Sai Pallavi : టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈమె చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా.. చేసుకోకున్నా కూడా ఈమె క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది తెలుగు లో ఈమె నటించిన లవ్ స్టోరీ మరియు విరాటపర్వం సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలు తెచ్చిన క్రేజ్ తో సాయి పల్లవికి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. కాని ఆమె మాత్రం సినిమాలకు నో చెబుతూనే ఉంది. ఆ మధ్య ఒక తమిళ స్టార్ హీరో సినిమాకు నో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి.
ఇటీవల ఒక ప్రముఖ దర్శకుడు సాయి పల్లవిని కలిసి లేడీ ఓరియంటెడ్ సినిమా కథను చెప్పాడట. కేవలం 40 రోజుల డేట్లు కావాలని అడిగాడట. ఆ కథ లో హీరోయిన్ పాత్ర అత్యంత పవర్ ఫుల్ గా ఉంటుంది. తక్కువ రోజుల డేట్లు ఇచ్చినా కూడా రెండు కోట్లకు పైగానే పారితోషికం ఇచ్చేందుకు కూడా ఆ దర్శకుడు ఓకే చెప్పాడట. కథ వినమని విజ్ఞప్తి చేస్తే వినేందుకు ఓకే చెప్పిన సాయి పల్లవి స్టోరీ లైన్ విన్న తర్వాత తాను సినిమాను చేయలేను అన్నదట. పెద్దగా సినిమాలు చేయకున్నా కూడా సాయి పల్లవి మాత్రం ఇలాంటి కమర్షియల్ సినిమాలకు ఓకే చెప్పడం లేదు.
ఒక హీరోయిన్ కి కోటి వరకు పారితోషికం ఆఫర్ రావడం చాలా పెద్ద విషయం. అలాంటి సమయంలో సాయి పల్లవి రెండు కోట్లు అంతకు మించి ఆఫర్లు వస్తున్నా కూడా ఈజీగా కాదు అని ఎలా అనగలుగుతుంది అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. సాయి పల్లవి సినిమాలు చేయాలని వరుసగా కమిట్ అవ్వడం మొదలు పెడితే ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉండేవి. వాటి ద్వారా పది కోట్లకు పైగానే ఆదాయం ఆమెకు వచ్చేది. కానీ సాయి పల్లవి మాత్రం పెద్దగా సినిమాలను చేయకుండానే ఆ భారీ మొత్తంను కూడా తృణప్రాయంగా వద్దంటుంది. సాయి పల్లవి ఉద్దేశ్యం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.