Home » Health » Lasoda Fruit
Health

Lasoda Fruit : ఇలాంటి పండు పేరు మీరు విన్నారా… ఇది ఆస్తమా, ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులకు ఒక వరం…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 14, 2025, 8:00 am
Advertisement

Lasoda Fruit : ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కల్లో అద్భుతమైన పండ్లను ఇచ్చే మొక్కలు ఉన్నాయి. ఇలాంటి పనులు చాలా అరుదుగా ఉంటాయి. దీని ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. ఈ పండు పేరు లసోడా… ఈ పండు పేరు ఎప్పుడైనా విన్నారా.. పండును సెల్వత్ అని కూడా పిలుస్తారు. ఇంకా,ఆన్లైన్లో ఈ పండుతో చేసిన పచ్చడి లభిస్తుంది. ఈ పండు ద్వారా కలిగే ఆరోగ్య తెలిస్తే మీరు షాక్ అవుతారు… దీని ప్రయోజనాల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Advertisement

Lasoda Fruit : ఇలాంటి పండు పేరు మీరు విన్నారా… ఇది ఆస్తమా, ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులకు ఒక వరం…?

ఈ పండు చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ పండును ఇండియాలో సెల్వత్ లేదా లసోడా అని పిలుస్తారు. ఎక్కువగా మధ్యప్రదేశ్ లోని బాలఘాట్ ప్రాంతంలో సమృద్ధిగా కనిపించే అరుదైన పండు. ఈ పండులో రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ప్రత్యేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ పండు విచిత్రం ఏమిటంటే… దీన్ని కూరగాయ లాగా… ఇంకా పండులాగా… పచ్చడి లాగా కూడా ఉపయోగిస్తారట. అంతే కాదు, దీనికి అతుక్కునే లక్షణం ఉండడంతో,దీన్ని నుంచి గమ్ము కూడా తయారుచేస్తారు.

Advertisement

Lasoda Fruit  ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలు

ఈ లసోడా పండులో.. ఆక్సిడెంట్లు విటమిన్లు,ఖనిజాలు, పుష్కలంగా ఉంటాయి.అందుకే,ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అని చెబుతున్నారు నిపుణులు.ఈ పండు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాక,ఆస్తమా, కీల నొప్పులు తెప్పించే ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు చికిత్సగా ఉపయోగపడుతుంది. ఈ సెల్వతు చెట్టు సాధారణంగా బాలఘాట్ లోని గ్రామాలలో కనిపిస్తుంది. ఈ చెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. కాబట్టి, పండ్లు మరింత అరుదైనవిగా మారుతున్నాయి. లోకల్ 18 బృందం మలాజి కండులోని సుఖాత్రా గ్రామాన్ని సందర్శించినప్పుడు, స్థానిక నివాసి సురేష్, ఈ విషయం అక్కడి చెట్టు గురించి విలువైన సమాచారాన్ని అందించారు. సెల్వతు చెట్టు మధ్యస్థ ఎత్తు కలిగి,అనేక కొమ్మలతో ఉంటుంది. ఈ కొమ్మలకు పండ్లు దారాళంగా కాస్తాయి. ఈ పండు నుంచి ఒక బలమైన గమ్ము లాంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది. జిగురు లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ జిగురు స్థానికంగా వివిధ అవసరాలకు ఉపయోగపడుతుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి