Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు, పండుగ సాయన్న మధ్య బాండింగ్ ఏంటి.. అసలుఎవరు ఇతను..?
ప్రధానాంశాలు:
Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు, పండుగ సాయన్న మధ్య బాండింగ్ ఏంటి.. అసలుఎవరు ఇతను..?
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఎన్నో అవరోధాల్ని అధిగమించి ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో సందడి చేయబోతోంది. అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ సమయంలో ఒక వివాదం ఈ చిత్రాన్ని చుట్టు ముట్టింది. తెలంగాణలో పోరాట యోధుడుగా పేరు తెచ్చుకున్న పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరించి సినిమా తీశారంటూ బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు, పండుగ సాయన్న మధ్య బాండింగ్ ఏంటి.. అసలుఎవరు ఇతను..?
Hari Hara Veera Mallu : పెద్ద సమస్యే..
సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామంటూ ఆ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్న పండుగ సాయన్న గురించి చాలా మందికి తెలీదు. అసలు ఎవరీ పండుగ సాయన్న? అతనికి, ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఉన్న లింక్ ఏమిటి? ఎందుకిది వివాదంగా మారింది? అనే విషయాల గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది.
పండుగ సాయన్న 1860 నుండి 1900 మధ్య కాలానికి చెందినవారు. ఆరోజుల్లో తెలుగు రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్నారు. సాయన్న గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు. ఎంతో బలవంతుడు. 20 కేజీల గుండును అవలీలగా ఒక్క చేత్తో లేపే వాడు. ఎద్దులబండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడు. ప్రజలను దోచుకుంటున్న దొరలు, దేశ్‌ముఖ్‌లు, అధికారులు, సంపన్నులను దోచుకొని పేదలకు పంచిపెట్టేవాడు. పేదల పాలిట రాబిన్‌హుడ్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆధిపత్య వర్గాలు మాత్రం అతనిపై బందిపోటు అనే ముద్ర వేశాయి అతని చరిత్రను ఇప్పటికీ సజీవంగా ఉంచింది సంచార జాతులు, దళిత, బహుజన కళాకారుల కంఠాలే. వీళ్లు వూరూరా తిరుగుతూ సాయన్న చరిత్రను గానం చేశారు. చారిత్రక ఆధారాలు తక్కువగా లభించే ఈ కథను దొరికిన ఆనవాళ్లతోనే ఉన్నతంగా రచించారు.