Rashmika Mandanna : 2021లో విడుదలైన “పుష్ప” సినిమా హీరోయిన్ రష్మికా మందన్న తలరాత పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాతో ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా క్రేజ్ దక్కించుకుంది. కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగు సినిమా రంగంలో “చలో” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన గీతాగోవిందం సినిమాతో యూత్ క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత మహేష్ బాబుతో “సరిలేరు నీకెవరు” సినిమా చేసి 2021లో సుకుమార్ దర్శకత్వంలో బన్నీతో కలిసి “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో విజయం అందుకుంది. ఈ సినిమాలో డైలాగ్స్ మరియు పాటలు స్టెప్పులు ప్రపంచాన్ని ఉర్రూతలుగించాయి. ఆ తర్వాత పాన్ ఇండియా
లెవెల్ లో రష్మిక సినిమా అవకాశాలు అందుకుంటూ ఉంది. ఇదిలా ఉంటే నిన్న ఐపీఎల్ టోర్నీ స్టార్ట్ కావడం తెలిసిందే. అయితే ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో.. రష్మిక మందన మరియు తమన్నా ఇద్దరు లైవ్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. RRR “నాటు నాటు” సాంగ్ తో పాటు “పుష్ప” సినిమాలోని పాటలకు అదిరిపోయే మాస్ స్టెప్పులు వేయడం జరిగింది. ఇప్పటివరకు ఐపీఎల్ వేడుకలకు బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే స్టెప్ లు వేయడం జరిగింది. కానీ ఫస్ట్ టైం రష్మిక, తమన్నా మోడ్రన్ దుస్తులలో… వేసిన స్టెప్పులకు స్టేడియం దద్దరిల్లిపోయింది. అరుపులు కేకలతో ఆడియన్స్ రచ్చ రచ్చ చేశారు. తమన్నా మోడ్రన్ డ్రెస్సులు రష్మిక ట్రెడిషనల్ లుక్ లో లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో చెలరేగిపోయారు.
ఈ క్రమంలో ఈవెంట్ లో కొద్ది నిమిషాల పాటు రష్మిక వేసిన స్టెప్పులకు ఏకంగా ఐదు కోట్లు చార్జ్ చేయడం జరిగిందట. ఇక తమన్నాకి మూడు కోట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రష్మికకి ఐదు కోట్లు ఇవ్వటం వెనకాల ఆమెకున్న క్రేజ్ అని సమాచారం. ఈ రకంగా ఓ ఈవెంట్ లో కొద్ది నిమిషాల పాటు స్టెప్పులు వేసి అంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ .. అందుకోవటం బాలీవుడ్ భామలకు కూడా సాధ్యం కానిది రష్మిక సొంతం చేస్తుందని అంటున్నారు. ఒక్కసారి డాన్స్ చేయడం కోసం ‘ అంత డబ్బు ‘ తీసుకుందా .. IPL దెబ్బకి రష్మిక కోట్లు లాగింది అంటూ తాజా వార్తపై నెటిజన్ లు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
This website uses cookies.