Actress Madhavi Latha : 2008వ సంవత్సరంలో “నచ్చావులే” సినిమాతో బెజవాడ అమ్మాయి మాధవిలత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించటంతో.. తర్వాత ఈ తెలుగు ముద్దుగుమ్మకి మంచి అవకాశాలు రావడం జరిగాయి. ఆ తరువాత స్నేహితుడా, అరవింద్ 2 సినిమాలలో కూడా నటించడం జరిగింది. అయితే అందంతో మంచి టాలెంట్ ఉన్నా గానీ మాధవిలత పెద్దగా సక్సెస్ కాలేదు. ఈమెతో పాటు అదే సమయంలో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన..

తోటి తెలుగమ్మాయిలు అంజలి, ఈషారెబ్బ లాంటి వాళ్లకు వచ్చిన క్రేజ్ కూడా దక్కించుకోలేకపోయింది. 2009లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన “అతిధి”లో హీరోయిన్ స్నేహితురాలుగా కూడా ఆమె కనిపించింది. హీరోయిన్ గా ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయిన మాధవిలత 2019 ఎన్నికలకు ముందు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. బీజేపీ నుంచి గుంటూరు వెస్ట్ సీటులో పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్
అంటూ హడావిడి చేసి వార్తల్లో నిలిచింది. ఈ రకంగా వైరల్ అవుతూ ఉండే మాధవి లతా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టీ ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్టు స్పష్టం చేయడం జరిగింది. ఆ పోస్ట్ లో …నేను ఒక వ్యక్తిని కలిశాను.. ముందు అతడిని అర్థం చేసుకోవాలి… ఆ తర్వాత రెండు వైపులా తల్లిదండ్రుల నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. అయితే ఇది అంత త్వరగా జరిగే పని కాదని.. మరో ఏడాదికి పైగా సమయం పట్టొచ్చు.. తాను అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో మీకు తప్పకుండా చెప్తా.. పెళ్లి తేదీ గురించి మాత్రం అడగవద్దు అని మాధవిలత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.