
hema tells about her bad experience
Hema : పలు చిత్రాలలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన నటి హేమ. ఇటీవలి కాలంలో హేమ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆ మధ్య శివ బాలాజీని కొరికి అందరి దృష్టిని ఆకర్షించిన హేమ ఆ తర్వాత తన జీవితంలో జరిగిన పలు విషయాల గురించి తెలియజేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. సినిమాలో పని చేసిన హీరోలు హీరోయిన్, ముఖ్య నటీనటులు కష్టపడినప్పటికీ వాళ్లకు షూటింగ్ సమయంలో సరైన వసతులు ఉంటాయి కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చిన్న నటీనటులకు ఇబ్బందులు తప్పవు. అలాంటి ఇబ్బందులనే తాను కూడా ఎదురుకున్నానని క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ తాజాగా ఓ ఇంటర్వూలో చెప్పింది.
రాజోలు నుంచి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ చెన్నై వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకొని ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది హేమ. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ కష్టాలను గుర్తు చేసుకుంటూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఇప్పుడంటే కారవాన్ లు ఉన్నాయిగానీ అప్పట్లో షూటింగ్ స్పాట్ లో అలాంటి ఏర్పాట్లు ఉండేవి కాదని చెప్పింది. కనీసం టాయిలెట్ లు కూడా ఉండేవి కాదని, బట్టలు మార్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు తలేత్తేవి అని చెప్పింది హేమ.తన తరం కంటే తన ముందు తరం ఇంకా ఇబ్బందులు పడిందని చెప్పిన హేమ..
hema tells about her bad experience
ఇక ముత్యాల సుబ్బయ్యగారి భారతనారి అనే సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపింది. ముత్యాల సుబ్బయ్య గారి భారత నారి అనే ఓ సినిమా చేస్తున్న సమయంలో తనను ఓ ప్రొడక్షన్ బాయ్ అవమానించాడని చెప్పిన హేమ.. ఆ రోజు జరిగిన సంఘటనను వివరించింది. షూటింగ్ బ్రేక్ సమయంలో డైరెక్టర్ గారు, యూనిట్ అందరితో కలిసి భోజనం చేస్తుండగా ప్రొడక్షన్‌కి చెందిన ఓ బాయ్ వచ్చి ఇక్కడ కాదు అక్కడికి వెళ్లి తిను అనేశాడని, ఆ సమయంలో చిర్రెత్తే కోపం వచ్చి వెంటనే టేబుల్ ఎత్తి పడేసి కుర్చీ తీసి అతనిపై విసిరెయ్య బోయానని చెప్పింది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.