Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కే పంచ్.. పరువుతీసిన నాటి హీరో రోహిత్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 15 April 2022, 10:00 pm

Sudigali Sudheer : నాటి హీరో రోహిత్ అందరికీ గుర్తుండే ఉంటాడు. 16టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి సినిమాలో వరుస హిట్లు కొట్టేశాడు. కొద్ది కాలంలోనే రైజింగ్ స్టార్ అనే బిరుదును అందుకున్నాడు. ఏకంగా చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఓ స్పెషల్ రోల్ పట్టేశాడు. చిరంజీవి కాలర్ పట్టుకునే ఆ సీన్‌తో రోహిత్ మరింతగా ఫేమస్ అయ్యాడు. అయితే రోహిత్ చాలా కాలం తరువాత మళ్లీ కనిపించాడు.

బుల్లితెరపై రోహిత్‌ను తీసుకొచ్చింది శ్రీదేవీ డ్రామా కంపెనీ యూనిట్. వచ్చే ఆదివారం రాబోతోన్న ఈ ఎపిసోడ్‌లో రోహిత్ కనిపించబోతోన్నాడు. అయితే వచ్చీ రాగానే సుధీర్‌ను ఆడుకున్నాడు రోహిత్. ఏంటి సార్ ఇంత గ్లామర్‌గా ఉన్నారు? అని సుధీర్ అంటాడు. దీనికి రోహిత్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. దీన్ని గ్లామర్ అని అంటారు.. నీకు తెలీదులే అని కౌంటర్ వేస్తాడు.ఆ వెంటనే మళ్లీ సుధీర్ మరో డైలాగ్ వేస్తాడు. సర్ అదేంటి.. మీ ఇన్‌స్పిరేషన్‌తోనే ఇక్కడి వరకు వచ్చాను అని సుధీర్ అంటాడు.

Hero Rohit Satires On Sudigali Sudheer In Sridevi Drama Company

Hero Rohit Satires On Sudigali Sudheer In Sridevi Drama Company

దీంతో ఒక్కసారిగా రోహిత్ ఉలిక్కిపడతాడు. ప్లీజ్ దీన్ని కట్ చేసేయరా? లేదంటే బయటకు వెళ్లాక నాకు ప్రాబ్లం అవుతుంది అని సుధీర్ మీద పంచ్ వేసేశాడు రోహిత్. మొత్తానికి సుధీర్ గురించి, సుధీర్ పేరుకి ఉన్న ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే.మొత్తానికి రోహిత్‌ను ఇలా చాలా రోజుల తరువాత చూడటంతో అందరూ నాటి సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇలా మిమ్మల్ని చూడటం హ్యాపీగా ఉందంటూ నెటిజన్లు యూట్యూబ్‌లో కామెంట్లు పెడుతున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి