Anasuya : అన‌సూయ‌పై ట్రోల్స్.. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకొని మాట్లాడండి అంటూ ఫైర్

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ న‌టిగాను, యాంక‌ర్‌గాను ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతూనే అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావిడి చేస్తుంది. కొన్ని సార్లు తాను చేసే కామెంట్స్ లేదంటే షేర్ చేసే ఫొటో వ‌ల‌న కూడా విమ‌ర్శ‌ల‌తో పాటు ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా అనసూయ అందరికీ రిపబ్లిక్ డే విషెష్ చెబుతూ ఎంతో అందంగా పాట పాడింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియోలో రెండు ఇబ్బందులు తలెత్తాయి. ఒకటి పాట పాడేటప్పుడు అనసూయ నిల్చోలేదు. ఇక రెండోది.. టీషర్ట్ మీద గాంధీ బొమ్మ ఉండడం.‘వందేమాతరం’ నిల్చొని పాడకుండా కుర్చీలో కూర్చొని కాలుపై కాలు వేసుకొని పాడింది.

అనసూయ పాడిన వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలప‌డంతో ఈ వీడియోని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. జాతీయ గేయం అయినా, జాతీయ గీతం అయినా, ఎలాంటి దేశభక్తి సాంగ్స్ అయినా నిల్చొని పాడాలి. ఈ మాత్రం తెలీదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ వీడియోలో అనసూయ గాంధీ బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకోవ‌డంపై కూడా వారు మండిప‌డ్డారు.త‌న‌పై వ‌చ్చిన ట్రోల్స్‌పై అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇలాంటివి నిల్చొని పాడాలి అని అన్నవారికి ”నేనే సారీ చెబుతున్నా. ఇదంతా చూస్తుంటే నేను నిల్చోకుండా పాడినందుకు చాలా మంది హర్ట్​ అయినట్టున్నారు.

anasuya got trolls on republic day wishes post

Anasuya : అన‌సూయ‌నా, మ‌జాకానా..!

కానీ అది మీకు ఏదైనా అర్థాన్ని ఇస్తే, నిలబడి గౌరవం చూపించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దేశభక్తి గీతాలన్నిటికి నేను గౌరవం ఇస్తాను అని పోస్ట్ చేసింది. అలాగే టీషర్ట్​పై గాంధీ బొమ్మపై వచ్చిన కామెంట్లకు ”అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు. మరి జనగణమణ ఏంది? ఆగస్ట్​ 15, 1947 తర్వాతే జనవరి 26, 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా మాట్లాడండి. హ్యాపీ రిపబ్లిక్​ డే” అని అనసూయ తన స్టోరీ లో పోస్ట్ చేసింది.

anasuya got trolls on republic day wishes post

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago