Categories: EntertainmentNews

Moral Story : మ‌రిదితో ఎఫైర్ పెట్టుకుని భ‌ర్త‌ను చంపాల‌ని… పాము కూర తినిపించాల‌ని ప్ర‌య‌త్నం చివ‌ర‌కి..

Moral Story : ఒక‌రికి చెడు చేయాల‌ని చూస్తే ఎప్పటికైనా అది వాళ్ల‌కే చెడు చేస్తుంద‌ని పెద్ద‌వాళ్లు చెప్తుంటే వినే ఉంటాం. ఎవ‌రిని మోసం చేయాల‌ని చూసినా మొద‌ట స‌క్సెస్ కావ‌చ్చు కానీ చివ‌ర‌కి ప‌త‌నం త‌ప్ప‌దు. సొంత వాళ్ల‌ను కూడా మోసం చేస్తూ ఎందరో చివ‌ర‌కి క‌ష్టాలపాల‌వుతుంటారు. న‌ష్ట‌పోయిన వారు మొద‌ట బాధ‌ప‌డ‌వ‌చ్చు కానీ చివ‌ర‌కి సక్సెస్ అవుతారు. ప్ర‌స్తుతం ఇలాంటి క‌థ‌నే ఇప్పుడు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.. ఓ రాజ్యంలో జ‌రిగిన సంఘ‌ట‌న ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ రాజుకు మూడు కన్నులు ఉన్న కూతురు జన్మిస్తుంది. అయితే ఆ కూతురు జన్మించడం వలన రాజుకి నష్టమని ఆ అమ్మాయికి వివాహం చేసి పంపించేదాకా రాజుకి గండం తప్పదని జ్యోతిష్య పండితులు చెప్తారు. ఇక కొన్నాళ్లకు రాజు కూతురు యుక్త వయసుకు వస్తుంది. దీంతో వివాహం చేసి ఎక్క‌డికైనా పంపించాల‌ని నిర్ణ‌యించుకుంటాడు.

అయితే యువ‌రాణికి మూడు కన్నులు ఉండడంతో వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. దీంతో ఆమెను వివాహం చేసుకున్నవారికి వజ్ర, వైడూర్యాలు కానుకలు భారీస్థాయిలో ఇస్తానని రాజు ప్రకటిస్తాడు. అయితే ఇందులో ఓ కండీష‌న్ పెడ‌తాడు. అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత రాజ్యం నుండి దూరంగా వెళ్లిపోవాలని ష‌ర‌తు పెడ‌తాడు. ఈ వార్త కొద్ది రోజుల్లోనే రాజ్యమంతా విస్తరిస్తుంది. అయినా ఎవరూ వివాహం చేసుకోవడానికి ముందుకు రారు. అయితే ఈ వార్త విన్న ఓ అంధుడు తన వికలాంగుడు అయిన తమ్ముడు తో రాజ్యంలోకి వచ్చి మీ అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్తాడు. దానికి అంగీకరించిన రాజు తన కూతురుని ఇచ్చి వివాహం చేసి తాను ప్రకటించిన కానుకలు ఇచ్చి రాజ్యం నుండి పంపివేస్తాడు.

Having an affair with another person and killing her husband… she tried to feed snake curry..

Moral Story : సొద‌రుడికి తెలియకుండా..

కాగా ఆ అంధుడు , వికలాంగుడైన సోదరుడితో, రాజకుమారి కలిసి జీవిస్తూ ఉంటారు. అయితే రాజకుమారి తన మరది అయిన వికాలాంగుడుతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. ఎలాగైనా తన భర్తను చంపి తన మరిది తో ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని నిర్ణ‌యించుకుంటుంది. దీంతో ఓ విషపూరితమైన పాము ను తీసుకొచ్చి కూర వండి వ‌డ్డించి చంపేద్దామ‌ని వికలాంగుడు, రాజకుమారి ప్లాన్ వేస్తారు. ప‌థ‌కం ప్ర‌కారం చ‌నిపోయిన పాముని తీసుకువ‌చ్చి కూర వండుతూ త‌న అంధుడైన భ‌ర్త‌తో చేప‌ల కూర అని చెప్తారు.

అయితే మధ్యలో కూరను కదుపుతూ ఉండమని తన భర్త అయిన అంధుడికి అప్పగిస్తుంది. ఈ గ్యాప్ లో తన మరిది సరసాలు ఆడుతూ ఉంటుంది. అయితే కూరను కదుపుతున్న అంధుడికి ఆ పాము కూరలో నుండి వచ్చే ఆవిరితో చూపు వస్తుంది. దీంతో మ‌రిదితో స‌ర‌సాలు ఆడుతుండ‌గా చూసి షాక్ అవుతాడు. అలాగే న‌టిస్తూ ఆ మ‌రుస‌టి రోజు రాజు వ‌ద్ద‌కు వెళ్లి కూతురు చేసిన ప‌నిని చెప్తాడు. దీంతో మోసాన్ని గ్రహించిన రాజు తన రెండొ కూతురిని ఆ అంధుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఇందులో నీతి ఏంటంటే మ‌న త‌ప్పు చేయ‌నంత‌వ‌ర‌కు.. ఎదుటివారు మనకి చెడు చెయ్యాలని చూసినా మ‌నకు మంచే జ‌రుగుతుంద‌ని అర్థం.

Recent Posts

Guvvala Balaraju : బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు : రాంచందర్ రావు

Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…

12 minutes ago

Zodiac Signs : ఆగ‌స్ట్‌లో ఈ రాశుల వారు జ‌ర భద్రం…ఆర్ధికంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఎక్కువ‌..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…

1 hour ago

Coconut Oil : జిడ్డు వ‌ల‌న బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!

Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…

2 hours ago

Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?

Gym  : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…

3 hours ago

Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విష‌యంలో శ్రద్ధగా ఉండాలి..!

Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…

4 hours ago

Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌… ఇది ట్రై చేయండి..!

Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…

5 hours ago

Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…

6 hours ago

Varalakshmi Vratham : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.. ఏయే నైవేధ్యాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా..?

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…

7 hours ago