Rashmika Mandanna : కోలీవుడ్ తళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు. తెలుగులో వారసుడు పేరుతో తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. శిరీశ్, పీవీపీ కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు, సాంగ్స్ విడుదల అయిన విషయం తెలిసిందే.
తమిళంలో రంజితమే అనే సాంగ్ ను మూవీ యూనిట్ ఇటీవలే విడుదల చేసింది. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో ఈ వీడియోకు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. తాజాగా తెలుగులోనూ ఈ పాటను విడుదల చేశారు. తెలుగు వర్షన్ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవడమే కాదు.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ పాట విడుదలయిందో లేదో.. దాంట్లో ఫన్నీ థింగ్స్ ను కూడా నెటిజన్లు చూసి రచ్చ చేస్తున్నారు. నిజానికి.. ఈ సాంగ్ లో బీట్ కు డ్యాన్స్ చేసి రష్మిక, విజయ్ దుమ్మరేపిన విషయం తెలిసిందే.
సాంగ్ లో డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే రష్మిక కుడి కాలికి ఉన్న పట్టీ ఊడిపోయిందట. అయినా కూడా పట్టించుకోకుండా రష్మిక అలాగే డ్యాన్స్ చేస్తూ ఉందట. కనీసం మూవీ యూనిట్ అయినా చూసుకోవాలి కదా. కానీ.. మూవీ యూనిట్ కూడా చూసుకోకుండా సాంగ్ ను రిలీజ్ చేయడం ఏంటి.. కనీసం పట్టి ఉందా లేదా కూడా చూసుకోరా? పట్టీ ఊడిపోయింది చూసుకోవాలి కదా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి.. దీనిపై మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.