
Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుష్
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కథ, పవన్ నటన, కొన్ని విజువల్స్ బాగున్నప్పటికీ, వీఎఫ్‌ఎక్స్ పరంగా మాత్రం సినిమా తీవ్ర విమర్శలని ఎదుర్కొంటోంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు.
Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుష్
ముఖ్యంగా గుర్రపు స్వారీ, యుద్ధ సన్నివేశాలు, భారీ వ్యూహాలతో కూడిన విజువల్స్ అన్నీ ఆశించిన స్థాయిలో లేవని, గ్రాఫిక్స్ నాణ్యత చాలా దారుణంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. “ఇది సినిమాటిక్ అనుభూతికి తూట్లు పొడిచింది” అంటూ చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని రివ్యూలలో అయితే, సినిమాలోని రెండో భాగం మొత్తం వీఎఫ్‌ఎక్స్ లోపాలతో నిండి ఉందని స్పష్టంగా పేర్కొనబడింది.
ఈ విమర్శల నేపధ్యంలో, మూవీ మేకర్స్ ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను రీ-ఎడిట్ చేయాలా లేదా పూర్తిగా తొలగించాలా? అన్న దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సినిమా విడుదలకు ముందు నిర్మాత ఏఎం రత్నం, ‘‘హరిహర వీరమల్లు’’ కోసం 5 దేశాల్లో వీఎఫ్‌ఎక్స్ పనులు జరిగాయి, దీనిపై రూ. 250 కోట్లు ఖర్చు చేశాం’’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఫైనల్ అవుట్‌పుట్ చూసిన ప్రేక్షకులు “అంత ఖర్చు చేసి… ఈ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు.
Crimes : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…
Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఓట్ల…
IPL 2026 SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. ఆరెంజ్ ఆర్మీ మద్దతుదారులారా.. సిద్ధంగా ఉండండి! మీ గుండెల్లో ఆశలు…
Curd : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న తరుణంలో, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ…
This website uses cookies.