RGV సిండికెట్.. పులినోట్లో కెమెరా బాబోయ్ బీభత్సమే అన్నమాట..!
ప్రధానాంశాలు:
RGV సిండికెట్.. పులినోట్లో కెమెరా బాబోయ్ బీభత్సమే అన్నమాట..!
RGV : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ Ram Gopal Varma కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మళ్లీ తన మార్క్ సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా కొన్నాళ్లుగా పొలిటికల్ గేమ్ ఆడి ఒక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఆర్జీవి ఇప్పుడు నాకొద్దూ ఈ పాలిటిక్స్ అనుకుంటూ తన అసలు టాలెంట్ అయిన సినిమాల మీద ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్జీవి సిండికేట్ Syndicate అంటూ ఒక భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆర్జీవి తన ఒరిజినల్ టాలెంట్ తో సినిమా తీస్తే ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ అంతా కూడా ఆయన తర్వాతే అనిపిస్తాడు. ఐతే ఎందుకో సిండికేట్ విషయంలో రామ్ గోపాల్ వర్మ Ram Gopal Varma చాలా పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికే ఆర్జీవి సిండికేట్ లో ఎవరెవరు నటిస్తారన్న చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతుంది. ఐతే ఆర్జీవి సిండికేట్ అంటూ కొత్తగా ఒక పోస్టర్ పెట్టాడు. అందులో పులి నోట్లో కెమెరా లెన్స్ పెట్టి ఉంది.

RGV సిండికెట్.. పులినోట్లో కెమెరా బాబోయ్ బీభత్సమే అన్నమాట..!
RGV : సిండికేట్ ని చాలా పెద్ద ప్లానింగ్ తోనే..
సో రామ్ గోపాల్ వర్మ Ram Gopal Varma సిండికేట్ Syndicate ని చాలా పెద్ద ప్లానింగ్ తోనే తెరకెక్కిస్తున్నాడని అనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించే స్టార్స్ ఎవరా అన్న ఆసక్తి ఆడియన్స్ లో కూడా ఉంది. రామ్ గోపాల్ వర్మ సిండికేట్ తో తన సత్తా ఏంటన్నది చాటాలని చూస్తున్నాడు. నిజంగానే ఈ సినిమా ఆయన మార్క్ చూపిస్తుందా లేదా అన్నది చూడాలి.
ఆర్జీవి చేసే సిండికేట్ సినిమా విషయంలో అంచనాలైతే తారాస్థాయిలో ఉన్నాయి. సంచలనం ఇంటి పేరుగా మార్చుకున్న ఆర్జీవి సిండికేట్ తో చేయబోయే సంచలనాలు ఏంటన్నది చూడాలి. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఏంటి ఇంకా మిగతా విశేషాలు ఏంటన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. ఆర్జీవి సిండికేట్ విషయంలో ప్రతి అప్డేట్ వర్మ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది. ఆర్జీవి సిండికేట్ లో వెంకటేష్, అమితాబ్ బచ్చన్ నటిస్తారన్న టాక్ ఐతే ఉంది. ఐతే వర్మ వాటిపై క్లారిటీ ఇవ్వలేదు త్వరలో ఈ సినిమా కాస్టింగ్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. Ram Gopal Varma, RGV Movie