hema tells about her financial status
Hema : నటి హేమ టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందింది. పలు సినిమాల్లో అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ షోలోను కొన్ని రోజులు సందడి చేసింది. ఉన్నది కొన్ని రోజులే అయిన తెగ రచ్చ చేసిన బయటకు వచ్చింది. ఇటీవల మా ఎలక్షన్స్ లోను హేమ హంగామా మాములుగా లేదు. శివబాలాజీ చేయి కొరికి వార్తలలోకి ఎక్కింది. అయితే కొద్ది రోజులుగా హేమ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తలలో నిలుస్తుంది. రీసెంట్‌గా కెరీర్ మొదట్లో తన పడ్డ ఇబ్బందులు గురించి చెప్పుకొచ్చింది.
ఇప్పుడంటే షూటింగ్ లకు వెళ్లినప్పుడు బట్టలు మార్చుకునేందుకు క్యారెవ్యాన్ లు ఉండేవి గానీ అప్పట్లో అలాంటివి ఏమీ ఉండేవి కాదని చెప్పింది. దుస్తులు మార్చుకోవాలన్నా…టాయిలెట్ కు వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పింది. ముత్యాల సుబ్బయ్యగారి భారతనారి అనే సినిమాలో నటిస్తున్న సమయంలో తాను డైరెక్టర్ మరికొందరి తో కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఓ ప్రొడక్షన్ బాయ్ తనను పక్కకు వెళ్లి తినమన్నారన్ని చెప్పింది. దాంతో తనకు కోపం వచ్చి అక్కడే ఉన్న టేబుల్ ను విసిరేసానని కుర్చీని అతడిపై విసిరేసానని తెలిపింది. ఇక తాజాగా ఆమెకు వందల కోట్ల ఆస్తులు ఉన్నట్టు వార్తలు రాగా,దానిపై స్పందించింది.
hema tells about her financial status
హేమకు వందల కోట్ల ఆస్తులున్నాయని వస్తున్న వార్తలపై ప్రశ్నించగా.. వందల కోట్లైతే లేవు గానీ ఉన్నవరకు బాగానే ఉన్నాయని, తన కూతురిని సెటిల్ చేసేంత సంపాదించానని చెప్పింది. ఇప్పటికీ సంపాదిస్తూనే ఉన్నానని, ఇంకా కూడా సంపాదిస్తా అని తెలిపింది. తలవంచే పని తప్పితే, ఏ పనీ అయినా చేయానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని హేమ చెప్పుకొచ్చింది. తన కెరీర్ ఆరంభంలో వేలల్లోనే మాట్లాడే తాను ఇప్పుడు లక్షల్లో మాట్లాడాల్సి వస్తోందని చెప్పింది. చిన్నప్పటి నుంచే తనకు క్యాష్ మేనేజ్‌మెంట్ చేయడం తెలుసని, ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెడతానని చెప్పింది హేమ
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.