వస్తాడు. జానకిని అకాడమీకి రెడీ చేసి తీసుకెళ్తూ జ్ఞానాంబ దగ్గరికి వచ్చి వెళ్తున్న అని చెప్తారు. అప్పుడు జ్ఞానాంబ ఒక చాక్ పిస్ తో గోడమీద ఐదు నెంబర్లను వేసి ఈ ఐదు నెంబర్లలో నువ్వు నేను పెట్టిన షరతులలో ఏ ఒక్కటి కూడా తప్పు జరిగిన ఆ క్షణమే నీ చదువు ఆగిపోతుంది.
నువ్వు ఆరోజు నేను చెప్పినదానికి తలవంచాలి నువ్వు నన్ను ఎదురు ప్రశ్నించవద్దు దానికి సిద్ధంగా ఉండు అని అంటుంది జ్ఞానంభ. అప్పుడు గోవిందరాజు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ జ్ఞానం తనని ఎందుకు ఇబ్బంది పెడతావ్ తనని మనశ్శాంతిగా చదువుకొని అని అంటాడు. మీరు ఎవ్వరు ఏం చెప్పినా నా నిర్ణయం లో ఎటువంటి మార్పు ఉండదు అని జ్ఞానాంబ అంటుంది. రామ, జానకి అకాడమీకి వెళుతూ జ్ఞానాంబ పెట్టిన షరతులు గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. రామ ఏం జరుగుతుందో ఏంటో అని కంగారుపడుతూ ఉంటాడు. అమ్మ పెట్టిన శరత్లలో మీరు ఏ ఒక్కటి తప్పిన మీ చదువుకి ఆటంకం వస్తుంది మళ్ళీ మీ కల ఆగిపోతుంది అని నాకు చాలా భయమేస్తుంది ఏటి నుంచి ఎటువంటి సమస్యలు వస్తాయో ఏంటో అని అంటాడు రామ. అప్పుడు జానకి రామ గారు మీరు ఏం కంగారు పడకండి నేను అత్తయ్యగారు పెట్టిన శరతుల్ని తప్పకుండా పాటిస్తాను. ఎటువంటి ఆపద నా చదువుకు రాకుండా నేను చూసుకుంటాను.
Janaki Kalaganaledu Serial Mallika is burning to see Janaki Rama happy
అని సంతోషంగా రా మాతో చెప్తుంది. కట్ చేస్తే మల్లిక, జానకి రామల సంతోషంగా ఉండడాన్ని చూసి కుళ్లుకుంటూ వీళ్ళని ఎలాగైనా విడదీయాలి. జానకి చదువు కూడా ఆపాలి. అని తను ఏదో ఒక ప్లాన్ వేసి జ్ఞానంబా దగ్గర ఇరికించాలి. అని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి గోవిందరాజు వస్తాడు. అమ్మ పుల్లల మల్లికా మళ్లీ ఏం ప్లాన్ చేస్తున్నావ్. అని అంటాడు. అయ్యో అదేం లేదు మావయ్య గారు ఇంటి బాధ్యతలను ఎలా చూసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. నువ్వా బాధితులను చూసుకునేది అని ఎటకారంగా మాట్లాడుతాడు గోవిందరాజు. అంతలో అక్కడికి విష్ణు కూడా వస్తాడు. అప్పుడు విష్ణు కూడా మల్లికపై కామెంట్స్ వేస్తాడు. కట్ చేస్తే వెన్నెలకు తన లవ్ విషయంలో ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఎవరికి చెప్పాలో తెలియక జానకి చెప్తుంది. జానకి అత్తయ్య గారు నన్ను ఇలాంటి వాటిలో తల దూరవద్దు అని చెప్పారు కదా.. నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా మల్లికా చాటుగా చూస్తూ ఉంటుంది.
కట్ చేస్తే ఇంట్లో వంట విషయాలలో జానకిని ఇరికించాలి అని మల్లికా జ్ఞానం దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు అంతా ఇంటి పని అంతా నేనొక్కదాన్నే చేస్తున్న. జానకి ఏ పని చేయడం లేదు. అని తనకి చెప్తుంది. అదేంటి నేను చెప్పాను కదా ఇంటి బాధ్యతలని చూసుకోమని జానకికి తనని పిలువు అని అప్పుడు సంతోషంతో జానకిని పిలుస్తుంది మల్లిక. అప్పుడు జానకి అక్కడికి వచ్చి ఏంటి ఆత్తయ్య గారు అని అడగగా.. నేను నీకేం చెప్పాను నీ చదువు ఎటువంటి వాటిలో అడ్డంకి కాకూడదు అని చెప్పాను కదా.. అవును అత్తయ్య గారు మరి బాధ్యత అంతా మల్లికా మీదనే ఎందుకు వేస్తున్నావు అని అంటుంది.లేదు అత్తయ్య గారు నేను వంట చేస్తున్నాను. వంట చేయడం కూడా అయిపోయింది. అని అంటుంది జానకి.అప్పుడు మల్లికా ఒక్కసారిగా షాక్ గురవుతుంది.ఏం మల్లికా ఏంటి మళ్లీ చాడీలు చెప్పడం మొదలు పెట్టావా అని గోవిందరాజు అంటాడు.తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
This website uses cookies.