Hari Hara Veeramallu | ఓటీటీలోకి వ‌చ్చేసిన హ‌రిహ‌ర వీర‌మల్లు.. స్వ‌ల్ప మార్పుల‌తో సంద‌డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hari Hara Veeramallu | ఓటీటీలోకి వ‌చ్చేసిన హ‌రిహ‌ర వీర‌మల్లు.. స్వ‌ల్ప మార్పుల‌తో సంద‌డి

 Authored By sandeep | The Telugu News | Updated on :20 August 2025,2:00 pm

Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ 28 రోజుల క్రితం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా గత నెల 24న థియేటర్లలోకి రాగా, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో కొన్ని కీలక మార్పులతో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

#image_title

కొన్ని మార్పుల‌తో..

సినిమా థియేటర్లలో విడుదలైన సమయంలో వీఎఫ్ఎక్స్ నాణ్యతపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గుర్రపు స్వారీ సన్నివేశం, పవన్ బాణం గురిపెట్టే సీన్స్ వంటి దృశ్యాలపై నెగటివ్ కామెంట్స్ రావడంతో, ఈ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో తొలగించి విడుద‌ల చేసిన‌ట్టు సమాచారం. అదే విధంగా క్లైమాక్స్‌లో నటుడు బాబీదేవోల్‌కు సంబంధించిన కొన్ని డైలాగులు, యాక్షన్ సీన్‌లను కూడా కట్ చేసినట్టు నెటిజన్లు చెబుతున్నారు.

ఓటీటీ వెర్షన్‌లో దాదాపు 15 నిమిషాల ఫుటేజ్‌ను తొలగించి, కథా ప్రవాహాన్ని మెరుగుపరిచేలా చిత్రబృందం మార్పులు చేసింది. అలాగే, క్లైమాక్స్‌లో ‘అసుర హననం’ పాట తర్వాత ‘Part 2’ ప్రకటనతో సినిమాను ముగించారు.ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హరి హర వీరమల్లుని రెండు భాగాలుగా రూపొందించగా, ఇప్పటికే పార్ట్ 2 కు సంబంధించిన షూటింగ్ కొంత భాగం కూడా పూర్తయింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది