Gopichand : జీవితంలో ఎవరు చేయని పెద్ద తప్పు చేసిన గోపీచంద్ .. అందుకే స్టార్ హీరో కాలేకపోయాడు ..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: March 11, 2023, 4:00 pm

Gopichand : టాలీవుడ్ లో ‘ తొలివలపు ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. ఈ సినిమాలో హీరోయిన్ గా స్నేహ నటించింది. ఫస్ట్ సినిమాతో గోపీచంద్ మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ జయం, వర్షం, నిజం సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ విలన్ పాత్రతో గోపీచంద్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. అయితే గోపీచంద్ హీరో అవ్వటానికి ఇండస్ట్రీకి వచ్చాడు. ఇలా విలన్ పాత్రలు చేయడం ఏంటి అని స్నేహితులు, సన్నిహితులు చెప్పడంతో మళ్ళీ హీరోగా కెరీర్ను స్టార్ట్ చేశాడు.

Hero Tottempudi Gopichand done that mistake in his life

Hero Tottempudi Gopichand done that mistake in his life

ఈ క్రమంలోనే గోపీచంద్ హీరోగా కొన్ని సినిమాలను చేసి సక్సెస్ అందుకున్నాడు. అయితే విలన్ గా చేసిన అంత క్రేజ్ మాత్రం దక్కలేకపోయింది. ఈ క్రమంలోనే కొందరు బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను చేయమని చెప్పారు. విలన్ గా పలు పాత్రలలో నటించిన గోపీచంద్ రొమాన్స్ చేసాడు. జయం, నిజం సినిమాలలో బోల్డుగా నటించాడు. ఈ క్రమంలోనే ఆయనకు డైరెక్టర్స్ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను ముందుకు తీసుకొచ్చారు. కానీ గోపీచంద్ అలాంటివి చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. హీరోగా సెటిల్ అవ్వకపోయినా పర్లేదు కానీ నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు.

Jayam Movie || Gopichand Search for Nitin Action Scene || Nitin & Sadha -  YouTube

ఒకవేళ నిజంగా గోపిచంద్ సిగ్గులేకుండా అలాంటి క్యారెక్టర్స్ చేసి ఉంటే ఇప్పుడు కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఉండేవాడు. ప్రస్తుతం గోపీచంద్ తనదైన స్టైల్ వచ్చిన సినిమాలను యాక్సెప్ట్ చేస్తూ లైఫ్ నీ ముందుకు తీసుకెళుతున్నాడు. ఇక గోపీచంద్ గతేడాది మారుతి దర్శకత్వంలో ‘ పక్కా కమర్షియల్ ‘ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో తదుపరి సినిమాపై మరింత దృష్టిని సారించాడు. ఇక గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp