Taraka Ratna : తుది శ్వాస విడిచిన నందమూరి తారకరత్న..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: February 18, 2023, 10:07 pm

Taraka Ratna : జనవరి 27వ తారీకు నారా లోకేష్ “యువగళం” పాదయాత్ర స్టార్ట్ కావడం తెలిసిందే. ఈ క్రమంలో పాదయాత్ర మొదటి రోజు టీడీపీ కేడర్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. ఇదే కార్యక్రమానికి వచ్చిన హీరో నందమూరి తారకరత్న.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం తెలిసిందే. వెంటనే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి.. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించటంతో ఆరోజు రాత్రి హుటాహుటిన బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంతో అప్పటినుండి బెంగళూరులో ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నారు.

hero nandamuri Taraka Ratna passed away

hero nandamuri Taraka Ratna passed away

ఆయన ఆరోగ్యం పై రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ అప్ డేట్స్ ఇస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. గుండెపోటుకు గురైన తారకరత్న.. ఆరోగ్యం మొదటి నుంచి ఆందోళనకరంగానే ఉంది. ఈ క్రమంలో వైద్యులు తమ శక్తికి మేర చికిత్స అందిస్తూ వచ్చారు. ఇదే సమయంలో విదేశీ వైద్యులను పిలిపించి మరీ కూడా ఆయనకు ప్రత్యేకమైన వైద్య సేవలను అందించడం జరిగింది. ఇటీవల గుండె మరియు మెదడుకు సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ అందించారు. అయినా గాని ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కొద్దిసేపటి క్రితం తారకరత్న

hero nandamuri Taraka Ratna passed away

hero nandamuri Taraka Ratna passed away

తుది శ్వాస విడవటం జరిగిందట. దాదాపు 20 రోజులకు పైగా… చావుతో పోరాడిన తారకరత్న కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడవటం జరిగిందంట. ఈ వార్తతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు కుటుంబ సభ్యులు తలడిలిపోతున్నారు. తారకరత్ననీ బతికించుకోవడానికి బాలకృష్ణ ఎంతగానో శతవిధాల కృషి చేశారు. ఆసుపత్రిలో తారకరత్న బాగోగులు మొత్తం బాలకృష్ణ దగ్గర ఉండి అనీ చూసుకున్నారు. ఇదే సమయంలో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించారు. అయినా గాని మరణించడం అందరికీ విభ్రాంతిని కలిగించింది. తారకరత్న మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు తల్లడిల్లి పోతున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp