Sai Pallavi : మరో రెండున్నర కోట్ల రూపాయల డీల్ ని కాదనుకున్న సాయి పల్లవి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sai Pallavi : మరో రెండున్నర కోట్ల రూపాయల డీల్ ని కాదనుకున్న సాయి పల్లవి

Sai Pallavi : టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌ లో కూడా మంచి పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈమె చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా.. చేసుకోకున్నా కూడా ఈమె క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది తెలుగు లో ఈమె నటించిన లవ్‌ స్టోరీ మరియు విరాటపర్వం సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలు తెచ్చిన క్రేజ్‌ తో […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 August 2022,12:00 pm

Sai Pallavi : టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌ లో కూడా మంచి పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈమె చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా.. చేసుకోకున్నా కూడా ఈమె క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది తెలుగు లో ఈమె నటించిన లవ్‌ స్టోరీ మరియు విరాటపర్వం సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలు తెచ్చిన క్రేజ్‌ తో సాయి పల్లవికి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. కాని ఆమె మాత్రం సినిమాలకు నో చెబుతూనే ఉంది. ఆ మధ్య ఒక తమిళ స్టార్‌ హీరో సినిమాకు నో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే సోషల్‌ మీడియాలో గుప్పుమంటున్నాయి.

ఇటీవల ఒక ప్రముఖ దర్శకుడు సాయి పల్లవిని కలిసి లేడీ ఓరియంటెడ్‌ సినిమా కథను చెప్పాడట. కేవలం 40 రోజుల డేట్లు కావాలని అడిగాడట. ఆ కథ లో హీరోయిన్ పాత్ర అత్యంత పవర్ ఫుల్ గా ఉంటుంది. తక్కువ రోజుల డేట్లు ఇచ్చినా కూడా రెండు కోట్లకు పైగానే పారితోషికం ఇచ్చేందుకు కూడా ఆ దర్శకుడు ఓకే చెప్పాడట. కథ వినమని విజ్ఞప్తి చేస్తే వినేందుకు ఓకే చెప్పిన సాయి పల్లవి స్టోరీ లైన్ విన్న తర్వాత తాను సినిమాను చేయలేను అన్నదట. పెద్దగా సినిమాలు చేయకున్నా కూడా సాయి పల్లవి మాత్రం ఇలాంటి కమర్షియల్‌ సినిమాలకు ఓకే చెప్పడం లేదు.

heroine Sai Pallavi one more big deal cancel

heroine Sai Pallavi one more big deal cancel

ఒక హీరోయిన్ కి కోటి వరకు పారితోషికం ఆఫర్‌ రావడం చాలా పెద్ద విషయం. అలాంటి సమయంలో సాయి పల్లవి రెండు కోట్లు అంతకు మించి ఆఫర్లు వస్తున్నా కూడా ఈజీగా కాదు అని ఎలా అనగలుగుతుంది అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. సాయి పల్లవి సినిమాలు చేయాలని వరుసగా కమిట్ అవ్వడం మొదలు పెడితే ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉండేవి. వాటి ద్వారా పది కోట్లకు పైగానే ఆదాయం ఆమెకు వచ్చేది. కానీ సాయి పల్లవి మాత్రం పెద్దగా సినిమాలను చేయకుండానే ఆ భారీ మొత్తంను కూడా తృణప్రాయంగా వద్దంటుంది. సాయి పల్లవి ఉద్దేశ్యం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది