Star Heroine : ఈ ఫోటోలో ఉన్న పాప .. ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ .. గుర్తుపట్టగలరా ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Star Heroine : ఈ ఫోటోలో ఉన్న పాప .. ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ .. గుర్తుపట్టగలరా ..!!

Star Heroine : ప్రస్తుతం నెట్టింట్లో ఇప్పటి స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఒకప్పుడు ఐరన్ లెగ్ ముద్ర వేసుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఇంతకు ఈ అమ్మడు ఎవరంటే బక్క సుందరి పూజ హెగ్డే. కర్ణాటకలో జన్మించి ముంబైలో పెరిగిన ఈ ముద్దుగుమ్మ ముందు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 January 2023,1:40 pm

Star Heroine : ప్రస్తుతం నెట్టింట్లో ఇప్పటి స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఒకప్పుడు ఐరన్ లెగ్ ముద్ర వేసుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఇంతకు ఈ అమ్మడు ఎవరంటే బక్క సుందరి పూజ హెగ్డే. కర్ణాటకలో జన్మించి ముంబైలో పెరిగిన ఈ ముద్దుగుమ్మ ముందు మోడలింగ్లో కెరీర్ ను ప్రారంభించింది. 2010లో మిస్ యూనివర్స్ పోటీలో సెకండ్ రన్నరప్ గా నిలిచింది.

2012లో కోలీవుడ్ హీరో జీవా నటించింన మూగమూడి సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇక తెలుగులో నాగచైతన్య కు జోడిగా ఓ లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తో ముకుంద సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలన్నీ యావరేజ్ గా ఆడాయి. తర్వాత బాలీవుడ్ లోకి హృతిక్ రోషన్ నటించిన మోహంజోదారో సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఈ అమ్మడుకు ఐరన్ లెగ్ అని ముద్ర పడింది.

heroin Pooja Hegde childhood photos viral

heroin Pooja Hegde childhood photos viral

ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి డీజే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టింది. ఇక తర్వాత వెను తిరిగి చూసుకోలేదు. రంగస్థలం సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి ఫుల్ పాపులర్ అయింది. మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైకుంఠ పురములో ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మంచి సక్సెస్ ను అందుకుంది. ప్రస్తుతం మోస్ట్ డిమాండ్ గల హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఎంతో క్యూట్ లుక్స్ తో అదరగొడుతుంది. ఈ ఫోటోలు స్టైలిష్ గా నిల్చుని కొంటె చూపులు చూస్తూ అందరిని మాయ చేస్తుంది.

May be an image of 1 person

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది