KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. రిపబ్లిక్ డే సాక్షిగా సీఎం కేసీఆర్ రాజ్యాంగంను అవమానించాడు అంటూ ఈటెల ఆరోపించాడు. ప్రతి ముఖ్య మంత్రి కూడా రిపబ్లిక్ డే సందర్బంగా రాజ్ భవన్ లో జరిగే వేడుకలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. రాజ్యాంగ బద్దంగా నియమించబడ్డ గవర్నర్ కు సీఎం కేసీఆర్ గౌరవం ఇవ్వలేదు. కనీసం సీనియర్ మంత్రులు ఎవరు కూడా రిపబ్లిక్ డే సందర్బంగా రాజ్ భవన్ లో జరిగిన వేడుకల్లో హాజరు కాకపోవడం విచారకరం అంటూ ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రజాస్వామ్యవాదులు ఎంతో ఆవేదన చెందే సంఘటన ఇది. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో హాజరు కాకపోవడం అనేది గవర్నర్ ను అవమానించినట్లే అంటూ ఈటెల పేర్కొన్నారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనక పోవడం అనేది ముమ్మాటికి రాజ్యాంగంను ఉల్లంఘించడం అవుతుందని కేసీఆర్ పై ఈటెల తీవ్ర విమర్శలు చేశారు. ఒక ముఖ్య మంత్రి రాజ్యాంగంను అపహాస్యం చేయడం దారుణం. రాష్ట్ర గవర్నర్ స్థానంను అవమానించడం మాత్రమే కాకుండా రాజ్యాంగంను పట్టించుకోవడం లేదని ఈటెల ఆరోపించాడు. ప్రగతి భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే కార్యక్రమాల్లో మంత్రులు మాట్లాడిన తీరు కూడా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈటెల పేర్కొన్నాడు. ముఖ్యంగా స్పీకర్ పోచారం మాట్లాడిన తీరు రాజ్యాంగం మీద విషం కక్కినట్లు ఉందని ఈటెల పేర్కొన్నాడు.
ఇటీవల ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు మరియు రైతులు చేసిన దాడి కూడా రాజ్యాంగ విరుద్దం అంటూ ఆరోపించాడు. కేసీఆర్ గతంలో మాదిరిగా ఇప్పుడు తన మాటలతో జనాలను ఒప్పించే శక్తి కోల్పోయాడు. జనాలను అందుకే బీజేపీ నాయకులపై దాడి చేయిస్తున్నాడు అంటూ ఈటెల పేర్కొన్నాడు. టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ నాయకులపైకి ఉసి గొల్పడం దారుణం. రాజ్యాంగంలో ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈటెల రాజేందర్ బీజేపీ నాయకులపై దాడిని ఖండించడంతో పాటు ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేయక పోవడం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.