Star Heroine : ఈ యువతి ఎవరో గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు.. పెద్ద స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే నివ్వెరపోతారు

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 22, 2023, 1:40 pm

Star Heroine : ఈ ఫోటోలో ఉన్న యువతిని చూసి ఎవరో అని అనుకుంటున్నారా? తను ఎవరో కాదు.. హిందీ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి. ఆమె ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. 1993 లో తను బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. బాజీగర్ సినిమాతో తను హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1994 లో ఖిలాడి తు అనారీ అనే సినిమాలో నటించింది. శెట్టిది కర్ణాటకలోని మంగళూరు. తన మాతృ భాష తుళు.

ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఓ ఫార్మా కంపెనీలో పని చేసేవారు.తనకు ఒక చెల్లె కూడా ఉంది. తన పేరు షమితా శెట్టి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా శిల్పా శెట్టి ఉన్నత చదువులు చదివారు. ముంబైలో చదువుకున్నారు. తనకు భరతనాట్యం కూడా వచ్చు. అందులో తను ప్రావీణ్యం పొందింది. తను స్కూల్ లో చదువుకునే రోజుల్లో వాలీబాల్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించేది. 1992 లోనే తను ఇండస్ట్రీకి పరిచయం అయింది. గాతా రహే మేరా దిల్కి అనే మూవీ.

have you recognized this heroine who is star actress once

have you recognized this heroine who is star actress once

Star Heroine : 1992 లోనే తొలి సినిమా కానీ.. అది విడుదల కాలేదు

ఆ సినిమాకు దిలీప్ నాయక్ దర్శకత్వం వహించారు. కానీ.. ఆ సినిమా విడుదల కాలేదు. దీంతో ఆ తర్వాత బాజీగర్ సినిమాలో తను నటించింది. అదే తన తొలి మూవీ అయింది. అందులో షారుఖ్ ఖాన్, కాజోల్ జోడిగా నటించారు. బాజీగర్ సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఆ సినిమా ద్వారా షారుఖ్, కాజోల్ తో పాటు శిల్పా శెట్టికి కూడా మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి శిల్పా శెట్టికి చాలా ఆఫర్లు వచ్చాయి. తను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటికీ బాలీవుడ్ లో తనకు స్టార్ హోదా ఉంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp