hema comments on shiva balaji
Hema : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఎంత పెద్ద రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. ఓ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ప్రచారం జరిగింద. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు మంచి విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. మా అధ్యక్షుడిగా విష్ణు ఎలక్ట్ అయ్యారు. ఈ సంగతులు అలా ఉంచితే.. ఎన్నికల సందర్భంగా హేమ అప్పట్లో శివబాలాజీ చేయి కొరికినట్లు వీడియోలు వచ్చాయి. కాగా, అస్సలు అప్పుడు ఏం జరిగిందనే విషయమై తాజాగా వివరణ ఇచ్చింది హేమ.పోలింగ్ రోజున హేమ శివబాలాజీ చేయి కొరకడం హాట్ టాపిక్ అయింది. ఈ విషయమై రచ్చ రచ్చ జరిగింది. అసలేం జరగిందనేది తాను ఆ రోజే వివరణ ఇద్దామనుకున్నానని, కానీ, ప్రకాశ్ రాజ్ అడ్డు చెప్పడం వలన ఆగిపోయానని తెలిపింది హేమ.
ఆ రోజే వివరణ ఇస్తే ఎన్నికలు ఆగిపోతాయని ప్రకాశ్ వద్దన్నారని చెప్పింది. తాజాగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది. మా ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు ప్యానెల్ మెంబర్స్, నరేశ్ ప్రకాశ్ రాజ్ ను చాలా సార్లు అవమానపర్చారని చెప్పింది హేమ. అయితే, ప్రకాశ్ రాజ్ గాంధేయ మార్గంలోనూ ఎన్నికల బరిలో ఉండి, ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదని గుర్తు చేసింది. విష్ణు ప్యానెల్ మెంబర్స్ ప్రవర్తన వలన ప్రకాశ్ రాజ్ ఐదు సార్లు కన్నీటిపర్యంతమయ్యారని, అది చూసి తనకు బాధ కలిగిందని తెలిపింది హేమ.ఆ రోజు విష్ణు ప్యానెల్‌కు చెందిన రాజేశ్వరి అనే ఆవిడ పేపర్స్ పంచుతున్నదని, అప్పుడు తాను అడ్డు చెప్పానని, అలా చేయొద్దన్నానని అంది హేమ. అయినా ఆమె అలానే చేసిందని గుర్తు చేసిన హేమ.. అప్పుడే ఓటు వేయడానికి వచ్చిన ప్రియమణి వద్దకు తాను వెళ్లానని తెలిపింది హేమ. ప్రియమణి వెళ్తున్న క్రమంలో మన కార్డు ఉందా?
hema comments on shiva balaji
అని మోహన్ బాబు అడిగారని, ప్రియమణి లేదని చెప్పడంతో శివబాలాజీ భార్య కార్డు ఇచ్చిందని, మన వాళ్లకు ఓటేయాలని ఆమె చెప్పందని తెలిపింది. ఇదంతా చూసి కూడా ఎలక్షన్ కమిషనర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది హేమ. ఈ క్రమంలోనే తమ ప్యానెల్ మెంబర్ ఒకరు ఓటు వేయాలని అభ్యర్థించగా, నరేశ్ రియాక్ట్ అయి వాడ్ని పట్టుకోండి వేసేద్దాం అన్నాడని, అలా నరేశ్ బాడీ గార్డ్స్ తమ ప్యానెల్ మెంబర్ పైన దాడి చేశారని వివరించింది హేమ. హ ీ క్రమంలోనే తాను దాడి ఆపేందుకు వెళ్తుండగా శివబాలాజీ చేయి అడ్డం పెట్టాడని, దాంతో తాను కొరికినట్లు నోరు తెరిచి ఆ అన్నానని, అలా తాను చేయగా, మీడియా వారు తప్పుగా చూపించారని వాపోయింది హేమ.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.