Actress Jayalakshmi : గోపీచంద్ సినిమాలో చేసినందుకు తిట్లు తిన్నాను.. నటి జయలక్ష్మి..! | The Telugu News

Actress Jayalakshmi : గోపీచంద్ సినిమాలో చేసినందుకు తిట్లు తిన్నాను.. నటి జయలక్ష్మి..!

Actress Jayalakshmi : నటి జయలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. చాలా సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి, అత్త పాత్రలు చేసి మెప్పించారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జయలక్ష్మి తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయలక్ష్మి పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. గోపీచంద్ రీసెంట్ మూవీ ‘ రామాబాణం ‘ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Actress Jayalakshmi : గోపీచంద్ సినిమాలో చేసినందుకు తిట్లు తిన్నాను.. నటి జయలక్ష్మి..!

  •  నటి జయలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం

Actress Jayalakshmi : నటి జయలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. చాలా సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి, అత్త పాత్రలు చేసి మెప్పించారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జయలక్ష్మి తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయలక్ష్మి పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. గోపీచంద్ రీసెంట్ మూవీ ‘ రామాబాణం ‘ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో తాను ఎలాంటి పాత్రలు పోషిస్తున్నానో అందరికీ తెలుసని, కొన్నిసార్లు అజ్ఞానం వల్ల మంచి ఆఫర్లు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.

రామ్ చరణ్ సినిమా ఒకటి మిస్ అయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు డేట్స్ అడ్జస్ట్ కాక రెండు విధాలుగా నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. అయితే గోపీచంద్ రామబాణం సినిమాలో చేయడానికి జయలక్ష్మి ఆసక్తి చూపించారట. కానీ కొన్ని కారణాల వలన తిట్లు తిన్నట్లు తెలిపారు. రామబాణం సినిమాలో రెండు సీన్లు పూర్తి చేశారట. కానీ ఇతర కారణాల వలన సినిమా డీలే అయిందట. గోపీచంద్ కు ఫ్రాక్చర్ అవ్వటం వలన ఆ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయిందని జయలక్ష్మి పేర్కొన్నారు.

అయితే తాను అమెరికా వెళ్లే డేట్ కంటే తర్వాత షూటింగ్ డేట్స్ ఇచ్చారట. కానీ అమెరికా వెళ్తున్న ఈ సమయంలో డేట్స్ ఇస్తే ఎలా అని అడిగితే సీరియస్ అయ్యారట. తన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి కదా అని అడిగితే ఫారెన్ ట్రిప్స్ వెళ్లే వాళ్లకు సినిమాలు ఎందుకు అని అన్నారట. ఇలా ఇష్టానుసారంగా మాట్లాడడంతో తాను చాలా బాధపడిపోయానని జయలక్ష్మి పేర్కొన్నారు. ఇలా తాను గోపీచంద్ రామబాణం సినిమాలో రెండు సీన్లు పూర్తి చేసినప్పటికీ వాళ్లు నన్ను తిట్టడం చాలా బాధ వేసింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...