Heroin Sneha : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్ స్నేహ.. తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసిన బ్యూటీ..

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 13 August 2022, 3:20 pm

Heroin Sneha : హీరోయిన్ స్నేహ తన అందంతో, నటనతో సినిమాలో మంచి పేరును సంపాదించుకుంది. స్నేహ ఎక్కువగా ఎక్స్పోజింగ్ ఇవ్వకుండా చీర కట్టుతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. హీరో వెంకటేష్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ సంక్రాంతి ‘ సినిమాలో హీరోయిన్ స్నేహ నటించింది. ఈ సినిమాలో తన చీరకట్టుతో అందంతో తన సహజ నటనతో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సినిమా అప్పుడు ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా హిట్ తర్వాత స్నేహ తెలుగులో ఎన్నో సినిమాలను చేశారు.

తరుణ్ తో ‘ ప్రియమైన నీకు ‘ సినిమాను నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తరువాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపింది. కానీ కొన్ని సినిమాలు ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రానివ్వలేదు. ప్రస్తుతం స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో రాణిస్తున్నారు. పది ఏళ్ల క్రితం అచ్చంముండు సినిమాలో నటుడు ప్రసన్నతో జోడి కట్టింది. ఆ సినిమా ద్వారానే వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారడంతో ఆయనని జీవిత భాగస్వామిగా చేసుకుంది ఈ అమ్మడు. అలా వారి ప్రేమ పెళ్లికి ప్రతిఫలం ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు ఒక కూతురు.

Heroin Sneha share the family photos in social media

Heroin Sneha share the family photos in social media

పిల్లల విషయంలో స్నేహ, ప్రసన్న స్పెషల్ కేర్ తీసుకుంటారు. స్నేహ, ప్రసన్న పిల్లలకు సంబంధించి ప్రతి విషయాన్ని అందమైన వేడుకగా నిర్వహిస్తారు. అలాగే వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అదేవిధంగా సంసార జీవితంలో దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే గురువారం ప్రసన్న స్నేహ కొడుకు పుట్టినరోజు. ఈ బాబుకు ఇప్పుడు ఏడేళ్లు. దీంతో పిల్లలను రెడీ చేసే పనిలో భాగంగా స్నేహ తన ఇద్దరు పిల్లలతో స్విమ్మింగ్ ఫూల్ లో కాసేపు వాళ్లతో ఆడుకున్నారు. ఆ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి