Harish Shankar : తెర మీదకు హరీష్ శంకర్.. చాలా పెద్ద స్కెచ్ వేసాడుగా..!
ప్రధానాంశాలు:
Harish Shankar : తెర మీదకు హరీష్ శంకర్.. చాలా పెద్ద స్కెచ్ వేసాడుగా..!
Harish Shankar : డైరెక్టర్ హరీష్ శంకర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న టైంలో సరదగా రెండు సినిమాల్లో కనిపించారు. అది వేరు ఇప్పుడు ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. సుహాస్ హీరోగా రాం గోధల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓ భామ అయ్యో రామ సినిమా ఒక లవ్ స్టోరీగా వస్తుంది. ఈ సినిమాలో మాళవిక మనోజ్ కథానాయిగా చేస్తుంది. ఈ సినిమాను హరీష్ నల్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఐతే ఈ ప్రేమకథలో హరీష్ శంకర్ భాగం అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. హరీష్ శంకర్ నటిస్తున్నాడు అంటే సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండే ఉంటుందని అనుకుంటున్నారు. లేదా తన ద్వారా ఏదైనా మెసేజ్ ఇవ్వాలని హరీష్ శంకర్ ఈ అవకాశాన్ని అందుకున్నారా అన్నది చూడాలి.

Harish Shankar : తెర మీదకు హరీష్ శంకర్.. చాలా పెద్ద స్కెచ్ వేసాడుగా..!
Harish Shankar : లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ..
లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు సుహాస్. ఐతే మధ్యలో కొన్ని అటు ఇటు అవుతున్నా తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు. సుహాస్ చేస్తున్న ఓ భామ అయ్యో రామ సినిమా ఒక మంచి లవ్ స్టోరీగా వస్తుంది. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కథ లవ్ స్టోరీనే అయినా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.
ఏదైనా ఈవెంట్స్ లో హరీష్ శంకర్ మాటలే చాలా పదునుగా ఉంటాయి. అలాంటిది ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించడం అంటే సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా లవ్ స్టోరీలో హరీష్ శంకర్ ప్రాముఖ్యత గల రోల్ అనగానే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో సెట్స్ మీద ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ కు పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు పూర్తి చేయాలని చూస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా విషయంలో హరీష్ శంక్ర్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది.