Mahesh Rajamouli Movie : మహేష్ రాజమౌళి సినిమా లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరు ఊహించని కాంబో కెవ్వు కేక..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Rajamouli Movie : మహేష్ రాజమౌళి సినిమా లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరు ఊహించని కాంబో కెవ్వు కేక..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 December 2024,9:45 pm

ప్రధానాంశాలు:

  •  Mahesh Rajamouli Movie : మహేష్ రాజమౌళి సినిమా లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరు ఊహించని కాంబో కెవ్వు కేక..!

Mahesh Rajamouli Movie : సూపర్ స్టర్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుది. ఈ సినిమాను కె లె నారాయణ నిర్మిస్తుండగా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతున్నారని తెలుస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్ ని ఎంపిక చేసే పనుల్లో ఉన్నారు రాజమౌళి. ఈ సినిమాలో నటీనటుల ఎంపికలో కూడా రాజమౌళి తన పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారు. మహేష్ సినిమాలో ఇదివరకు కొరియన్ హీరోయిన్ ని తీసుకుంటారన్న టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాలో ఫైనల్ గా మన హీరోయిన్ నే లాక్ చేస్తున్నారట. ఇంతకీ మహేష్ రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కథానాయిక ఎవరు అంటే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే సెటిల్ అయిన పీసీ అదే ప్రియాంకా చోప్రా అని తెలుస్తుంది.

Mahesh Rajamouli Movie మహేష్ రాజమౌళి సినిమా లో హీరోయిన్ ఫిక్స్ ఎవరు ఊహించని కాంబో కెవ్వు కేక

Mahesh Rajamouli Movie : మహేష్ రాజమౌళి సినిమా లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరు ఊహించని కాంబో కెవ్వు కేక..!

Mahesh Rajamouli Movie పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్..

మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే అదే రేంజ్ ఉండాలి. ఐతే ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్ భారీ అంచనాలతో వస్తుంది కాబట్టి సినిమాకు తగినట్టుగానే హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నారు. అందుకే ప్రియాంకా చోప్రా అయితే అందుకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంకా చోప్రా ఇందియన్ సినిమాలు మానేసింది.

అక్కడే హాలీవుడ్ వెబ్ సీరీస్ లు చేసుకుంటూ వస్తుంది. ఐతే ఆఫ్టర్ లాంగ్ టైం ప్రియాంకా చోప్రా ఇండియన్ సినిమాకు ఓకే చెప్పబోతుందని తెలుస్తుంది. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. కాబట్టి ఆయన సినిమా అంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో మార్కెట్ ఉంటుందని ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. మరి ప్రియాంక చోప్రా నిజంగానే ఈ సినిమా చేస్తుందా లేదా అన్నది అఫీషియల్ అప్డేట్ వస్తేనే తెలుస్తుంది. మహేష్ ప్రియాంకా ఆన్ స్క్రీన్ జోడీ కడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. పీసీ ఇండియన్ సినిమాలు మానేసిన ఈ టైం లో తెలుగు సినిమా కోసం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. Mahesh, Rajamouli, Movie, Priyanka Chopra, RRR

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది