Hariteja Divorce : నేను విడాకులు తీసుకుంటే మీకేంట్రా నొప్పి.. హరితేజ షాకింగ్ వ్యాఖ్యలు వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: October 1, 2023, 7:00 pm

Hariteja Divorce : హరితేజ తెలుసు కదా. బిగ్ బాస్ వన్ కంటెస్టెంట్. బిగ్ బాస్ ద్వారానే తనేంటో, తన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. అంతకుముందే తను చాలా సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. బిగ్ బాస్ ద్వారా వచ్చింది. ఆ తర్వాత తనకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తనకు అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. దీంతో తను టాప్ సెలబ్రిటీ అయిపోయింది. పెద్ద పెద్ద సినిమాల్లోనూ తనకు అవకాశాలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ హరితేజ చాలా పాపులర్. హరితేజకు సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. తనకు పెళ్లి అయిన పిల్లలు కూడా ఉన్నాయి. అయినా తను ఇప్పటికీ ఇండస్ట్రీలో సినిమాల్లో నటిస్తోంది. తనకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.

సోషల్ మీడియాలో హరితేజ తన గ్లామర్ ను మాత్రం ఒలకబోస్తుంది. అందుకే తనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్. పెళ్లి అయి పిల్లలు ఉన్నా కూడా తన రేంజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. తన బ్యూటీ కూడా తగ్గకపోవడంతో తనకు రోజురోజుకూ ఫ్యాన్స్ పెరుగుతూ వెళ్తున్నారు. బుల్లితెరపై కూడా హరితేజ తనదైన ముద్ర వేసింది. బుల్లితెర షోలలోనూ కవ్వించిన హరితేజకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015 లోనే హరితేజ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లకు కూతురు కూడా జన్మించింది.

hariteja sensational comments on her divorce issue

#image_title

Hariteja Divorce : సింగిల్ గా వెకేషన్ మూడ్ ను ఎంజాయ్ చేస్తున్న హరితేజ

తాజాగా హరితేజ.. ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియాలో సింగిల్ గా హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. కూతురును కూడా తన తల్లి దగ్గరే వదిలేసి, భర్తను కూడా వదిలేసి ఒక్క హరితేజే హాలీడే ట్రిప్ కు వెళ్లింది హరితేజ. సింగిల్ గా ఫోటోలు పెడుతూ ఉండటంతో చాలామంది నెటిజన్లు.. మీ భర్తతో విడాకులు తీసుకున్నారా ఏంటి.. సింగిల్ గా వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు అంటూ హరితేజను నెటిజన్లు ప్రశ్నించగా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారు అంటూ తన భర్త ఫోటోను షేర్ చేసింది హరితేజ. దీంతో తన విడాకుల కామెంట్ కు పుల్ స్టాప్ పడినట్టు అయింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp