Hari Teja : పుట్టుకతోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్.. హరితేజ వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hari Teja : పుట్టుకతోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్.. హరితేజ వీడియో వైరల్

Hari Teja : బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ హ‌రితేజ‌. ఆమె కెరీర్ బిగ్ బాస్ షోకు ముందు బిగ్ బాస్ షో తరువాత అనేలా మారిపోయింది. అ ఆ సినిమాతో కమెడియన్‌గా మారిపోయారు. తెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ హరితేజ నవ్వులు పూయిస్తుంటారు. అలా హరితేజకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. హరితేజ గర్భం దాల్చడం, బేబీ బంప్ ఫోటో షూట్ చేయడం, గర్భవతిగా ఉన్న సమయంలోనే పబ్‌లో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :13 March 2022,9:00 pm

Hari Teja : బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ హ‌రితేజ‌. ఆమె కెరీర్ బిగ్ బాస్ షోకు ముందు బిగ్ బాస్ షో తరువాత అనేలా మారిపోయింది. అ ఆ సినిమాతో కమెడియన్‌గా మారిపోయారు. తెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ హరితేజ నవ్వులు పూయిస్తుంటారు. అలా హరితేజకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. హరితేజ గర్భం దాల్చడం, బేబీ బంప్ ఫోటో షూట్ చేయడం, గర్భవతిగా ఉన్న సమయంలోనే పబ్‌లో పాటలు పాడటం, డ్యాన్సులు వేయడం, ఇక శ్రీమంతం వేడుకల్లో అయితే హరితేజ చేసిన రచ్చ, వేసిన స్టెప్పులు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

అన్నింటి కంటే ముఖ్యంగా డెలీవరి సమయంలో తాను పడిన కష్టాల గురించి హరితేజ చెప్పిన విషయాలు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి.హ‌రితేజ 2021 ఏప్రిల్‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. భూమి దీపక్ రావ్ అని పాపకు నామకరణం చేశారు. భూమి అంటే సహనంగా ఉంటుంది అనుకునేరు, కోపంవస్తే భూకంపమే అంటూ.. కూతురు పేరు వెనుక అర్థం కూడా చెప్పింది హరితేజ. అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌రావు ఆడిస్తున్న కొన్ని వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా త‌న కూతురికి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఇందులో హ‌రితేజ భీమ్లా నాయ‌క్‌లోని లాలా పాట పాడుతుండగా, కూతురు కూడా ఆ పాట‌ను హ‌మ్ చేస్తుండ‌డం గ‌మనించ‌వ‌చ్చు.

Hari Teja in video viral

Hari Teja in video viral

పుట్టుక‌తోనే త‌న కూతురు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్ అని హ‌రితేజ అంటుంది.హ‌రితేజ డెలివరీ సమయంలోనే కరోనా పాజిటివ్ అని రావడం, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించుకోకపోవడం, పుట్టబోయే బిడ్డకు కూడా ఏదైనా ప్రమాదం ఉంటుందా? అనే అనుమానం, సాయం చేసేందుకు కూడా ఎవ్వరూ లేరని, డెలీవరి వార్డులో మా ఆయనే సేవలు చేశారంటూ ఇలా తన వ్యథను అంతా వివరించారు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ప‌లు టీవీషోస్ చేస్తుంది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది