Home » Entertainment » Hari Hara Veera Mallu Release Date Fixed
Entertainment

Hari Hara Veera Mallu : ఈ సారైన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనుకున్న డేట్‌కి వ‌స్తుందా ?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 14, 2025, 9:00 am
Advertisement

Hari Hara Veera Mallu : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన తొలి భారీ పాన్ ఇండియా చిత్రం ఇప్ప‌టికే అనేక సార్లు వాయిదా ప‌డింది. ఈ మూవీని క్రిష్‌, జ్యోతికృష్ణ రూపొదించారు. ప‌వ‌న్ న‌టించిన తొలి పీరియాడిక్ ఫిల్మ్ ఇదే కావ‌డంతో ఈ సినిమాపై అభిమానుల్లోనూ, సినీ ల‌వ‌ర్స్‌లోనూ భారీ అంచ‌నాలున్నాయి. ఈ నెల 12న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ చివ‌రి నిమ‌షంలో వాయిదా ప‌డింది. దీంతో చాలా మంది ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Hari Hara Veera Mallu : ఈ సారైన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనుకున్న డేట్‌కి వ‌స్తుందా ?

Hari Hara Veera Mallu : రిలీజ్ డేట్ ఇదే..

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీని జూలై 18న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ డేట్ ఫైన‌ల్ చేసుకున్న‌ట్టుగా తెలిసింది. నెలాఖ‌రులో మూవీని రిలీజ్ చేయాల‌ని అనుకున్నా కూడా క‌న్న‌ప్ప చిత్రం ఆ స‌మ‌యంలో విడుద‌ల కానుండ‌డంతో హరిహ‌ర వీర‌మ‌ల్లు మూవీని జూలై 18న రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. ఇదే నిజ‌మైతే రెండు మూడు రోజులు అటు ఇటుగా సినిమా రిలీజ్‌కు నెల‌కు పైనే స‌మ‌యం ఉంది.

Advertisement

ప‌వ‌న్ కూడా ప్ర‌మోష‌న్స్‌ల పాల్గొంటాన‌ని నిర్మాత‌కు హామీ ఇవ్వ‌డంతో త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్స్‌ని స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. సోలో రిలీజ్ కాబ‌ట్టి హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`కు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క్రేజ్ ఉంటుంద‌ని, ప్రారంభ వ‌సూళ్లు భారీగా ఉంటాయని ఇన్ సైడ్ టాక్‌. ఇదిలా ఉంటే జూలై 11న అనుష్క ‘ఘాటీ’ రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇది రిలీజ్ అయిన వారం త‌రువాతే `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. దీని త‌రువాత ఆగ‌స్టు వ‌ర‌కు మ‌రో సినిమా లేదు. దీంతో హ‌రి హ‌ర‌కు మంచి టైమ్ ఉంటుంద‌ని, వ‌సూళ్లు భారీగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు ఆశాభావ వ్య‌క్తం చేస్తున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి