Hema : టాయిలెట్స్ కూడా లేక బ‌ట్ట‌లు మార్చుకోవ‌డానికి ఇబ్బందులు ప‌డ్డానన్న హేమ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hema : టాయిలెట్స్ కూడా లేక బ‌ట్ట‌లు మార్చుకోవ‌డానికి ఇబ్బందులు ప‌డ్డానన్న హేమ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :4 February 2022,3:30 pm

Hema : ప‌లు చిత్రాల‌ల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన న‌టి హేమ‌. ఇటీవ‌లి కాలంలో హేమ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆ మ‌ధ్య శివ బాలాజీని కొరికి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన హేమ ఆ త‌ర్వాత త‌న జీవితంలో జ‌రిగిన ప‌లు విష‌యాల గురించి తెలియ‌జేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. సినిమాలో ప‌ని చేసిన హీరోలు హీరోయిన్, ముఖ్య న‌టీన‌టులు క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ వాళ్లకు షూటింగ్ స‌మ‌యంలో స‌రైన వ‌స‌తులు ఉంటాయి కానీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు చిన్న న‌టీన‌టుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు. అలాంటి ఇబ్బందుల‌నే తాను కూడా ఎదురుకున్నాన‌ని క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ తాజాగా ఓ ఇంట‌ర్వూలో చెప్పింది.

రాజోలు నుంచి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ చెన్నై వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకొని ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది హేమ. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ కష్టాలను గుర్తు చేసుకుంటూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఇప్పుడంటే కార‌వాన్ లు ఉన్నాయిగానీ అప్ప‌ట్లో షూటింగ్ స్పాట్ లో అలాంటి ఏర్పాట్లు ఉండేవి కాద‌ని చెప్పింది. క‌నీసం టాయిలెట్ లు కూడా ఉండేవి కాద‌ని, బ‌ట్ట‌లు మార్చుకోవాల‌న్నా చాలా ఇబ్బందులు త‌లేత్తేవి అని చెప్పింది హేమ‌.త‌న త‌రం కంటే త‌న ముందు త‌రం ఇంకా ఇబ్బందులు ప‌డింద‌ని చెప్పిన హేమ‌..

hema tells about her bad experience

hema tells about her bad experience

Hema : క‌ష్టాల గురించి చెప్పిన హేమ‌..

ఇక ముత్యాల సుబ్బ‌య్య‌గారి భార‌త‌నారి అనే సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు ఓ చేదు అనుభ‌వం ఎదురైంద‌ని తెలిపింది. ముత్యాల సుబ్బయ్య గారి భారత నారి అనే ఓ సినిమా చేస్తున్న సమయంలో తనను ఓ ప్రొడక్షన్ బాయ్ అవమానించాడని చెప్పిన హేమ.. ఆ రోజు జరిగిన సంఘటనను వివరించింది. షూటింగ్ బ్రేక్ సమయంలో డైరెక్టర్ గారు, యూనిట్ అందరితో కలిసి భోజనం చేస్తుండగా ప్రొడక్షన్‌కి చెందిన ఓ బాయ్ వచ్చి ఇక్కడ కాదు అక్కడికి వెళ్లి తిను అనేశాడని, ఆ సమయంలో చిర్రెత్తే కోపం వచ్చి వెంటనే టేబుల్ ఎత్తి పడేసి కుర్చీ తీసి అతనిపై విసిరెయ్య బోయానని చెప్పింది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది