Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుష్
ప్రధానాంశాలు:
Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుష్
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కథ, పవన్ నటన, కొన్ని విజువల్స్ బాగున్నప్పటికీ, వీఎఫ్‌ఎక్స్ పరంగా మాత్రం సినిమా తీవ్ర విమర్శలని ఎదుర్కొంటోంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు.

Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుష్
Hari Hara Veera Mallu : అవి డిలీట్..
ముఖ్యంగా గుర్రపు స్వారీ, యుద్ధ సన్నివేశాలు, భారీ వ్యూహాలతో కూడిన విజువల్స్ అన్నీ ఆశించిన స్థాయిలో లేవని, గ్రాఫిక్స్ నాణ్యత చాలా దారుణంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. “ఇది సినిమాటిక్ అనుభూతికి తూట్లు పొడిచింది” అంటూ చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని రివ్యూలలో అయితే, సినిమాలోని రెండో భాగం మొత్తం వీఎఫ్‌ఎక్స్ లోపాలతో నిండి ఉందని స్పష్టంగా పేర్కొనబడింది.
ఈ విమర్శల నేపధ్యంలో, మూవీ మేకర్స్ ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను రీ-ఎడిట్ చేయాలా లేదా పూర్తిగా తొలగించాలా? అన్న దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సినిమా విడుదలకు ముందు నిర్మాత ఏఎం రత్నం, ‘‘హరిహర వీరమల్లు’’ కోసం 5 దేశాల్లో వీఎఫ్‌ఎక్స్ పనులు జరిగాయి, దీనిపై రూ. 250 కోట్లు ఖర్చు చేశాం’’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఫైనల్ అవుట్‌పుట్ చూసిన ప్రేక్షకులు “అంత ఖర్చు చేసి… ఈ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు.