Hari Teja : హరితేజ ఎన్నాళ్ల‌కి క‌నిపించింది.. ఆమె అదే అందంతో.. వీడియో ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Hari Teja : హరితేజ ఎన్నాళ్ల‌కి క‌నిపించింది.. ఆమె అదే అందంతో.. వీడియో !

Hari Teja : నటి హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. బుల్లితెర‌పై మొద‌ట్లో యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన హరితేజ ఆ త‌ర్వాత న‌టిగా ప‌లు సీరియ‌ల్స్, సినిమాల‌లో న‌టించి అల‌రించింది. నితిన్‌, సమంత నటించిన అఆ సినిమాలో హరితేజ పోషించిన మంగమ్మ పాత్ర అందరి మ‌న‌సుల‌లో మెదులుతూనే ఉంటుంది. ఇక కెరీర్‌ ఆరంభంలో మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం, కన్యాదానం, తాళికట్టు శుభవేళ, శివరంజని వంటి ధారావాహికల్లో నటించింది. అలాగే సిక్త్స్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 May 2024,3:30 pm

ప్రధానాంశాలు:

  •  Hari Teja : హరితేజ ఎన్నాళ్ల‌కి క‌నిపించింది.. ఆమె అదే అందంతో..!

Hari Teja : నటి హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. బుల్లితెర‌పై మొద‌ట్లో యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన హరితేజ ఆ త‌ర్వాత న‌టిగా ప‌లు సీరియ‌ల్స్, సినిమాల‌లో న‌టించి అల‌రించింది. నితిన్‌, సమంత నటించిన అఆ సినిమాలో హరితేజ పోషించిన మంగమ్మ పాత్ర అందరి మ‌న‌సుల‌లో మెదులుతూనే ఉంటుంది. ఇక కెరీర్‌ ఆరంభంలో మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం, కన్యాదానం, తాళికట్టు శుభవేళ, శివరంజని వంటి ధారావాహికల్లో నటించింది. అలాగే సిక్త్స్ సెన్స్‌, పటాస్‌, పండగ చేస్కో, సూపర్‌ సింగర్‌ వంటి టీవీ షోల్లోనూ సందడి చేసింది. ఇ క బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకుది.

Hari Teja : హ‌రితేజ ఇలా మారింది..

అత్తారింటికి దారేది, నేనొక్కడినే, దువ్వాడ జగన్నాథం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్‌, కృష్ణార్జున యుద్ధం, సమ్మోహనం, ఎఫ్‌ 2, రాజుగారి గది 3, హిట్‌, జాంబిరెడ్డి, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే తదితర సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. చిరంజీవి భోళాశంకర్‌లోనూ తళుక్కున మెరిసింది. తన మాటల గారడీతో మెప్పించే హరితేజ టాలీవుడ్ తెరపై మరో సూర్యకాంతంగా పేరుతెచ్చుకున్నారు హరితేజ. ఇక ఈ అమ్మ‌డు 2015లో బెంగళూరుకు చెందిన దీపక్‌ అనే వ్యక్తిని పెళ్లాడిందీ అందాల తార. వీరికి 2021లో భూమి అనే కుమార్తె జన్మించింది. అమ్మయిన తర్వాత కొద్దిగా బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత చాలా స్లిమ్‌గా మారిపోయింది.

Hari Teja హరితేజ ఎన్నాళ్ల‌కి క‌నిపించింది ఆమె అదే అందంతో

Hari Teja : హరితేజ ఎన్నాళ్ల‌కి క‌నిపించింది.. ఆమె అదే అందంతో..!

నటి, యాంకర్ హరితేజ చాలా రోజుల తర్వాత ఆ ఒక్కటి అడక్కు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా అందాలు ఆరబోస్తూ కనిపించింది.ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన యాంకర్ హరితేజ ఈ మధ్య కాలంలో మోడ్రన్ లుక్‌తో ఇచ్చిపడేస్తుంది. తాజాగా ఆ ఒక్కటీ అడక్కు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోయిన హ‌రితేజ‌ని చూసిన నెటిజన్లు అప్పటికీ ఇప్పటికీ ఎంత ఛేంజ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం హ‌రితేజ లుక్స్ మాత్రం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక ఈ భామ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అమ్మాయిల‌పై సినిమాలు వ‌స్తే చాలా హ్యాపీ అని ఆ ఒక్క‌టి అడక్కు సినిమా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెప్పుకొచ్చంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది